స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు
⇒ పారాలింపిక్స్ విజేతలకు కేంద్రం నజరానా
న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లను మరింత ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారికి నజరానాలు ప్రకటించింది. బ్రెజిల్ లోని రియో డి జనీరోలో ఈనెల 7 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో స్వర్ణం సాధించే అథ్లెట్‌కు రూ.75 లక్షలు ఇవ్వనున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు తమ అధికార ట్వీట్టర్ పేజీలో పేర్కొంది. భారత్ నుంచి ఈసారి ఎన్నడూ లేని విధంగా 17 మందితో కూడిన బృందం ఈ గేమ్స్‌కు వెళ్లింది. 2004 ఏథెన్స్లో స్వర్ణం గెలిచిన దేవేంద్ర జాజరియా ఈసారి కూడా జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో బరిలోకి దిగబోతున్నాడు.