పోలీసుల కల్లుగప్పి జైలునుంచి తప్పించుకోవడంలో క్రిమినల్స్ వేసే ఎత్తులు చూస్తుంటే ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది. హాలివుడ్ సినిమా వాళ్లకు కూడా రాని కళాత్మకతను వీరు తమ ‘కళ’ల్లో చూపిస్తుంటారు. విషయం ఏంటంటే.. డాన్‌లలో డ్రగ్ మాఫియా డాన్‌ల రూటే సపరేటంటూ బ్రెజిల్‌లోని జైల్‌లో ఉన్న ఓ డ్రగ్‌మాఫియా డాన్‌కు ఓ ఐడియా వచ్చింది. అచ్చం తన టీనేజర్ కూతురులా రెడీ అయి జైలు నుంచి తప్పించుకోవాలనేది అతని ప్లాన్. కానీ చివరి నిమిషంలో అమ్మాయిలా నటించడంలో మాత్రం సక్సెస్ కాలేక ‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు.
బ్రెజిల్, డ్రగ్ మాఫియా డాన్, రియోడిజెనిరో