Sao Paulo hospital
-
పీలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
రియో డి జెనీరో : బ్రెజిల్ పుట్బాల్ దిగ్గజం పీలే ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వారు తెలిపారు. ప్రొస్టెట్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన్ని ఇటీవల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. దాంతో ఆయన్ని ఆదివారం డిశ్చార్జి చేశారు. ఇటీవల పీలే (74) తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు పలు శస్త్ర చికిత్సలు చేసిన సంగతి తెలిసిందే. ఫుట్ బాల్ ప్రపంచ కప్ టైటిళ్లను మూడు సార్లు గెలుచుకున్న అరుదైన ఆటగాడిగా పీలే రికార్డు సృష్టించారు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన పీలే
రియాడిజనీరో: బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సావ్ పాలోని ఆల్బర్ట్ ఐనస్టీన్ ఆస్పత్రి ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 74 ఏళ్ల పీలే- మూత్ర సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మూత్రపిండాల్లో రాళ్లు తొలగించుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే- ఈనెల 13న ఇదే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 2004లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే, ఆ తరువాత 2012 లో ఎముక సంబంధింత ఆపరేషన్ చేయించుకున్నారు.