నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది : పీలే కుమార్తెలు | Pele "super well", says daughter | Sakshi
Sakshi News home page

నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది : పీలే కుమార్తెలు

Published Sat, Nov 29 2014 1:00 PM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది : పీలే కుమార్తెలు

నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది : పీలే కుమార్తెలు

రియాడిజనీరో:  బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన కుమార్తెలు శనివారం వెల్లడించారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. పీలే ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయికి చేరిందని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 

74 ఏళ్ల పీలే మూత్ర సంబంధిత సమస్యలతో ఇటీవల సావ్ పాలోని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. పీలే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడిన నేపథ్యంలో ఈ నెలలో ఇదే ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు శస్త్ర చికిత్స అందించారు. నవంబర్13న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement