'ఒంటరిగా నిద్రించాలంటే భయమేస్తోంది'
ఎప్పుడు ఏ వైపు నుంచి అభిమానులు దూసుకు వచ్చి హోటల్ లో రచ్చ చేస్తారేమోనని భయానికి గురవుతున్నాడు. అభిమానుల బెడదకు ఒంటరిగా నిద్రించాలంటే భయమేస్తోంది అంటున్నాడు జస్టిన్ బీబర్. అభిమానులెవరూ రాకుండా 24 గంటలు సెక్యూరిటీ ఉండేలా చూడాలని బాడీగార్డ్ కు బీబర్ సూచించారు. అభిమానుల బెడదకు ఒంటరిగా కూడా ఉండేందుకు భయపడుతున్నాను. చిన్న శబ్దమైనా ఉలిక్కి పడుతున్నాను అని టీనేజ్ సంచలనం తెలిపాడు.
తనకు ఇద్దరు బాడీగార్డులు కాపలా ఉన్నా.. ఎదో తెలియని ఆందోళన అని అన్నాడు. వచ్చే వారం ఆస్ట్రేలియాలోని పెర్త్ లో వరల్డ్ టూర్ ముగియనుంది. అయితే ప్రదర్శన జరిగే రోజుల్లో అమ్మను తనకు తోడుగా ఉండాలని కోరాను అని బీబర్ తెలిపాడు. కొద్ది రోజుల క్రితం వేశ్యగృహంలో బీబర్ మీడియా కంటపడటం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ప్రదర్శన జరిగిన రోజున అభిమానులు వాటర్ బాటిల్ విసిరిన సంగతి తెలిసిందే.