నాయక్ కోసం వేట | Naik Shooting | Sakshi
Sakshi News home page

నాయక్ కోసం వేట

Published Sun, Jul 27 2014 1:19 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

నాయక్ కోసం వేట - Sakshi

నాయక్ కోసం వేట

  •  రాయిచూర్ వెళ్లిన సీసీఎస్ బృందం
  •  ఏడు నెలలుగా దొంగనోట్ల మార్పిడి
  •  గుడివాడలో నాలుగో నిందితుడు
  • గుడివాడ : దొంగనోట్ల చెలామణి వ్యవహారంలో ప్రధాన సూత్రధారి, కర్ణాటకలోని రాయిచూర్‌కు చెందిన నాయక్ కోసం గుడివాడ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీఎస్ సీఐ టి.ప్రసాదరావు నేతృత్వంలో బృందం శుక్రవారం రాత్రి అక్కడకు బయలుదేరినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి గుడివాడలో పట్టుబడిన ముగ్గురిని పోలీసులు విచారించారు. పట్టణానికే చెందిన మరో వ్యక్తి పాత్ర ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు.
     
    నాయక్ దొరికేనా?

    దొంగనోట్ల చెలామణి కేసులో ప్రధాన నిందితుడు నాయక్ బ్యాంక్ ఖాతా నకిలీదని శుక్రవారం నాడే తేలింది. దీంతో అతడు మాట్లాడిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఆచూకీ తెలుసుకునేందుకు సీసీఎస్ సీఐ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కర్ణాటక వెళ్లింది. ఈ కేసులో నాయక్ ప ట్టుబడితే పట్టణ పోలీసులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయనడంలో సందేహం లేదు.
     
    ఏడు నెలలుగా చెలామణి..

    దొంగనోట్ల చెలామణి వ్యవహారంలో గుడివాడకు చెందిన బండారు రమేష్, వడ్డీ వ్యాపారి కిషోర్, ఆటో ఫైనాన్సర్ రాజేష్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మూడురోజులుగా పోలీసులు వీరిని విచారణ చేస్తున్నారు. పట్టణంలో ఏడు నె లలుగా దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు వీరు అంగీకరించారని సమాచారం. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది.
     
    ఈ వ్యవహారంలో ఈ ముగ్గురు మినహా మిగిలిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంలో తమ పేర్లు కూడా బయటకు వస్తాయోమోనని ఇందులో పాత్రధారులైన పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు భయంతో వణికిపోతున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దొంగనోట్ల చెలామణి జరిగినట్లుగా భావిస్తున్నారు.
     
    పరారీలో మరో నిందితుడు

    ఈ వ్యవహారానికి సంబంధిం చి పట్టణంలో పట్టుబడిన రమేష్, కిషోర్, రాజేష్‌తోపా టు మరో వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తిం చా రు. స్థానిక ఐఎంఏ హాలు ఎ దురుగా ఉండే ఆటో ఫైనాన్సర్ రమేష్ లక్ష రూపాయల వరకు దొంగనోట్లు తీసుకుని మార్చినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్.. పట్టణం నుంచి పరారైనట్లు సమాచారం. దీంతో అతడి కోసం గుడివాడ పోలీసులు గాలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపచవచ్చని తెలిసింది.
     
    అమ్మో... పెద్ద నోట్లా...

    గుడివాడ అర్బన్ : నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తంచడంతో స్థాని కులు బెంబేలెత్తుతున్నారు. పట్టణానికి చెందిన వ్యక్తులు కూడా దొంగనోట్లు చెలామణి చేస్తున్నాడని వార్తలు వెలువడటంతో  వ్యాపారులు రూ. 500, రూ.1000 నోట్లు తీసుకోవడానికి భయపడుతున్నారు.

    వ్యత్యాసాలు గుర్తించడం ఇలా..

    అసలు, నకిలీ కరెన్సీ నోట్ల మధ్య ఉన్న తేడాలు తెలిస్తే డూప్లికేట్ నోట్లను చాలా సులభంగా గుర్తించవ చ్చు. వీటి మధ్య తేడా కనుగొనేందుకు గుర్తిం చాల్సిన కొన్ని విషయాలు.
     
    ఒరిజనల్ నోటు చాలా మందంగా, గట్టిగా ఉంటుంది. నకిలీ నోటు పట్టుకోగానే చాలా పలచగా, మెత్తమెత్తగా ఉంటుంది.
     
    ఒరిజినల్ నోటును పట్టుకోగానే పైభాగంలో ‘రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా’ అంటూ ఆంగ్ల, హిందీ భాషల్లో రాసిన అక్షరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి. అదే డూప్లికేట్ నోటు అయితే గరుకుగా.. పలచగా ఉంటాయి.
     
    ఒరిజినల్ నోటుపై సీరియల్ నంబరు మెరూన్ కలర్‌లో సమానంగా ఉంటుంది. అదే డూప్లికేట్ నోటులో అయితే సీరియల్ నంబర్లు ఎగుడుదిగుడుగా ఉండి, కలర్ మార్పులో కనిపిస్తాయి.
     
    ఒరిజినల్ నోటు తెల్లని ప్రదేశంలో మహాత్మాగాంధీ బొమ్మ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. తలపై నోటు అంకెలు కనిపిస్తాయి. అదే డూప్లికేట్ నోట్‌లో అయితే తెల్లని ప్రదేశంలో మహాత్మాగాంధీ బొమ్మ పలచగా.. వంకరగా..ఉండి అనుమానాస్పదంగా ఉంటుంది.
     
    మరో ముఖ్యమైంది సెక్యురిటీ థ్రెడ్స్.  ఒరి జినల్ నోటును పట్టుకోగా నోటు సంఖ్యకు మహాత్మాగాంధీ ముఖానికి మధ్యలో పచ్చ కలర్‌లో ఐదు గీతలు ఉంటాయి. అవి మం దంగా ఉండి వాటిపై ఆర్‌బీఐ అంటూ స్ప ష్టంగా రాసి ఉంటాయి. అదే డూప్లికేట్ నో టులో అయితే ఆ పచ్చ కలర్‌లో ఉన్న గీతలు పైకి లేస్తూ... ఊడిపోయేందుకు సిద్ధంగా ఉం టాయి.
        
    ప్రధానమైన ఈ అంశాలను వ్యాపారులు, కొనుగోలుదారులు, ప్రజలు తెలుసుకుంటే నకిలీ కరెన్సీ బెడద నుంచి బయటపడొచ్చు.
     
     -ఏఎస్.ప్రసాద్, (ఎకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్స్ మేనేజర్ ఎస్‌బీఐ బ్రాంచ్, గుడివాడ)


     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement