
Pele Hospitalized For Treatment Of Colon Tumor: గత కొంతకాలంగా కోలన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే(81) ఆసుపత్రిలో చేరాడు. సంవత్సర కాలంగా పీలే పెద్ద పేగు కణితి సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుమార్తె పేర్కొంది. త్వరలోనే పీలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, పీలే ఈ ఏడాది సెప్టెంబర్‌లో కణితి తొలగింపుకు సంబంధించిన శస్త్రచికిత్సను చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన ఐసీయూలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది.
చదవండి: లెజెండ్స్ క్రికెట్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్..