చివరి చూపు కోసం... | Brazil bids farewell to king of football Pele with 24-hour wake | Sakshi
Sakshi News home page

చివరి చూపు కోసం...

Published Tue, Jan 3 2023 4:45 AM | Last Updated on Tue, Jan 3 2023 4:46 AM

Brazil bids farewell to king of football Pele with 24-hour wake - Sakshi

నివాళి అర్పిస్తున్న పీలే భార్య మార్షియా ఒకీ (నలుపు డ్రెస్‌లో)

సావోపాలో: బ్రెజిల్‌ ఆరాధ్య ఫుట్‌బాలర్‌ పీలేను కడసారి చూసేందుకు అభిమానులు సోమవారం ఉదయం నుంచే ఆయన పార్థివదేహం ఉంచిన విలా బెల్మిరా స్టేడియం ముందు క్యూ కట్టారు. 82 ఏళ్ల సాకర్‌ సూపర్‌స్టార్‌ గురువారం క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే!

సావోపాలో శివారులో ఉన్న స్టేడియం సామర్థ్యం 16000 మాత్రమే! కానీ పెద్ద సంఖ్యలో అభిమానులు, సాంటోస్‌ క్లబ్‌ ఆటగాళ్లు, బ్రెజిల్‌ జాతీయ ఆటగాళ్లు తమ దిగ్గజానికి తుది నివాళులు అర్పించారు. ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్‌ఫాంటినో, అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం సాంటోస్‌ వీధుల గుండా అంతిమయాత్ర ముగించాక మెమోరియల్‌ నెక్రొపొలె ఎక్యుమెనికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనికి బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో హాజరవుతారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement