IMITATOR
-
ఘనాపాటి.. టార్గెట్ గిన్నిస్‌బుక్
అక్రా : అసాధారణ ప్రతిభ 19 ఏళ్ల జస్టిస్ ఓసెయి సొంతం. అందుకే ఈ ఘనా కుర్రాడు గిన్నిస్ బుక్ కోసం తెగ యత్నిస్తున్నాడు. జంతువుల అరుపులతో మిమిక్రీ చేయటం ఇతగాడికి అబ్బిన విద్య. కోడి, గొర్రె, దోమ, తాబేలు.. ఇలా 50 రకాల జంతువుల అరుపులను అనుకరిస్తాడు. ఇంటర్నెట్లో వింటూ వాటి అరుపులను సాధన చేశానని ఓసెయి చెబుతున్నాడు. ఇతగాడి తర్వాతి లక్ష్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంట. అతనే ఓ ‘జూ’... అంటూ ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ సైతం ఇతగాడిపై ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేసింది. అతగాడి టాలెంట్ మీరూ చూసేయండి. -
ఘనాపాటి.. టార్గెట్ గిన్నిస్‌బుక్
-
దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు
ఎనిమిది మంది నిందితుల అరెస్టు రూ.5.24 లక్షల దొంగనోట్లు స్వాధీనం దండపల్లె వాసులు, పోలీసులకు ఎస్పీ అభినందనలు చిత్తూరు(అర్బన్): జిల్లాలోని పశ్చి మ మండలాలు, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠాకు పోలీసులు కళ్లెం వేశారు. గంగవరం కేంద్రంగా జరుగుతున్న ఈ తతంగంలో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసు లు వారి నుంచి ప్రింటర్, స్కానర్‌తో పాటు రూ.5.24 లక్షల దొంగనోట్లను కూడా స్వాధీనం చేసుకున్నా రు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ శుక్రవారం స్థానిక పోలీసు అతిథిగృహంలో ఈ వివరాలను ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డితో కలిసి వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ములబాగిల్‌కు చెందిన శంకర్ అక్కడే సెల్ఫోన్లు, జిరాక్స్ దుకాణం నడిపేవాడు. వ్యసనాలకు బానిసైన ఇతడు అప్పులను తీర్చే క్రమంలో కలర్ జిరాక్స్ మిషన్కొని దాని ద్వారా దొంగనోట్లను ప్రింట్ చేయడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ములబాగిల్‌లో పెట్రోలు బంకు నడుపుతున్న విశ్వనాథ్‌కు రూ.6 లక్షల అప్పు చెల్లించాల్సి ఉంది. అందుకుగాను ఏడాది క్రితం రూ.6లక్షల దొంగనోట్లను ఇచ్చాడు. అవి దొంగనోట్లని కొన్ని నెలల తరువాత విశ్వనాథ్ గుర్తించాడు. శంకర్ నుంచి అప్పు వసూలు చేసుకున్నాడు. దొంగనోట్లను శంకర్ తన వద్దే ఉంచుకున్నా డు. స్నేహితులైన ములబాగిల్‌కు చెందిన బాబు, మంజునాథ్, గంగవరం మండలం దండపల్లెకు చెందిన మురళి, అంజలి, దీపశిఖ, హరితో ముందస్తు వ్యూహం పన్ని దొంగనోట్లను చెలామణి చేయడం ప్రారంభించారు. మహిళా సంఘం లో సభ్యులుగా ఉన్న అంజలి, దీపశిఖ సంఘం పొదుపు డబ్బులో దొంగనోట్లను పెట్టి చెలామణి చేయడం ప్రారంభించారు. గ్రామం లో విలాసవంతమైన కార్లు, అనుమానిత వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉండటంతో దండపల్లె గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. గంగవరం డీఎస్పీ హరినాథరెడ్డి, సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టారు. ఇక్కడ దొంగనోట్ల ప్రింటింగ్చేసి చెలామణి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు శుక్రవారం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.500,1000ల దొంగనోట్లు మొత్తం రూ.5,24,500లు, రెండు సెల్ఫోన్లు, ఐదు సిమ్‌కార్డులు స్వాధీ నం చేసుకున్నారు. దొంగనోట్ల ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ రామకృష్ణ, ఎస్ఐ దేవరాజులు, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, పళణి, దేవరాజులు, కానిస్టేబుల్ గణేష్, సిబ్బందిని ఎస్పీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి క్యాష్ రివార్డులను సైతం అందజేశారు. సకాలంలో స్పందించి మంచి సమాచారం అందించిన దండపల్లె గ్రామస్తులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గెలిచే దమ్ములేకే అడ్డదారి రాజకీయూలు పలమనేరు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే అధికార పార్టీ అడ్డదారి రాజకీయాలు చేస్తోందని జె డ్పీ మాజీ చైర్మన్ రెడ్డెమ్మ విమర్శిం చారు. బెరైడ్డిపల్లెలోని తన స్వగృహంలో శుక్రవారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు భయపడుతోందో ప్రజలకందరికీ తెలుసన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సహకార శాఖ మం త్రి కృష్ణారెడ్డితో వాయిదా వేయించిందన్నారు. అదే పంథాను ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీ పీ సైతం అనుసరిస్తూ నోటిఫికేషన్ వెలువడ్డాక మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ ఎన్నికలు జరగకుండా స్టే ఇచ్చారన్నారు. ఎలాగూ ఈ సహకార సంఘాల్లో గెలవమని ఆ పా ర్టీకి తెలిసిందన్నారు. అందుకే ఇప్పు డు నాన్ అఫీషియల్ త్రీమెన్ కమిటీల ద్వారా చైర్మన్, సభ్యులను నియమిస్తుందన్నారు. ఇది సహకార చట్టానికే మచ్చలాంటిదని అన్నారు. గతంలో ఇలాం టి సంఘటనలు ఎదురైనపుడు అధికారుల కమిటీలు ఉండేవే గానీ ఇలా నామినేటేడ్ ద్వారా కమిటీలను ఎన్నిక చేసే విధానం ఇదే తొలిసారన్నారు. ఎన్నికలు నిర్వహించాల్సి న తరుణంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అధికార పార్టీ పదవీవ్యామోహంతో ఇలాంటి పనులకు ఒడిగట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. అందుకే జిల్లాలో ఎక్కడైతే నామినేటేడ్ కమిటీలను ఏర్పాటు చేస్తారో ఆ పీఏసీఎస్‌ల తరపున తాము కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. -
జోరుగా దొంగనోట్ల చెలామణి
రూ.500, 1000 నోట్లే అధికం వారపు సంతలు, రియల్ ఎస్టేట్ తదితరాలే టార్గెట్ చెలామణి చేసేందుకు ఏజెంట్ల నియామకం పలమనేరు: కొంతకాలంగా పలమనేరు నియోజకవర్గంలో దొంగనోట్ల చెలామణి జోరందుకుంది. ముఖ్యంగా రూ.1000, 500 నోట్లే బయటపడుతున్నాయి. వారపు సంతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైతులకందే పాల బిల్లులు, గ్రూపులకు చెల్లించే డబ్బులు, పెట్రోల్ బంకు లు తదితరాల్లో ఎక్కువగా చెలామణి జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగనోట్ల చెలామణి అధికంగా పలమనేరు, వి.కోట, బెరైడ్డిపల్లె, గంగవరం మండలాల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి కొందరు ఏజెంట్లు ఈ నోట్లను చెలామణి చేస్తున్నట్లు సమాచారం. వీరు స్థానికంగా కొందరు ఏజెం ట్లను ఏర్పాటు చేసుకుని ఒకటికి డబుల్ అనే లెక్కన లక్ష ఫేక్‌నోట్లు రూ.50 వేలు తీసుకుని ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దొంగనోట్లను స్థానిక వారపు సంతల్లో ఎక్కువగా మారుస్తున్నట్లు వినికిడి. డెయిరీల్లో పాల బిల్లులు పొందిన పలువురు పాడి రైతులు సైతం తమకు దొంగనోట్లు వస్తున్నాయని ఇటీవల చెబుతున్నారు. మహిళా గ్రూపుల్లోనూ ఈ సమస్య ఉంది. నెలకు దాదాపు 30 వరకు దొంగనోట్లను బ్యాంకర్లు గుర్తించి చించిపడేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక ఎవరున్నారు అనే విషయం పోలీసులకు సైతం అంతు చిక్కడం లేదు. మూడు రోజుల క్రితం కర్ణాటకు చెందిన ఓ దొంగనోట్ల గ్యాంగ్ గంగవరం పోలీసులు పట్టుబడిన విషయం తెలిసిందే. స్థానికంగా ఇంకా ఏయే గ్యాంగులు చెలామణి చేస్తున్నాయనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. -
నాయక్ కోసం వేట
రాయిచూర్ వెళ్లిన సీసీఎస్ బృందం ఏడు నెలలుగా దొంగనోట్ల మార్పిడి గుడివాడలో నాలుగో నిందితుడు గుడివాడ : దొంగనోట్ల చెలామణి వ్యవహారంలో ప్రధాన సూత్రధారి, కర్ణాటకలోని రాయిచూర్‌కు చెందిన నాయక్ కోసం గుడివాడ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీఎస్ సీఐ టి.ప్రసాదరావు నేతృత్వంలో బృందం శుక్రవారం రాత్రి అక్కడకు బయలుదేరినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి గుడివాడలో పట్టుబడిన ముగ్గురిని పోలీసులు విచారించారు. పట్టణానికే చెందిన మరో వ్యక్తి పాత్ర ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు. నాయక్ దొరికేనా? దొంగనోట్ల చెలామణి కేసులో ప్రధాన నిందితుడు నాయక్ బ్యాంక్ ఖాతా నకిలీదని శుక్రవారం నాడే తేలింది. దీంతో అతడు మాట్లాడిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఆచూకీ తెలుసుకునేందుకు సీసీఎస్ సీఐ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కర్ణాటక వెళ్లింది. ఈ కేసులో నాయక్ ప ట్టుబడితే పట్టణ పోలీసులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయనడంలో సందేహం లేదు. ఏడు నెలలుగా చెలామణి.. దొంగనోట్ల చెలామణి వ్యవహారంలో గుడివాడకు చెందిన బండారు రమేష్, వడ్డీ వ్యాపారి కిషోర్, ఆటో ఫైనాన్సర్ రాజేష్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మూడురోజులుగా పోలీసులు వీరిని విచారణ చేస్తున్నారు. పట్టణంలో ఏడు నె లలుగా దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు వీరు అంగీకరించారని సమాచారం. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది. ఈ వ్యవహారంలో ఈ ముగ్గురు మినహా మిగిలిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంలో తమ పేర్లు కూడా బయటకు వస్తాయోమోనని ఇందులో పాత్రధారులైన పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు భయంతో వణికిపోతున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దొంగనోట్ల చెలామణి జరిగినట్లుగా భావిస్తున్నారు. పరారీలో మరో నిందితుడు ఈ వ్యవహారానికి సంబంధిం చి పట్టణంలో పట్టుబడిన రమేష్, కిషోర్, రాజేష్తోపా టు మరో వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తిం చా రు. స్థానిక ఐఎంఏ హాలు ఎ దురుగా ఉండే ఆటో ఫైనాన్సర్ రమేష్ లక్ష రూపాయల వరకు దొంగనోట్లు తీసుకుని మార్చినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్.. పట్టణం నుంచి పరారైనట్లు సమాచారం. దీంతో అతడి కోసం గుడివాడ పోలీసులు గాలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపచవచ్చని తెలిసింది. అమ్మో... పెద్ద నోట్లా... గుడివాడ అర్బన్ : నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తంచడంతో స్థాని కులు బెంబేలెత్తుతున్నారు. పట్టణానికి చెందిన వ్యక్తులు కూడా దొంగనోట్లు చెలామణి చేస్తున్నాడని వార్తలు వెలువడటంతో వ్యాపారులు రూ. 500, రూ.1000 నోట్లు తీసుకోవడానికి భయపడుతున్నారు. వ్యత్యాసాలు గుర్తించడం ఇలా.. అసలు, నకిలీ కరెన్సీ నోట్ల మధ్య ఉన్న తేడాలు తెలిస్తే డూప్లికేట్ నోట్లను చాలా సులభంగా గుర్తించవ చ్చు. వీటి మధ్య తేడా కనుగొనేందుకు గుర్తిం చాల్సిన కొన్ని విషయాలు. ఒరిజనల్ నోటు చాలా మందంగా, గట్టిగా ఉంటుంది. నకిలీ నోటు పట్టుకోగానే చాలా పలచగా, మెత్తమెత్తగా ఉంటుంది. ఒరిజినల్ నోటును పట్టుకోగానే పైభాగంలో ‘రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా’ అంటూ ఆంగ్ల, హిందీ భాషల్లో రాసిన అక్షరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి. అదే డూప్లికేట్ నోటు అయితే గరుకుగా.. పలచగా ఉంటాయి. ఒరిజినల్ నోటుపై సీరియల్ నంబరు మెరూన్ కలర్లో సమానంగా ఉంటుంది. అదే డూప్లికేట్ నోటులో అయితే సీరియల్ నంబర్లు ఎగుడుదిగుడుగా ఉండి, కలర్ మార్పులో కనిపిస్తాయి. ఒరిజినల్ నోటు తెల్లని ప్రదేశంలో మహాత్మాగాంధీ బొమ్మ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. తలపై నోటు అంకెలు కనిపిస్తాయి. అదే డూప్లికేట్ నోట్లో అయితే తెల్లని ప్రదేశంలో మహాత్మాగాంధీ బొమ్మ పలచగా.. వంకరగా..ఉండి అనుమానాస్పదంగా ఉంటుంది. మరో ముఖ్యమైంది సెక్యురిటీ థ్రెడ్స్. ఒరి జినల్ నోటును పట్టుకోగా నోటు సంఖ్యకు మహాత్మాగాంధీ ముఖానికి మధ్యలో పచ్చ కలర్లో ఐదు గీతలు ఉంటాయి. అవి మం దంగా ఉండి వాటిపై ఆర్బీఐ అంటూ స్ప ష్టంగా రాసి ఉంటాయి. అదే డూప్లికేట్ నో టులో అయితే ఆ పచ్చ కలర్లో ఉన్న గీతలు పైకి లేస్తూ... ఊడిపోయేందుకు సిద్ధంగా ఉం టాయి. ప్రధానమైన ఈ అంశాలను వ్యాపారులు, కొనుగోలుదారులు, ప్రజలు తెలుసుకుంటే నకిలీ కరెన్సీ బెడద నుంచి బయటపడొచ్చు. -ఏఎస్.ప్రసాద్, (ఎకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్స్ మేనేజర్ ఎస్బీఐ బ్రాంచ్, గుడివాడ)