Brazil football legend
-
Pele: ఆస్తుల పంపకం.. 30 శాతం మూడో భార్యకు; 70 శాతం పిల్లలకు
లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే గతేడాది డిసెంబర్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా పీలేకు సంబంధించిన ఆస్తుల పంపకాలు లాయర్ల సమక్షంలో కుటుంబసభ్యలుకు అప్పజెప్పినట్లు సమాచారం. పీలే కోరిక మేరకు వీలునామా ప్రకారం ఆస్తిలో 30 శాతం వాటా అతని భార్యకు దక్కిందని ఆమె తరపు లాయర్ లూయిస్ కిగ్నెల్ పేర్కొన్నారు. ఇక మిగిలిన 70 శాతం వాటా ఆయన పిల్లలకు పంచినట్లు తెలిపారు. కాగా పీలే మొత్తంగా మూడు వివాహాలు చేసుకోగా.. ఇద్దరితో విడిపోయిన పీలే.. చివరిగా 2010 నుంచి మార్సియా సిబెలె హోకితో రిలేషన్ కొనసాగించిన పీలే.. 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. పీలే కడశ్వాస వరకు మార్సియా అతని పక్కనే ఉండి సపర్యలు చేసింది. దీనికి కృతజ్ఞతగా పీలే తన మరణానంతరం ఆస్తిలో 30 శాతం వాటా ఇవ్వాలని వీలునామా రాయించాడు. ఈ మేరకు పీలే చివరి రోజుల్లో గడిపిన గౌరౌజాలోని మాన్షన్ హౌస్(విల్లా) మార్సియాకు వెళ్లనుంది. దీనితో పాటు సావో పాలోని రిసార్ట్ కూడా ఆమెకే దక్కనుందని లాయర్ లూయిస్ కిగ్నెల్ తెలిపారు. మిగిలిన 70 శాతం ఆస్తులను పీలే పిల్లలు పంచుకోనున్నారు. పీలేకు ఏడుగురు పిల్లలు ఉండగా.. ప్రపంచానికి పరిచయం కాని మరో కూతురు కూడా వీరితో సమానంగా ఆస్తిని పంచుకోనుండడం విశేషం. పీలే చనిపోయే ముందే వీలునామాలో తన 70 శాతం ఆస్తులను ఎనిమిది మంది సమానంగా పంచుకోవాలని రాశాడు. వీలునామాలో పీలే పేర్కొన్న ప్రకారమే పిల్లలకు ఆస్తి పంపకాలు జరుగుతాయని లాయర్లు పేర్కొన్నారు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించాడు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారాడు. తన అటాకింగ్ స్కిల్స్‌తో ఫిఫా ప్రపంచాన్ని ఊపేశారు. తన డ్రిబ్లింగ్ టాలెంట్‌తో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించేవాడు. తన సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన పీలే... 1363 మ్యాచులు ఆడి 1283 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ సాధించిన పీలే.. 1959లో ఒకే ఏడాదిలో 127 గోల్స్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. చదవండి: ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర.. 'కోచ్‌గా ఉన్నప్పుడు'.. రవిశాస్త్రిపై రోహిత్ శర్మ ఆగ్రహం -
చివరి చూపు కోసం...
సావోపాలో: బ్రెజిల్ ఆరాధ్య ఫుట్‌బాలర్ పీలేను కడసారి చూసేందుకు అభిమానులు సోమవారం ఉదయం నుంచే ఆయన పార్థివదేహం ఉంచిన విలా బెల్మిరా స్టేడియం ముందు క్యూ కట్టారు. 82 ఏళ్ల సాకర్ సూపర్‌స్టార్ గురువారం క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే! సావోపాలో శివారులో ఉన్న స్టేడియం సామర్థ్యం 16000 మాత్రమే! కానీ పెద్ద సంఖ్యలో అభిమానులు, సాంటోస్ క్లబ్ ఆటగాళ్లు, బ్రెజిల్ జాతీయ ఆటగాళ్లు తమ దిగ్గజానికి తుది నివాళులు అర్పించారు. ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినో, అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం సాంటోస్ వీధుల గుండా అంతిమయాత్ర ముగించాక మెమోరియల్ నెక్రొపొలె ఎక్యుమెనికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో హాజరవుతారు. -
Pele: 'నాకేం కాలేదు బాగానే ఉన్నా.. భయపడకండి'
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్వయంగా స్పష్టతనిచ్చాడు. తాను బాగానే ఉన్నానని.. తిరిగి కోలుకుంటున్నట్లు ప్రకటించాడు. 82 ఏళ్ల పీలేకు గతేడాది క్యాన్సర్ కారణంగా పెద్ద పేగులో కణతిని తొలగించారు. అప్పటినుంచి తరచూ చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నాడు. తాజాగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబసభ్యులు సావో పౌలో పట్టణంలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆదివారం ఉదయం పీలే పరిస్థితి విషమంగా ఉందని.. కీమో థెరపీకి కూడా స్పందించడం లేదని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు ప్రచారంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా పీలే స్పందించాడు. తాను బాగానే ఉన్నట్లు వెల్లడించాడు. తన కోసం ప్రార్థిస్తున్న వాళ్లంతా ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని.. తాను బాగానే ఉన్నానని ప్రకటించాడు. తాను సానుకూల దృక్పథంతో ఉన్నట్లు.. చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పాడు. దేవుడిపై తనకు విశ్వాసం ఉందని.. మీరు చూపిస్తున్న ప్రేమ నాకు మరింత శక్తినిస్తోందని తెలిపాడు. ఈ సందర్భంగా తన కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు, చికిత్స అందిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా పీలేకు గతేడాది క్యాన్సర్ సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత ఆయన కోలుకున్నారు. తిరిగి ఇటీవల క్యాన్సర్ సంబంధిత సమస్యతోనే ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆరోగ్యంపై రోజుకో రకంగా వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Pelé (@pele) చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? -
దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం..
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కీమోథెరపీ చికిత్సకు స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పీలేను పాలియేటివ్ కేర్‌కు తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా గతేడాది అతని పెద్ద పేగు నుంచి కణతిని తొలగించారు. అప్పటినుంచి పీలే క్రమం తప్పకుండా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నారు. కాగా ఇటీవలే పీలే ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబసభ్యులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో చేర్చారు. శరీరం పై వాపులు రావడం వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారు. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. పీలే కూతురు స్పందించారు. చికిత్స కోసమే తన తండ్రి పీలేను ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదని, భయపడాల్సింది కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము అని కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే ఇలా కీమోథెరపీకి స్పందించడం లేదని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పీలే వయసు 82ఏళ్లు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచారు. తన కెరీర్లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్ రికార్డ్. బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. పీలే.. మూడు వరల్డ్ కప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు FIFA WC: నరాలు తెగే ఉత్కంఠ.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా -
ఆసుపత్రిలో చేరిన దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్
Pele Hospitalized For Treatment Of Colon Tumor: గత కొంతకాలంగా కోలన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే(81) ఆసుపత్రిలో చేరాడు. సంవత్సర కాలంగా పీలే పెద్ద పేగు కణితి సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుమార్తె పేర్కొంది. త్వరలోనే పీలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, పీలే ఈ ఏడాది సెప్టెంబర్‌లో కణితి తొలగింపుకు సంబంధించిన శస్త్రచికిత్సను చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన ఐసీయూలో ఉన్నారు. ఇదిలా ఉంటే, మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. చదవండి: లెజెండ్స్ క్రికెట్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్.. -
'నా తండ్రికి ప్రాణాపాయం తప్పింది.. మీ అందరికి కృతజ్ఞతలు'
బ్రెసిలియా: అనారోగ్యం బారిన పడ్డ బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కోలుకుంటున్నారు. పెద్ద ప్రేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పీలే బ్రెజిల్‌లోని సావోపాలో ఆసుపత్రిలో చేరారు. కాగా ఆయనకు రెండు రోజుల క్రితం వైద్యులు సర్జరీ నిర్వహించారు. అప్పటినుంచి ఐసీయూలో ఉన్న పీలేను తొందరలోనే రెగ్యులర్ రూమ్‌కు షిఫ్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా పీలే కూతురు తన తండ్రి ఆరోగ్య విషయమై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. చదవండి: PELE: ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం.. ''నా తండ్రి సర్జరీ అనంతరం త్వరగానే కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయనను రెగ్యులర్ రూమ్‌కు షిఫ్ట్ చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఇంటికి కూడా వెళ్లనున్నాం. మీ అందరి దీవెనలతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. సర్జరీ చేసి ఆయనను మాములు మనిషిని చేసిన వైద్యుల బృందానికి, అండగా నిలిచిన ఆసుపత్రి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అతను కోలుకోవాలని ప్రార్థిస్తూ లక్షల మంది అభిమానులు పంపించిన మొయిల్స్, విషెస్‌కు కృతజ్ఞతలు. మీ మెయిల్స్ అన్ని చదవలేకపోయినా.. ఆయనపై చూపించిన ప్రేమ, అభిమానం మిమ్మల్ని మరింత దగ్గర చేసింది. థ్యాంక్యూ సో మచ్'' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. ఇక ఫుట్‌బాల్ క్లబ్ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్ క్లబ్‌కు 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్ చేశాడు. చదవండి: Emma Raducanu: అంతా నాలుగు నెలల్లోనే... అనామక ప్లేయర్ నుంచి చాంపియన్ దాకా! View this post on Instagram A post shared by Kely Nascimento (@iamkelynascimento) -
ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం..
న్యూఢిల్లీ: అనారోగ్యంతో బాధపడుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలేకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పెద్దప్రేగుకు సర్జరీ అనంతరం పర్యవేక్షణ నిమిత్తం అతన్ని ఐసీయూలో ఉంచారు. అయితే, ప్రస్తుతం పీలే ఆరోగ్యం నిలకడగా ఉందని, కీలక అవయవాలన్నీ మెరుగ్గా పని చేస్తున్నాయని, ఆయన ఉత్సాహంగా మాట్లాడగలుతున్నారుని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. తన ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందంటూ పీలే తన ఇన్‌స్టా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా గత నెలలో ఆసుపత్రికి వెళ్లగా.. పెద్దపేగులో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని వెంటనే సర్జరీ ద్వారా తొలగించాలని తెలిపారు. రొటీన్ కార్డియోవాస్కులర్, లాబోరేటరీ పరీక్షల్లో భాగంగా ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. ఇక క్లబ్ ఫుట్‌బాల్ విషయానికొస్తే.. ఈ పోటీల్లో సైతం అత్యధిక గోల్స్ రికార్డు పీలే పేరిటే ఉండేది. ఈ రికార్డును అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ లియోనల్ మెస్సీ గతేడాదే బ్రేక్ చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్ క్లబ్‌కు 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్ చేయగా, 2004 నుంచి 2020 వరకు బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ.. 17 సీజన్ల పాటు ఆడి 749 మ్యాచ్‌ల్లో 644 గోల్స్ చేసి పీలే రికార్డును అధిగమించాడు. చదవండి: టెన్నిస్ చరిత్రలో పెనుసంచలనం -
పీలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
రియో డి జెనీరో : బ్రెజిల్ పుట్‌బాల్ దిగ్గజం పీలే ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వారు తెలిపారు. ప్రొస్టెట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన్ని ఇటీవల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. దాంతో ఆయన్ని ఆదివారం డిశ్చార్జి చేశారు. ఇటీవల పీలే (74) తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు పలు శస్త్ర చికిత్సలు చేసిన సంగతి తెలిసిందే. ఫుట్ బాల్ ప్రపంచ కప్ టైటిళ్లను మూడు సార్లు గెలుచుకున్న అరుదైన ఆటగాడిగా పీలే రికార్డు సృష్టించారు. -
నాన్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది : పీలే కుమార్తెలు
రియాడిజనీరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన కుమార్తెలు శనివారం వెల్లడించారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. పీలే ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయికి చేరిందని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 74 ఏళ్ల పీలే మూత్ర సంబంధిత సమస్యలతో ఇటీవల సావ్ పాలోని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. పీలే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడిన నేపథ్యంలో ఈ నెలలో ఇదే ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు శస్త్ర చికిత్స అందించారు. నవంబర్13న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన పీలే
రియాడిజనీరో: బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సావ్ పాలోని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రి ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 74 ఏళ్ల పీలే- మూత్ర సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మూత్రపిండాల్లో రాళ్లు తొలగించుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే- ఈనెల 13న ఇదే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 2004లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే, ఆ తరువాత 2012 లో ఎముక సంబంధింత ఆపరేషన్ చేయించుకున్నారు.