ఒలింపిక్స్ చివరి దశకు చేరుకున్నాయి. దాంతో విదేశీయులను ఆకట్టుకునేందుకు అక్కడున్న దాదాపు 12 వేల మంది సెక్స్ వర్కర్లు 50 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించారట.
ఒలింపిక్స్ చివరి దశకు చేరుకున్నాయి. మరో వారం రోజుల్లో ఇవి ముగియబోతున్నాయి. దాంతో విదేశీయులను ఆకట్టుకునేందుకు అక్కడున్న దాదాపు 12 వేల మంది సెక్స్ వర్కర్లు 50 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించారట. అయితే ఈసారి మాత్రం తాము అనుకున్న దానికంటే వ్యాపారం చాలా డల్‌గా ఉందని చెబుతున్నారు.
రియోలో అతిపెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన విలా మిమోసా ప్రాంతం మరకానా స్టేడియంకు 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు వస్తే.. రోడ్డు మీద దోపిడీ దొంగలకు చిక్కుకుపోతామనే భయంతో చాలామంది ఆగిపోతున్నారని తెలిసింది. ఈ నగరంలో ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల్లో ఏకంగా రెండు వేల హత్యలు జరిగాయి.
ప్రస్తుతం ఈ రెడ్‌లైట్ ఏరియాలో ధరలు రూ. 1500 నుంచి రూ. 840కి పడిపోయాయని చెబుతున్నారు. విదేశీయులకు అర్థం అయ్యేందుకు వీలుగా ఇంగ్లీషు, పోర్చుగీసు, ఇతర భాషల్లో కూడా తగ్గింపు ధరలను రాసి పోస్టర్లు వేస్తున్నారు. బ్రెజిల్‌లో గత 18 ఏళ్లుగా వ్యభిచారం చట్టబద్ధంగా నడుస్తోంది. అయితే వేశ్యాగృహాలు నడపడం మాత్రం అక్కడ చట్టవిరుద్ధం.