లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే గతేడాది డిసెంబర్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా పీలేకు సంబంధించిన ఆస్తుల పంపకాలు లాయర్ల సమక్షంలో కుటుంబసభ్యలుకు అప్పజెప్పినట్లు సమాచారం. పీలే కోరిక మేరకు వీలునామా ప్రకారం ఆస్తిలో 30 శాతం వాటా అతని భార్యకు దక్కిందని ఆమె తరపు లాయర్ లూయిస్ కిగ్నెల్ పేర్కొన్నారు. ఇక మిగిలిన 70 శాతం వాటా ఆయన పిల్లలకు పంచినట్లు తెలిపారు.
కాగా పీలే మొత్తంగా మూడు వివాహాలు చేసుకోగా.. ఇద్దరితో విడిపోయిన పీలే.. చివరిగా 2010 నుంచి మార్సియా సిబెలె హోకితో రిలేషన్ కొనసాగించిన పీలే.. 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. పీలే కడశ్వాస వరకు మార్సియా అతని పక్కనే ఉండి సపర్యలు చేసింది. దీనికి కృతజ్ఞతగా పీలే తన మరణానంతరం ఆస్తిలో 30 శాతం వాటా ఇవ్వాలని వీలునామా రాయించాడు. ఈ మేరకు పీలే చివరి రోజుల్లో గడిపిన గౌరౌజాలోని మాన్షన్ హౌస్(విల్లా) మార్సియాకు వెళ్లనుంది. దీనితో పాటు సావో పాలోని రిసార్ట్ కూడా ఆమెకే దక్కనుందని లాయర్ లూయిస్ కిగ్నెల్ తెలిపారు.
మిగిలిన 70 శాతం ఆస్తులను పీలే పిల్లలు పంచుకోనున్నారు. పీలేకు ఏడుగురు పిల్లలు ఉండగా.. ప్రపంచానికి పరిచయం కాని మరో కూతురు కూడా వీరితో సమానంగా ఆస్తిని పంచుకోనుండడం విశేషం. పీలే చనిపోయే ముందే వీలునామాలో తన 70 శాతం ఆస్తులను ఎనిమిది మంది సమానంగా పంచుకోవాలని రాశాడు. వీలునామాలో పీలే పేర్కొన్న ప్రకారమే పిల్లలకు ఆస్తి పంపకాలు జరుగుతాయని లాయర్లు పేర్కొన్నారు.
మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించాడు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారాడు. తన అటాకింగ్ స్కిల్స్‌తో ఫిఫా ప్రపంచాన్ని ఊపేశారు. తన డ్రిబ్లింగ్ టాలెంట్‌తో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించేవాడు.
తన సుదీర్ఘ కెరీర్‌లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన పీలే... 1363 మ్యాచులు ఆడి 1283 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ సాధించిన పీలే.. 1959లో ఒకే ఏడాదిలో 127 గోల్స్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment