నగరంలో వ్యభిచార గృహంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు.
సరూర్‌నగర్(హైదరాబాద్ క్రైం): నగరంలో వ్యభిచార గృహంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఒక ఇంటిలో వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు.
అక్కడ వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు యువతులను, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక యువతి కూడా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.