మళ్లీ ఆస్పత్రిలో చేరిన పీలే | Pele remains in hospital in stable condition | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆస్పత్రిలో చేరిన పీలే

Published Thu, Nov 27 2014 10:25 PM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

మళ్లీ ఆస్పత్రిలో చేరిన పీలే

మళ్లీ ఆస్పత్రిలో చేరిన పీలే

రియాడిజనీరో: బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సావ్ పాలోని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రి ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 74 ఏళ్ల పీలే- మూత్ర సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు తొలగించుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే- ఈనెల 13న ఇదే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 2004లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే, ఆ తరువాత 2012 లో ఎముక సంబంధింత ఆపరేషన్ చేయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement