- ఎనిమిది మంది నిందితుల అరెస్టు
- రూ.5.24 లక్షల దొంగనోట్లు స్వాధీనం
- దండపల్లె వాసులు, పోలీసులకు ఎస్పీ
- అభినందనలు
చిత్తూరు(అర్బన్): జిల్లాలోని పశ్చి మ మండలాలు, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠాకు పోలీసులు కళ్లెం వేశారు. గంగవరం కేంద్రంగా జరుగుతున్న ఈ తతంగంలో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసు లు వారి నుంచి ప్రింటర్, స్కానర్‌తో పాటు రూ.5.24 లక్షల దొంగనోట్లను కూడా స్వాధీనం చేసుకున్నా రు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ శుక్రవారం స్థానిక పోలీసు అతిథిగృహంలో ఈ వివరాలను ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డితో కలిసి వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రం ములబాగిల్‌కు చెందిన శంకర్ అక్కడే సెల్‌ఫోన్లు, జిరాక్స్ దుకాణం నడిపేవాడు. వ్యసనాలకు బానిసైన ఇతడు అప్పులను తీర్చే క్రమంలో కలర్ జిరాక్స్ మిషన్‌కొని దాని ద్వారా దొంగనోట్లను ప్రింట్ చేయడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ములబాగిల్‌లో పెట్రోలు బంకు నడుపుతున్న విశ్వనాథ్‌కు రూ.6 లక్షల అప్పు చెల్లించాల్సి ఉంది. అందుకుగాను ఏడాది క్రితం రూ.6లక్షల దొంగనోట్లను ఇచ్చాడు. అవి దొంగనోట్లని కొన్ని నెలల తరువాత విశ్వనాథ్ గుర్తించాడు. శంకర్ నుంచి అప్పు వసూలు చేసుకున్నాడు.
దొంగనోట్లను శంకర్ తన వద్దే ఉంచుకున్నా డు. స్నేహితులైన ములబాగిల్‌కు చెందిన బాబు, మంజునాథ్, గంగవరం మండలం దండపల్లెకు చెందిన మురళి, అంజలి, దీపశిఖ, హరితో ముందస్తు వ్యూహం పన్ని దొంగనోట్లను చెలామణి చేయడం ప్రారంభించారు. మహిళా సంఘం లో సభ్యులుగా ఉన్న అంజలి, దీపశిఖ సంఘం పొదుపు డబ్బులో దొంగనోట్లను పెట్టి చెలామణి చేయడం ప్రారంభించారు. గ్రామం లో విలాసవంతమైన కార్లు, అనుమానిత వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉండటంతో దండపల్లె గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
గంగవరం డీఎస్పీ హరినాథరెడ్డి, సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టారు. ఇక్కడ దొంగనోట్ల ప్రింటింగ్‌చేసి చెలామణి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు శుక్రవారం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.500,1000ల దొంగనోట్లు మొత్తం రూ.5,24,500లు, రెండు సెల్‌ఫోన్లు, ఐదు సిమ్‌కార్డులు స్వాధీ నం చేసుకున్నారు.
దొంగనోట్ల ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ దేవరాజులు, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, పళణి, దేవరాజులు, కానిస్టేబుల్ గణేష్, సిబ్బందిని ఎస్పీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి క్యాష్ రివార్డులను సైతం అందజేశారు. సకాలంలో స్పందించి మంచి సమాచారం అందించిన దండపల్లె గ్రామస్తులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
గెలిచే దమ్ములేకే అడ్డదారి రాజకీయూలు
పలమనేరు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే అధికార పార్టీ అడ్డదారి రాజకీయాలు చేస్తోందని జె డ్పీ మాజీ చైర్మన్ రెడ్డెమ్మ విమర్శిం చారు. బెరైడ్డిపల్లెలోని తన స్వగృహంలో శుక్రవారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు భయపడుతోందో ప్రజలకందరికీ తెలుసన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సహకార శాఖ మం త్రి కృష్ణారెడ్డితో వాయిదా వేయించిందన్నారు. అదే పంథాను ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీ పీ సైతం అనుసరిస్తూ నోటిఫికేషన్ వెలువడ్డాక మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ ఎన్నికలు జరగకుండా స్టే ఇచ్చారన్నారు. ఎలాగూ ఈ సహకార సంఘాల్లో గెలవమని ఆ పా ర్టీకి తెలిసిందన్నారు. అందుకే ఇప్పు డు నాన్ అఫీషియల్ త్రీమెన్ కమిటీల ద్వారా చైర్మన్, సభ్యులను నియమిస్తుందన్నారు.
ఇది సహకార చట్టానికే మచ్చలాంటిదని అన్నారు. గతంలో ఇలాం టి సంఘటనలు ఎదురైనపుడు అధికారుల కమిటీలు ఉండేవే గానీ ఇలా నామినేటేడ్ ద్వారా కమిటీలను ఎన్నిక చేసే విధానం ఇదే తొలిసారన్నారు. ఎన్నికలు నిర్వహించాల్సి న తరుణంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అధికార పార్టీ పదవీవ్యామోహంతో ఇలాంటి పనులకు ఒడిగట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. అందుకే జిల్లాలో ఎక్కడైతే నామినేటేడ్ కమిటీలను ఏర్పాటు చేస్తారో ఆ పీఏసీఎస్‌ల తరపున తాము కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.