ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బ్లేడుతో గొంతుకోసుకునే యత్నం
మదనపల్లె : మాజీ సైనికుడి కోటాలో మంజూరైన భూమిని సబ్ డివిజన్ చేయాలని కోరితే.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఓ మాజీ సైనికుడు ఆత్మహత్యకు యత్నించాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరుగు తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమంలో రామచంద్ర బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు
అధికారులు, పోలీసు లు వెంటనే అడ్డుకుని అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. రామచంద్ర మాట్లాడుతూ 2006లో తనతో పాటు మాజీ సైనికులైన మరో ఇద్దరికి వెంకప్పకోట పంచాయతీలో డీకేటీ పట్టాలు మంజూరు చేసినట్టు తెలిపారు. తమ స్థలానికి పక్కనే టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుండటంతో దానికి రోడ్డు అవసరమై కింద ఉన్న ఇద్దరు సైనికుల భూములకు స్కెచ్‌లతో పాటు ఎన్‌ఓసీని రెవెన్యూ అధికారులు మంజూరుచేసినట్టు తెలిపారు.
వారికి ఆనుకుని ఉ న్న తన భూమి సర్వే నంబర్‌ను రీ సర్వేలో భాగంగా తొలగించారని, దీనిపై ఐదేళ్లుగా కార్యాలయం చు ట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తహ సీల్దార్ ఖాజాబీ మాట్లాడుతూ స్కెచ్‌ల ఆధారంగా రామచంద్రకు న్యాయం చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment