
అక్రా : అసాధారణ ప్రతిభ 19 ఏళ్ల జస్టిస్ ఓసెయి సొంతం. అందుకే ఈ ఘనా కుర్రాడు గిన్నిస్ బుక్ కోసం తెగ యత్నిస్తున్నాడు.
జంతువుల అరుపులతో మిమిక్రీ చేయటం ఇతగాడికి అబ్బిన విద్య. కోడి, గొర్రె, దోమ, తాబేలు.. ఇలా 50 రకాల జంతువుల అరుపులను అనుకరిస్తాడు. ఇంటర్నెట్‌లో వింటూ వాటి అరుపులను సాధన చేశానని ఓసెయి చెబుతున్నాడు. ఇతగాడి తర్వాతి లక్ష్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంట.
అతనే ఓ ‘జూ’... అంటూ ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ సైతం ఇతగాడిపై ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేసింది. అతగాడి టాలెంట్ మీరూ చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment