
కొత్తా... దేవతండీ!
సామాజికం
‘‘మా అమ్మాయికి ఆ భగవంతుడు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఇచ్చాడు’’ అంటున్నాడు ఎలని నాన్న ఎడటో సాంటోస్.
క్యాన్సర్ నుంచి ఎయిడ్స్ వరకు ఎలాంటి రోగాన్ని అయినా సరే, ఎలని సాంటోస్ నయం చేస్తుందనే వార్తలతో బ్రెజిల్‌లోని ఊరూవాడా మారుమోగిపోతోంది. ఎనిమిది సంవత్సరాల ‘ఎలని’ ఇప్పుడు చాలామంది దృష్టిలో బాల దేవత!
రియో డి జెనిరోలో తన తండ్రి పని చేసే చర్చిలో రోగులతో మాట్లాడి, వారి బాధలను తెలుసుకొని ప్రార్థనలు చేస్తుంటుంది ఎలని. ‘‘రోగులు వారానికి రెండుసార్లు ఈ అమ్మాయి చేతిని తాకితే చాలు. ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది’’ అంటున్నారు ఎలనీని విశ్వసించే వాళ్లు.
‘‘ప్రజల రోగాలను నయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. రోజులో చాలాసేపు రకరకాల రోగులను చేతితో ముట్టుకుంటూనే ఉంటాను.
ఆ తరువాత దేవుడిని ప్రార్థించగానే వాళ్లు స్వస్థులవుతారు’’ అంటోంది ఎలని.