Nayak
-
పోలీసులే కిడ్నాప్ చేస్తే!
సాక్షి, నరసరావుపేట: పట్టపగలు న్యాయస్థాన ప్రాంగణంలో గిరిజన నేతపై దాడి చేయడమే కాకుండా బలవంతంగా అపహరించారు. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే రౌడీల అవతారమెత్తారు. కోర్టులో లొంగిపోయేందుకు వచ్చి న నిందితుడిని కోర్టు ప్రాంగణంలోనే కిడ్నాప్ చేశారు. దుర్గి మండలం కాకిరాలకు చెందిన వైఎస్సార్సీపీ నేత రమావత్ శ్రీనునాయక్‌పై ఇప్పటికే మూడు అక్రమ కేసులు నమోదు చేశారు. అందులో రెండు కేసుల్లో సుమారు 70 రోజులపాటు సబ్‌జైలులో ఉన్న శ్రీనునాయక్ బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలులో ఉన్న సమయంలో అప్పటికే నమోదైన మూడో కేసులో పీటీ వారెంట్ వేయకుండా బయటకు వచ్చి న తరువాత అరెస్ట్ చేసి హింసించాలన్న దురుద్దేశంతో పోలీసులు ఆ సమయంలో అరెస్ట్ చూపలేదు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ఎలాగైనా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేయాలని పోలీసులపై టీడీపీ ప్రజాప్రతినిధి నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చి0ది. విషయం తెలుసుకున్న శ్రీనునాయక్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులను, సన్నిహితులను పోలీసులు వేధింపులు గురి చేస్తుండటంతో శ్రీనునాయక్ కోర్టులో లొంగిపోయేందుకు మంగళవారం మాచర్ల న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. తన న్యాయవాది ద్వారా కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. మరికొన్ని నిమిషాల్లో న్యాయమూర్తి ఎదుట హాజరవుతడనగా.. మాచర్ల పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బలవంతంగా శ్రీనునాయక్‌ను కోర్టు ప్రాంగణం నుంచి నెట్టుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. గమనించిన అతని తరపు న్యాయవాది రామానాయక్ అడ్డుకోబోయాడు. అయినప్పటికీ పోలీసులు చొక్కా చించి దాడికి పాల్పడ్డారు. అ సమయంలో శ్రీనునాయక్ చేతి వేళ్లకు గాయాలయ్యాయి. కోర్టు ప్రాంగణంలో పోలీసులు వ్యవహరిస్తున్న దౌర్జన్యకాండను మరో న్యాయవాది షేక్ ఖాసిం తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. గమనించిన పోలీసులు న్యాయవాది వద్ద నుంచి ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. అనంతరం ఎవరూ ముందుకు రావద్దంటూ పోలీసులు బెదిరిస్తూ శ్రీనునాయక్‌ను కిడ్నాప్ చేసి కార్లో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం న్యాయవాది రామానాయక్ జరిగిన ఘటనను న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.లొంగిపోయేందుకు వచ్చిన తమ క్లయింట్‌ను పోలీసులు బలవంతంగా అపహరించడంతోపాటు తనపట్ల దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనునాయక్ రక్తంతో తడిసిన తన చొక్కాను న్యాయమూర్తికి అప్పగించినట్టు రామానాయక్ తెలిపారు. న్యాయస్థాన ప్రాంగణంలో పోలీసుల దౌర్జన్యకాండ పట్ల న్యాయవాదులు మండిపడుతున్నారు. నా భర్తకు ప్రాణహాని ఉంది పోలీసుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని కిడ్నాప్‌కు గురైన శ్రీనునాయక్ భార్య లక్ష్మీభాయ్ విలేకరుల ఎదుట వాపోయింది. కోర్టు ప్రాంగణం నుంచి పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లిన తరువాత ఎక్కడ పెట్టారో చెప్పలేదన్నారు. తన భర్తను చూసేందుకు పోలీస్ట స్టేషన్‌కు వెళ్లినా అక్కడ లేడని వెనక్కి పంపారన్నారు. కాగా.. పాత కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనునాయక్‌ను కోర్టు సమీపంలో అరెస్ట్ చేశామని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. -
ఎన్నికల వేళ ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌కు షాక్..!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ఎన్నికల వేళ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌కు గడ్డు పరిస్థితులు ఎదురువుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్యే భర్త, హరిసింగ్ నాయక్ షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ పార్టీ వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటూ అసలుకే ఎసరు తెచ్చారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్.. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా జెట్ స్పీడ్‌తో పట్టాలెక్కిస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ విజయావకాశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 18 మందికి టికెట్లు గల్లంతు కావొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ 18 మందిలో జిల్లా నుంచి ఎవరైనా ఉన్నారా అనే ఆరాలు పెరిగాయి. నిన్నా మొన్నటి వరకు ఈ విషయంలో కొత్తగూడెం నియోజకవర్గ పేరు ఎక్కువగా వినిపించేది. వనమా ఎన్నికపై దాఖలైన కేసు తీర్పు, సుప్రీం కోర్టులో సవాల్ తదితర అంశాలతో ప్రస్తుతం కొత్తగూడెం సైడ్ ట్రాక్‌లోకి వెళ్లగా, ఆ స్థానాన్ని ఇల్లెందు నియోజకవర్గం ఆక్రమించింది. మా అభ్యర్థన ఆలకించండి.. గత ఆరు నెలలుగా ఇల్లెందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు తిరిగి టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించలేమని, తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. హరిప్రియకు బదులు ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో కూడా పార్టీ పెద్దలకు ఇప్పటికే సూచించారు. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పెద్దగా స్పందన రాలేదని తెలిసింది. కానీ గత రెండు వారాలుగా పరిస్థితిలో తేడా వచ్చింది. ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు ఇల్లెందుపై దృష్టి పెడుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. జీవన్‌లాల్ సేవా క్యాంపులు.. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ తనయుడు జీవన్‌లాల్ రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ ఉద్యోగిగా ఆయన కొనసాగుతున్నారు. ఇంతవరకూ హైదరాబాద్‌కే ఎక్కువగా పరిమితం అయిన జీవన్‌లాల్.. సిట్టింగ్ అభ్యర్థుల్లో కొన్ని మార్పులు ఉంటాయనే ప్రచారంతో పావులు కదపడం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అనూహ్యంగా ఆయన ఇల్లెందులో క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లెందు నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగానే ఇక్కడ క్యాంప్ వెలిసిందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. షాడో ప్రభావం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నుంచి హరిప్రియ కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వేదికగా హరిసింగ్ ఇటు ప్రభుత్వ, అటు పార్టీ కార్యక్రమాల్లో చక్రం తిప్పుతున్నారు. షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ తనకంటూ సొంత వర్గం ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అప్పటివరకు పార్టీలో పని చేస్తూ వచ్చిన నేతలంతా తీవ్ర అసౌకర్యానికి గురవడం మొదలైంది. ద్వితీయ శ్రేణి నేతలు, వారి అభిప్రాయాలను హరిసింగ్ ఖాతరు చేయడం లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కామేపల్లి, గార్ల, బయ్యారం, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో కారు పార్టీ నేతలకు హరిసింగ్ వ్యవహార శైలితో కంటి మీద కునుకు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని కొందరు గులాబీ నేతలే అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మండలాల వారీగా ఉన్న అసమ్మతి నాయకులంతా ఒక్కటవుతున్నారు. షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తూ హరిసింగ్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఇటీవల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో ఆమె ఇల్లెందు నియోజకవర్గానికి వచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ స్థానికంగా లేరు. కవిత మాటల వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందనే చర్చ మొదలైంది. మహబూబాబాద్ జిల్లాలోని రెండు స్థానాల్లో పార్టీ టికెట్ దక్కని పక్షంలో ఇల్లెందు నుంచైనా అసెంబ్లీకి పోటీ చేసేందుకు కవిత రెడీగా ఉన్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. -
అర్నబ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి అప్పడే బకాయిలు చెల్లిస్తే ఈ రోజు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయిక్ (53) భార్య అక్షత వ్యాఖ్యానించారు. అర్నబ్ గోస్వామిని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేయడంతో తన భర్త, అత్తకు న్యాయం జరిగే దిశగా అడుగులు పడ్డాయన్నారు. బుధవారం అర్నబ్ అరెస్టు అనంతరం ఆమెతోపాటు ఆమె కూతురు ఆద్న్యా నాయిక్ సైతం విలేకరులతో మాట్లాడారు. టీవీ స్టూడియో పనులు చేయించుకున్న అర్నబ్ పూర్తి డబ్బులు చెల్లించలేదని అక్షత ఆరోపించారు. దీంతోనే అప్పుల్లో కూరుకుపోయిన ఆయన కొత్త పనులు చేయలేకపోయారని తెలిపారు. అందుకే తీవ్ర ఒత్తిడికి గురైన తన భర్త అన్వయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీంతో ఆయన తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని విలపించారు. ఈ విషయానికి సంబంధించి అన్వయ్ సుసైడ్ నోట్ కూడా రాశారని గుర్తు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయలేదన్నారు. దీనికి సంబంధించి చాలాసార్లు ముఖ్యంగా అర్నబ్ బెదిరించాడని ఆరోపించారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అర్నబ్ గోస్వామిని అరెస్టు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుందని ఆమె అన్నారు. (అర్నబ్ గోస్వామి అరెస్ట్) అసలు ఏం జరిగింది? ముంబైలో రిపబ్లిక్ టీవీ స్టూడియోకు సంబంధించిన ఇంటీరియర్ పనులు అలీబాగ్‌కు చెందిన డిజైనర్ అన్వయ్ నాయిక్(53) చేశాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అలీబాగ్‌లోని తన ఇంట్లో 2018 మే 5వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు అన్వయ్ తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రిపబ్లిక్ చానెల్లో పనులు చేసిన అనంతరం అర్నబ్ డబ్బులు ఇవ్వలేదని సుమారు రూ. 83 లక్షలు బకాయిలు రావాల్సి ఉందని.. కానీ, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు వారి కుటుంబీకులు ఆరోపించారు. కాగా, అన్వయ్ నాయిక్ సుసైడ్ నోట్లో కూడా అర్నబ్ గోస్వామి పేరుతోపాటు మరో ఇద్దరి పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేçసినప్పటికీ అనంతరం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయంపై మళ్లీ అన్వయ్ నాయిక్ భార్య, కుమార్తెల ఫిర్యాదు మేరకు ఈ కేసుకు సంబంధించి అర్నబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీని తలపిస్తోంది: ఫడ్నవిస్ రిపబ్లిక్ టీవి చీఫ్ ఎడిటర్ అర్నబ్ గో స్వామిని బుధవారం అరెస్టు చేయడంపై ఉద్దర్ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. అర్నబ్ గొంతును మూగబోయేలా చేస్తున్నారని పేర్కొంది. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 1977లో ఎమర్జెన్సీ విధించారనీ, కానీ అది ప్రస్తుతం కూడా కొనసాగుతోందని ట్విట్టర్ ద్వారా విమర్శించారు. ఎమర్జెన్సీ మద్దతుదారులు కాంగ్రెస్, శివసేనలపై గొంతెత్తి ప్రశ్నించేవారి స్వేచ్చకి భంగం కలిగిస్తున్నారని, ఇలాంటి వారితో దేశం పోరాటం చేస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఫడ్నవిస్ ధ్వజమెత్తారు. ముంభైలో బీజేపీ ఎమ్మెల్యే ఆశీష్ శెలార్ విలేకరులతో మాట్లాడుతూ.. అర్నబ్ వంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తారని, సొంత ప్రయోజనాల కోసం ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం వీరి గొంతును కట్టిపడేస్తూ, వారి స్వేచ్చకి భంగం కలిగిస్తుందని ఆరోపించారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వం జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తోందని, అర్నబ్ విషయంలోనూ ఇదే విధంగా ప్రవర్తిస్తూ, ఆత్మహత్య కేసు ఇప్పటికే పూర్తయిన, దానిని తిరిగి లేవనెత్తిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇదొక బ్లాక్ డే అని ఆశీష్ వ్యాఖ్యానించారు. అర్నబ్‌పై దాడి చేశారు : న్యాయవాది రిపబ్లిక్ టీవీ ఛానెల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసే సమయంలో ముంబైలోని ఆయన ఇంట్లో పోలీసులు చేయి చేసుకున్నట్లు అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్ పార్కర్లు ఆరోపించారు. పార్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన అరెస్టుకు సంబంధించి ఆయన భార్యకు కూడా తెలియపరచలేదని, ఇద్దరు పోలీసులు ఆయనపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా పోలీసులు కుటుంబ సభ్యులతో తోపులాటకు దిగినట్టు పేర్కొన్నారు. అర్నబ్ ఎడమ చేతికి గాయమైందని, వెన్నుపై చేయిచేసుకున్నారని గౌరవ్ ఆరోపించారు. ఇక ఎలాంటి పత్రాలు లేకుండా మూసి వేసిన కేసుకు సంబంధించి అరెస్టు చేయడాన్ని రిపబ్లిక్ టీవీ తప్పు బట్టింది. అర్నబ్ అరెస్టుతో శివసేన, బీజేపీ నాయకుల మధ్య రాజకీయ రగడ మొదలైంది. బీజేపీ నేతలు అర్నబ్ అరెస్ట్ అన్యాయమని, కక్ష పూరిత చర్యేనని శివసేన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు తప్పు ఎవరు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత, ఎంపీ సంజయ్ రావుత్ పేర్కొన్నారు. అర్నబ్ గోస్వామిని ఆలీబాగ్ పోలీసుల అరెస్టు చేయడాన్ని సంజయ్ సమర్థించారు. ఆధారాలు లభించాయి కావచ్చు అందుకే అరెస్టు చేశారని, పోలీసులు ఎవరినీ ఊరికే అరెస్టు చేయరన్నారు. అలాగే తప్పు తను చేసినా చట్టం తనను విడిచిపెట్టదని తెలిపారు. ఇది రాజకీయపార్టీలు, ప్రభుత్వానికి సంబంధించి కాదని, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించి కూడా కాదని ఇది అన్వయ్ నాయిక్ ఆత్మహత్యకు సంబంధించిన కేసుగా పేర్కొన్నారు. శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరిని ఉద్ధేశపూర్వకంగా అరెస్టు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. -
క్లాస్మేట్స్.. స్నేహ హస్తాలు
లక్ష్మిస్ నాయక్ పదహారేళ్ల కుర్రాడు. బెంగళూరు, రాజాజీ నగర్‌లోని ఈస్ట్–వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లోపదవ తరగతి చదువుతున్నాడు.ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న కుర్రాళ్లు చాలామందే ఉన్నారు. అయితే లక్ష్మిస్ నాయక్ మాత్రంఆ స్కూల్‌కి ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటే... పదేళ్లుగా ఒక అందమైన దృశ్యానికి ఆ స్కూల్ ప్రత్యక్షసాక్షిగా ఉంటూ వస్తోంది. అయితే ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలతోపాటే మనసును తాకే ఆ దృశ్యం కూడా కనుమరుగు కాబోతోంది. ఒక స్నేహబృందం చెల్లాచెదురు అయిపోవాల్సిన సమయం వచ్చేసింది. ‘‘టెన్త్ పూర్తయిన తర్వాత పిల్లలు ఎవరికి ఇష్టమైన కోర్సుల్లో వాళ్లు చేరతారు. లక్ష్మిస్ నాయక్ స్నేహబృందంలోని కుర్రాళ్లు కూడా ఒక్కొక్కరు ఒక్కో కాలేజ్‌లో చేరిపోతారు’’ అంటూ.. ఆ స్కూలుకే ప్రత్యేకమైన లక్ష్మిస్ నాయక్ గురించి స్కూల్ టీచర్ గ్రేస్ సీతారామన్ తెలిపారు. అంతా టెన్త్‌కి వచ్చేశారు లక్ష్మిస్ నాయక్‌ను ఇప్పటివరకు స్నేహితుల హస్తాలే నడిపించాయి. నాయక్ ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడు పోలియో బారిన పడ్డాడు. తనకై తాను నడవలేడు. మొదట్లో వాళ్ల అమ్మానాన్న రోజూ స్కూల్లో దించేవాళ్లు. ఆ తర్వాత నాయక్ స్నేహితులు ఆ బాధ్యత తీసుకున్నారు. అందరూ చిన్న పిల్లలే. కానీ అందరిదీ పెద్ద మనసు. ఏడెనిమిది మంది పిల్లలు రోజూ నాయక్‌ను ఇంటినుంచి స్కూలుకు తీసుకెళ్తారు. వీల్ చైర్లో కూర్చోబెట్టి స్కూలు ఆవరణంతా తిప్పుతారు. చేతులతో ఎత్తి పై అంతస్థులోని క్లాస్ రూమ్‌కు తీసుకెళ్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు వాళ్లంతా పదవ తరగతికి వచ్చారు. పరీక్షలైపోగానే విడిపోక తప్పదని ఆవేదన చెందుతున్నారు. పై అంతస్తులోని తరగతి గది నుంచి లక్ష్మిస్ నాయక్‌ను కిందికి తీసుకొస్తున్న స్నేహితుడు వాడిని వదిలేసి వెళ్లలేం ఓ రోజు ఓ టీచర్ ఆ పిల్లల్ని ‘‘రోజూ ఇలా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడం కష్టంగా అనిపించడం లేదా’’ అని అడిగారు. అప్పుడు ఆ కుర్రాళ్లు చెప్పిన మాట ‘‘అందరం షేర్ చేసుకుంటాం. కాబట్టి బరువు అని కానీ, కష్టం అని కానీ అనిపించదు. వాడిని తీసుకెళ్లకుండా మేము ఎక్కడికైనా వెళ్లినప్పుడు కూడా వాడే గుర్తుకు వస్తుంటాడు’’ అన్నాడు ఆ స్నేహబృందంలోని సిద్ధార్థ. మరో స్టూడెంట్ మయూర్ అయితే... ‘‘మేము వాడిని మోసుకు పోవడమే కనిపిస్తుంది. వాడు మాకు ఎన్ని సబ్జెక్టుల్లో సహాయం చేస్తాడో తెలుసా? క్లాస్‌లో మాకు అర్థం కాని సందేహాలను వాడు చక్కగా క్లియర్ చేస్తాడు. నాయక్ కామర్స్ చదవాలనుకుంటున్నాడు. నేను ఏదైనా డిప్లమో కోర్సులకు వెళ్లాలనుకుంటున్నాను. వేరే వేరే కాలేజీలకు వెళ్లక తప్పదు’’ అని ఆవేదన చెందాడు. ‘నాకూ దిగులేస్తోంది’ ‘‘నాయక్ ఫిజికల్లీ చాలెంజ్డ్ అని బయటి వాళ్లు అనుకోవాల్సిందే తప్ప మాకు అలా అనిపించదు. స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మా అందరితోపాటు నాయక్ కూడా ఉంటాడు’’ అన్నారు కుర్రాళ్లందరూ ముక్తకంఠంతో. నాయక్ మాత్రం ‘‘ఇప్పటి వరకు నన్ను చేతుల్లో పెట్టుకుని చూసుకున్న నా స్నేహితులకు దూరం కావాల్సి వస్తోంది. ఒకరి సహాయం లేకుండా కృత్రిమ సాధనాల సహాయంతో నడవడానికి నేను సిద్ధమే. కానీ పదవ తరగతి పరీక్షల తర్వాత ఎదురయ్యే ఒంటరితనం ఇప్పటి నుంచే గుర్తుకొస్తోంది’’ అని దిగులుగా అంటున్నాడు.– మంజీర -
ముంపు మండలాల్లో కొత్త విద్యుత్ లైన్లు
ట్రాన్స్‌కో సీఎండీ ఎంఎం నాయక్ కుక్కునూరు: ముంపు మండలాల్లో విద్యుత్ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ట్రాన్స్‌కో సీఎండీ మురావత్ ఎం.నాయక్ అన్నారు. బుధవారం కుక్కునూరు వచ్చిన ఆయన్ను స్థానికులు గుట్ట సెంటర్ వద్ద అడ్డుకున్నారు. మండలంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ముంపు మండలాల్లో విద్యుత్ సమస్యలను అధిగమిస్తామని, ఇందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని సీఎండీ చెప్పారు. ఎటపాక నుంచి భువనగిరికి, కూనవరం నుంచి వేలేరుపాడుకు కొత్త విద్యుత్ ౖలైన్లు ఏర్పాటుచేయనున్నామన్నారు. త్వరలో రాజీవ్‌నగర్ సబ్‌స్టేçÙన్ పనులు ప్రారంభించి అన్ని లైన్లను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఐటీడీఏ పీవో షణ్మోహన్ ఆయన వెంట ఉన్నారు. -
నాయక్‌కు ‘మాలమహానాడు’ సన్మానం
విజయనగరం ఫోర్ట్/గంటస్తంభం : ఏపీడీసీఎల్ సీఎండీగా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌ను మాలమహానాడు నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు రామవరపు పైడిరాజు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఏ ఒక్కరినీ నొప్పించకుండా, నిజాయితీగా నాయక్ పని చేశారని కొనియాడారు. జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయినప్పటికీ.. సీఎండీగా ఉద్యోగోన్నతి రావడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు తెరపల్లి శ్రీనివాసరావు, పి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఈపీడీసీఎల్ సీఎండీగా నాయక్
విజయనగరం నుంచి విశాఖకు బదిలీ సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా విజయనగరం జిల్లా కలెక్టర్ ముదావత్ ఎం.నాయక్ నియమితులయ్యారు. ఇంతకుముందు సీఎండీగా పని చేసిన రేవు ముత్యాలరాజు ఈ నెల 22న నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జి సీఎండీగా జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్‌ను నియమించారు. ఆయన ఆ బాధ్యతలు చేపట్టకముందే.. రెగ్యులర్ సీఎండీగా నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నాయక్ గుంటూరు జిల్లా చిలకూరిపేటలోని సుగాలి కాలనీలో జన్మించారు. -
ఢిల్లీకి వెళుతున్న ‘నాయక్’
సాక్షి,విశాఖపట్నం: సిటీకి కొత్త సీపీ వస్తే నెలన్నరగా కనీసం ఒక్కసారైనా కలవకుండా డిపార్ట్మెంట్ వారెవరైనా ఉంటారా.. సీపీగా ఎవరున్నా తనదారి తనదే అన్నట్లు అధికారిౖయెనా వ్యవహరిస్తారా..మాట వరసకు కూడా అలా అనుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరూ సాహసించరు. కానీ వాళ్లందరికీ విరుద్ధంగా జి.రాంగోపాల్ నాయక్ వ్యవహరించారు. అంతే కాదు ఉన్నతాధికారులతో ఏనాడూ సఖ్యతగా లేని ఆయన తాను తగ్గాల్సి రావడం ఇష్టం లేక ఏకంగా మాత సంస్థకు వెళ్లిపోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం అంగీకరించి ఢిల్లీకి పంపిచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆది నుంచీ ఆయనంతే: రాంగోపాల్ నాయక్ ప్రస్తుతం జోన్–2 డీసీపీగా ఉన్నారు. ఢిల్లీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కావడంతో కేంద్ర స్థాయిలో అనేక మంది రాజకీయ నాయకులు, పెద్దలతో మంచి పరిచయాలున్నాయి. అండమాన్ నుంచి విశాఖ బదిలీౖయె వచ్చారు. గత సీపీ అమిత్‌గార్గ్ హయాంలో కొత్త జోన్లు ఏర్పడ్డాయి. వాటిలో జోన్–2కు నాయక్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. కానీ అమిత్‌గార్గ్‌కు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. తన పరిధి దాటి వెళ్లి మరీ వివాదాల్లో తలదూర్చేవారు. ముఖ్యంగా ల్యాండ్ సెటిల్మెంట్లు ఆయనకు చెడ్డ పేరు తీసుకువచ్చాయి. దానికి తోడు రౌడీ షీటర్లపై దష్టి సారించి వారిని ఇబ్బందులకు గురి చేయడం ద్వారా ‘ప్రయోజనం’ పొందేవారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కేవలం ఆ ప్రయోజనం కోసమే కొత్తగా రౌడీ షీట్లు తెరవమని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని డిపార్ట్మెంట్ కోడై కూస్తోంది. ఇలాంటి అనేక వివాదాలు ముసిరినప్పుడు కూడా సీపీ అమిత్‌గార్గ్ నాయక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. చర్యలకు ఉపక్రమించిపప్పుడల్లా ఉన్నత స్థాయిలో రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు చేయించేవారని, వాటికి సమాధానం చెప్పలేక సీపీ సైతం మిన్నకుండిపోయేవారని సమాచారం. అయితే కొత్త సీపీగా టి.యోగానంద్ రావడంతో నాయక్ ఆలోచనలో పడ్డారు. యోగానంద్ వ్యవహార శైలి తెలుసుకుని ఆయనతో విభేదించి పని చేయలేమని గ్రహించారు. తన ఇష్టానుసారం ఉండటం కుదరనుకున్న నాయక్ ఆయన వస్తున్నారనగానే సెలవు పెట్టి వెళ్లిపోయారు. దాదాపు నెలన్నరగా పేరెంట్ డిపార్ట్మెంట్కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక దశలో ఆశలు సన్నగిల్లడంతో ఈ నెల 11న తిరిగి విధుల్లో చేరాలనుకున్నారు. కానీ పెద్దల అండతో చివరికి అనుకున్నది సాధించుకున్నారు. -
మరో కథ అందిస్తున్న బాహుబలి రచయిత
ముంబయి: బజరంగీ భాయ్‌జాన్ చిత్రానికి కథ అందించి ఉత్తరాదిన సత్తా చాటిన కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో బాలీవుడ్ సినిమా కోసం తన కలానికి పని చెబుతున్నారు. 2001లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'నాయక్' చిత్రం సీక్వెల్‌కు ఆయన కథ అందించబోతున్నారు. దీపక్ ముకుత్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్లో కూడా అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ సందర్భంగా ఈరోస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ... తాజా రాజకీయాల నేపథ్యంలో నాయక్ సినిమా సీక్వెల్‌కు ఇది మంచి తరుణమన్నారు. దీంతో కథ కోసం విజయేంద్ర ప్రసాద్‌ను సంప్రదించడం జరిగిందన్నారు. కాగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ 2015లో 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలకు కథ అందించారు. 2015లో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాకు కథ అందించినందుకుగాను ఉత్తమ కథకుడిగా ఆయన ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఇక 'నాయక్' చిత్రానికి వస్తే తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా 'ఒకే ఒక్కడు' తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సూపర్‌హిట్ అయింది. ఆ సినిమా హిందీ వెర్షన్లో అనిల్ కపూర్, రాణీముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటించారు. పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమాకి హిందీలో సీక్వెల్ తీస్తున్నారు. -
లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలు
-
ఆత్మహత్యకు పాల్పడిన యువరైతు మృతి
యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లాలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువరైతు మృతి చెందాడు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామానికి చెందిన వీరు నాయక్(30) కౌలు రైతు. వ్యవసాయం సాగు కలిసి రాకపోవడంతో సుమారు రూ.5 లక్షల మేర అప్పులయ్యాయి. అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 17న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. నాయక్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
ఊపిరాడకే యాత్రికుల మృతి
పుష్కరఘాట్ దుర్ఘటనపై వెల్లడించిన పోస్టుమార్టం నివేదిక సాక్షి, రాజమండ్రి: పుష్కరఘాట్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో దుర్మరణం పాలైన 27 మందీ ఊపిరి ఆడనందువల్లనే మృతి చెందారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మృతదేహాలపై ఎటువంటి గాయాలూ లేవని నివేదికలో పేర్కొన్నారు. పుష్కరాల ప్రత్యేక వైద్యాధికారి నాయక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అనారోగ్యంతో నలుగురి మృతి అనారోగ్యంతో నలుగురు యాత్రికులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మంగళవారం మరణించగా, రెండో రోజైన బుధవారం పుష్కరఘాట్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జల్లు అప్పలనర్సమ్మ(70) సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాలపై ఆభరణాల తస్కరణ పుష్కరఘాట్ తొక్కిసలాటలో నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బొమ్మిశెట్టి అనసూయమ్మ మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. ఆమె కుమారులు ‘మా అమ్మ వంటిపై ఆరు కాసుల బంగారం ఉండాలి. అది ఇప్పుడు కనిపించడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కూడా మృతుల బంధువులు పలువురు తమ వారి ఆభరణాలు కానరావడంలేదని చెప్పారు. విషాదంలో ఉన్న బంధువులెవరూ నగల కోసం ఆరాటపడకపోవడంతో ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. -
నాయక్ కోసం వేట
రాయిచూర్ వెళ్లిన సీసీఎస్ బృందం ఏడు నెలలుగా దొంగనోట్ల మార్పిడి గుడివాడలో నాలుగో నిందితుడు గుడివాడ : దొంగనోట్ల చెలామణి వ్యవహారంలో ప్రధాన సూత్రధారి, కర్ణాటకలోని రాయిచూర్‌కు చెందిన నాయక్ కోసం గుడివాడ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీఎస్ సీఐ టి.ప్రసాదరావు నేతృత్వంలో బృందం శుక్రవారం రాత్రి అక్కడకు బయలుదేరినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి గుడివాడలో పట్టుబడిన ముగ్గురిని పోలీసులు విచారించారు. పట్టణానికే చెందిన మరో వ్యక్తి పాత్ర ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు. నాయక్ దొరికేనా? దొంగనోట్ల చెలామణి కేసులో ప్రధాన నిందితుడు నాయక్ బ్యాంక్ ఖాతా నకిలీదని శుక్రవారం నాడే తేలింది. దీంతో అతడు మాట్లాడిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఆచూకీ తెలుసుకునేందుకు సీసీఎస్ సీఐ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కర్ణాటక వెళ్లింది. ఈ కేసులో నాయక్ ప ట్టుబడితే పట్టణ పోలీసులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయనడంలో సందేహం లేదు. ఏడు నెలలుగా చెలామణి.. దొంగనోట్ల చెలామణి వ్యవహారంలో గుడివాడకు చెందిన బండారు రమేష్, వడ్డీ వ్యాపారి కిషోర్, ఆటో ఫైనాన్సర్ రాజేష్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మూడురోజులుగా పోలీసులు వీరిని విచారణ చేస్తున్నారు. పట్టణంలో ఏడు నె లలుగా దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు వీరు అంగీకరించారని సమాచారం. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది. ఈ వ్యవహారంలో ఈ ముగ్గురు మినహా మిగిలిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంలో తమ పేర్లు కూడా బయటకు వస్తాయోమోనని ఇందులో పాత్రధారులైన పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు భయంతో వణికిపోతున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దొంగనోట్ల చెలామణి జరిగినట్లుగా భావిస్తున్నారు. పరారీలో మరో నిందితుడు ఈ వ్యవహారానికి సంబంధిం చి పట్టణంలో పట్టుబడిన రమేష్, కిషోర్, రాజేష్తోపా టు మరో వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తిం చా రు. స్థానిక ఐఎంఏ హాలు ఎ దురుగా ఉండే ఆటో ఫైనాన్సర్ రమేష్ లక్ష రూపాయల వరకు దొంగనోట్లు తీసుకుని మార్చినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్.. పట్టణం నుంచి పరారైనట్లు సమాచారం. దీంతో అతడి కోసం గుడివాడ పోలీసులు గాలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపచవచ్చని తెలిసింది. అమ్మో... పెద్ద నోట్లా... గుడివాడ అర్బన్ : నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తంచడంతో స్థాని కులు బెంబేలెత్తుతున్నారు. పట్టణానికి చెందిన వ్యక్తులు కూడా దొంగనోట్లు చెలామణి చేస్తున్నాడని వార్తలు వెలువడటంతో వ్యాపారులు రూ. 500, రూ.1000 నోట్లు తీసుకోవడానికి భయపడుతున్నారు. వ్యత్యాసాలు గుర్తించడం ఇలా.. అసలు, నకిలీ కరెన్సీ నోట్ల మధ్య ఉన్న తేడాలు తెలిస్తే డూప్లికేట్ నోట్లను చాలా సులభంగా గుర్తించవ చ్చు. వీటి మధ్య తేడా కనుగొనేందుకు గుర్తిం చాల్సిన కొన్ని విషయాలు. ఒరిజనల్ నోటు చాలా మందంగా, గట్టిగా ఉంటుంది. నకిలీ నోటు పట్టుకోగానే చాలా పలచగా, మెత్తమెత్తగా ఉంటుంది. ఒరిజినల్ నోటును పట్టుకోగానే పైభాగంలో ‘రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా’ అంటూ ఆంగ్ల, హిందీ భాషల్లో రాసిన అక్షరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి. అదే డూప్లికేట్ నోటు అయితే గరుకుగా.. పలచగా ఉంటాయి. ఒరిజినల్ నోటుపై సీరియల్ నంబరు మెరూన్ కలర్లో సమానంగా ఉంటుంది. అదే డూప్లికేట్ నోటులో అయితే సీరియల్ నంబర్లు ఎగుడుదిగుడుగా ఉండి, కలర్ మార్పులో కనిపిస్తాయి. ఒరిజినల్ నోటు తెల్లని ప్రదేశంలో మహాత్మాగాంధీ బొమ్మ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. తలపై నోటు అంకెలు కనిపిస్తాయి. అదే డూప్లికేట్ నోట్లో అయితే తెల్లని ప్రదేశంలో మహాత్మాగాంధీ బొమ్మ పలచగా.. వంకరగా..ఉండి అనుమానాస్పదంగా ఉంటుంది. మరో ముఖ్యమైంది సెక్యురిటీ థ్రెడ్స్. ఒరి జినల్ నోటును పట్టుకోగా నోటు సంఖ్యకు మహాత్మాగాంధీ ముఖానికి మధ్యలో పచ్చ కలర్లో ఐదు గీతలు ఉంటాయి. అవి మం దంగా ఉండి వాటిపై ఆర్బీఐ అంటూ స్ప ష్టంగా రాసి ఉంటాయి. అదే డూప్లికేట్ నో టులో అయితే ఆ పచ్చ కలర్లో ఉన్న గీతలు పైకి లేస్తూ... ఊడిపోయేందుకు సిద్ధంగా ఉం టాయి. ప్రధానమైన ఈ అంశాలను వ్యాపారులు, కొనుగోలుదారులు, ప్రజలు తెలుసుకుంటే నకిలీ కరెన్సీ బెడద నుంచి బయటపడొచ్చు. -ఏఎస్.ప్రసాద్, (ఎకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్స్ మేనేజర్ ఎస్బీఐ బ్రాంచ్, గుడివాడ) -
తెలంగాణే మా డిమాండ్
దేవునిపల్లి, న్యూస్‌లైన్ : ‘తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్ర జలు ఉద్యమించారు. ఎన్నో పోరాటాలు చేశా రు. ఎంతో మంది బలిదానాలకు పాల్పడ్డారు. ఈ ప్రాంతంలోని నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కా బోతోంది. దీనిని అడ్డుకోవడం భావ్యం కాదు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తే ఉపేక్షించబోం’ అని వక్తలు హెచ్చరించారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డిలోని కర్షక్ బీఈడీ కళాశాల ఆవరణలో తెలంగాణ ‘జన శాసనసభ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘2013 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’పై చర్చించారు. టీడీఎఫ్ వైస్ చైర్మన్ ఎంఏ బాసిత్ ఈ సభకు స్పీకర్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో టీడీఎఫ్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందన్నారు. చివరి దశలో ఉన్న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవాలని సీమాంధ్ర నేతలు చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవద్దని కోరారు. రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని సూచించారు. ప్రజలే ఉద్యమ సారథులు ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమాన్ని ప్రజలే నడిపారని టీడీఎఫ్ వైస్ చైర్మన్, గొల్ల కురుమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన బిల్లు చర్చకు రాకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని బీసీ ఐక్యసమితి రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయం లో అన్ని పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. 20 జిల్లాలు, 200 అసెంబ్లీ స్థానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అడ్డుకుంటే ఊరుకోం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని టీడీఎఫ్ నాయకుడు, బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రన్న హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఉద్యమాలు చేస్తే సీమాంధ్రలో పెట్టుబడిదారులు ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే ఆంధ్ర ప్రాంతానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. సమైక్యంగా ఉంటే తెలంగాణకు పూర్తిగా నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సాయిలు, లంబాడి హక్కుల పోరా ట సమితి జిల్లా అధ్యక్షుడు రాణాప్రతాప్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర నాయకుడు శంకర్, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు ప్రకాశ్ యాదవ్, కామారెడ్డి జేఏసీ చైర్మన్ జగన్నాథం, కోకన్వీనర్ తిర్మల్‌రెడ్డి, ప్రతినిధులు సిద్ధిరాములు, మల్లన్న, రశీద్, మోతీలాల్, మాణిక్‌రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రికార్డులున్నా... అసంతృప్తే!
174 డెరైక్ట్ చిత్రాలు... కానీ విజయాలు మాత్రం పదిహేనే. 2013లో డిసెంబర్ 24 వరకూ మన చిత్రసీమ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. అంకెల పరంగా చూస్తే ఓకే గానీ, విజయాల పరంగా మాత్రం వీకే. ఈ విజయాలు ఏ మాత్రం బాక్సాఫీస్ దప్పికను తీర్చలేవనేది కరాఖండీగా చెప్పేయొచ్చును. మన తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్‌కు (గ్రాస్ పరంగా) చేరుకోవడమనేది 2013లో ఓ గొప్ప విజయం. దాంతోపాటు మరో నాలుగు సినిమాలు 50 కోట్ల మైలురాళ్లను (షేర్ పరంగా) అందుకోవడం మరో తీయటి అనుభూతి. చాలామట్టుకు సినిమాలను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. కంటెంట్ లేకపోతే ఒక్క టిక్కెట్ కూడా తెగడంలేదనేది కాదనలేని వాస్తవం. రికార్డులను చూసి ఆనందపడాలో, పరాజయాలను తల్చుకుని కుమిలిపోవాలో తెలియని అసందిగ్ధావస్థ ఇది. విజయాలు సాధించిన సినిమాలను విశ్లేషించి చూస్తే, కుటుంబ కథాచిత్రాలకు మళ్లీ ఆదరణ మొదలైందని అర్థమవుతోంది. అందుకు నిదర్శనం ‘అత్తారింటికి దారేది’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రాల ఘనవిజయాలే. మరో పక్క మాస్ ఎంటర్టైనర్లకూ ప్రేక్షకులు పట్టం కట్టారు. కుటుంబ కథ, ప్రేమకథ, మాస్ మసాలా, చివరకు హారర్ స్టోరీ అయినా వినోదం ఉండి తీరాల్సిందే. అలా అయితేనే ప్రేక్షకుడు సినిమాకి వస్తున్నాడు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉదృతంగా జరిగిన తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు చిత్రసీమపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. చాలా సినిమాల విడుదలలు వెనక్కి ముందుకి ఊగిసలాడాల్సిన పరిస్థితి. ఒక దశలో పెద్ద సినిమాలన్నీ విడుదలకు వెనుకంజ వేస్తే... వారానికి అయిదారు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే.. ఇవన్నీ ఎంత త్వరగా వచ్చాయో... అంతే త్వరగా వెళ్లిపోయాయి. ఈ ఏడాది విజయతీరానికి చేరుకున్న 15 సినిమాలేంటో ఒకసారి చూద్దాం... బ్లాక్‌బస్టర్ ఆఫ్‌ది ఇయర్: సినిమా రిలీజ్‌కి రెడీ. కానీ ఈ లోగా రాష్ట్రంలోని ఉద్యమం ఊపందుకుంది. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. జూలైలో అనుకున్న సినిమా సెప్టెంబర్ వరకూ సెలైంట్‌గా ఉండిపోవాల్సివచ్చింది. ఈ లోగా ఓ పిడుగులాంటి వార్త. బాక్సాఫీస్‌కి గుండెపోటు తెప్పించే వార్త. ఈ సినిమా ప్రథమార్ధం అంతా ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. దానికి తోడు అనేక పైరసీ ప్రింట్లు. ఇక ఈ సినిమా పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. అయినా మొండిగా సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేశారు. కట్ చేస్తే... ‘అత్తారింటికి దారేది’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇన్ని అవరోధాలను దాటుకొని ఇంతటి ఘనవిజయం సాధించడమంటే... మాటలు కాదు. ఇది పవన్‌కల్యాణ్ మ్యాజిక్. దర్శకుడు త్రివిక్రమ్ మ్యాజిక్. వంద కోట్ల రూపాయల పై చిలుకు గ్రాస్నీ, 80 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసి తెలుగు సినిమా స్టామినాను బాక్సాఫీస్‌కి చాటిచెప్పింది. ‘గబ్బర్‌సింగ్’తో ఫామ్‌లోకొచ్చిన పవన్‌ని నంబర్‌వన్ రేస్‌లో ముందుండేలా చేసింది. కుటుంబ కథలు కనుమరుగైపోయిన నేటి తరుణంలో పవన్ ఈ కథను ఎంచుకొని మళ్లీ కొత్త ట్రెండ్‌కి నాంది పలికారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఓ సంచలనం. అత్త పాత్రలో నదియా కూడా పెద్ద ప్లస్. నాయక్(జనవరి 9) ఈ ఏడాదికి ఇదే తొలి హిట్. మాస్ అంశాలే ఈ సినిమాకు శ్రీరామరక్ష. ‘రచ్చ’ తర్వాత చరణ్‌కి ఇది మరో మాస్ హిట్. 50 కోట్ల పైచిలుకు షేర్ వసూలు చేసింది. చరణ్, వినాయక్ కాంబినేషన్ మాస్‌ని ఆకట్టుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు(జనవరి 11) వెంకటేష్, మహేష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి చేసిన సినిమా. అదీ కుటుంబ కథ కావడం విశేషం. క్లీన్ మూవీ. అనుబంధాలు, అలకలు, అల్లర్లు, కోనసీమ అందాలు ప్రేక్షకుల మనసు నిండేలా చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అందుకేనేమో 50 కోట్ట పైచిలుకు షేర్ రాబట్టగలిగింది. ఓవర్సీస్లో కొత్త రికార్డ్ సృష్టించింది. మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్‌కి కొత్త ఊపిరిచ్చింది. మిర్చి(ఫిబ్రవరి 8) ఫ్యామిలీ డ్రామాకు ఫ్యాక్షన్ కలగలిపితే వచ్చిన ఘాటైన సినిమా ఇది. ఈ సినిమాతో ప్రభాస్ మాస్‌కి మరింత చేరువయ్యారు. రచయిత కొరటాల శివ దర్శకునిగా మెప్పించారు. ఈ సినిమా కూడా 50 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టుకుంది. స్వామి రారా( మార్చి 23) కొత్త కాన్సెప్ట్‌తో కొత్తగా తీస్తే... చిన్న సినిమా అయినా పెద్ద రేంజ్లో ఆడుతుంది అనడానికి స్వామి రారా ఓ అందమైన నిదర్శనం. కొత్త దర్శకుడు సుధీర్‌వర్మ ఈ సినిమాను డీల్ చేసిన విధానమే మెయిన్ హైలైట్. బాద్షా(ఏప్రిల్ 5) ఈ ఏడాది యాభై కోట్ల పై చిలుకు షేర్ వసూలు చేసిన సినిమాల్లో ‘బాద్షా’ ఒకటి. ఊసరవెల్లి, దమ్ము చిత్రాలతో పోల్చుకుంటే... ఎన్టీఆర్‌కి ఇది మంచి ఊరట. శ్రీనువైట్ల శైలి ఈ సినిమాకు కలిసొచ్చింది. గుండెజారి గల్లంతయ్యిందే(ఏప్రిల్ 19) చాలాకాలం తర్వాత వచ్చిన క్లీన్ అండ్ కలర్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. నితిన్, నిత్యామీనన్ల కెమిస్ట్రీ మరోసారి అదిరింది. అనూప్ మ్యూజిక్ మ్యాజిక్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. దర్శకుడు విజయ్‌కుమార్ కొండా ప్రయత్నం ఫలించింది. తడాఖా(మే 10) తమిళ ‘వేట్టై’కి రీమేక్ ఇది. సునీల్, నాగచైతన్య కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. నాగచైతన్యకు మాస్ ఇమేజ్ జతకూడింది. డాలీ ఈ రీమేక్‌ని బాగా డీల్ చేశారు. ప్రేమకథాచిత్రమ్ (జూన్ 9) హారర్ సినిమా చూసి ఎవరైనా భయపడతారు. కానీ హారర్‌తో కూడా పొట్టచెక్కలయ్యేంత కామెడీ సృష్టించొచ్చని ‘ప్రేమ కథాచిత్రమ్’ నిరూపించింది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో కెమెరామేన్ ప్రభాకరరెడ్డి డెరైక్ట్ చేశారీ సినిమా. ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం ఇదే. సుధీర్‌బాబుని హీరోగా నిలబెట్టింది. బలుపు(జూన్ 28) రెండేళ్ల దోబూచులాట తర్వాత రవితేజకు ‘బలుపు’తో విజయం దక్కింది. పంచ్ డైలాగులు బాగా పండాయ్. పెరిగిన టికెట్ రేట్లను బాగా సద్వినియోగం చేసుకోగలిగిందీ సినిమా. అంతకు ముందు ఆ తరువాత(ఆగస్ట్ 23) సహజీవనం అనేది కత్తిమీద సాములాంటి కాన్సెప్ట్. ఏ మాత్రం అటూఇటూ అయినా... చాలా తేడా వస్తుంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ చాలా తెలివిగా ఈ సినిమాను మలిచారు. సుమంత్ అశ్విన్‌కి హీరోగా ఓ మంచి బ్రేక్. దామూకి నిర్మాతగా వేల్యూ పెంచింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (నవంబర్ 29) ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా. కొత్త దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా ఇన్నోవేటివ్‌గా ఈ కథను తెరకెక్కించాడు. సందీప్‌కిషన్‌కి సోలో హీరోగా తొలి విజయం. మంచు మనోజ్ కెరీర్లోనే భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ‘పోటుగాడు’. మేకింగ్ దశలోనే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఫలితంగా ప్రారంభ వసూళ్లు ఆకర్షణీయంగా వచ్చాయి. చాలా విరామం తర్వాత గోపిచంద్ చేసిన ‘సాహసం’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచింది. ఆయన స్థాయి విజయం కాకపోయినా... రన్ మాత్రం బాగానే వచ్చింది. ‘అడ్డా’ సినిమా కూడా సెలైంట్‌గా వసూళ్లు రాబట్టింది. సుశాంత్‌కి ఓ విధంగా ఇదే తొలి విజయం. -
ఎంజీఎం దుస్థితి...పధాని దృష్టికి
వరంగల్, న్యూస్‌లైన్: ‘జాతర నిధులకు ఎలాంటి లోటు లేదు. మరింత పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త రోడ్లను గుర్తించాం. వాటి పనులను ప్రారంభించాం. జాతర రూట్లో ఉన్న గ్రామాల్లో కూడా రోడ్లను వెడల్పు చేస్తున్నాం. గత జాతర సందర్భంగా కొన్ని గ్రామాల్లో వాహనాలు నిలిచిపోవడంతో క్రేన్ పెట్టి క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి గ్రామాలను, రోడ్లను గుర్తించి విస్తరిస్తున్నాం. జనవరి 30 వరకు రోడ్లన్నీ పూర్తి చేసి జాతరకు సిద్ధంగా ఉంటాం..’ అని ఆర్అండ్బీ ఎస్ఈ జె.మోహన్ నాయక్ అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రోడ్ల మరమ్మతులకు రూ.19 కోట్లు, ట్రైబల్ సబ్‌ప్లాన్ నుంచి రూ. 21 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. వీటిలో రూ. 19 కోట్ల విలువైన పనులకు టెండర్లు ముగిశాయని, రూ. 21 కోట్ల విలువైన పనులకు వచ్చే నెల 2న టెండర్లు పూర్తి చేస్తామన్నారు. జాతర పనులు, కొత్త రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. మేడారం చుట్టూ కొత్త రోడ్లు గత జాతర సమయంలో ఏయే రోడ్ల వెంట, ఎక్కడ నుంచి ఎంత మంది వస్తారనే విషయాలను గుర్తించాం. పస్రా-గుండాల రోడ్లను డబుల్ లేన్‌గా విస్తరిస్తున్నాం. పస్రా నుంచి నార్లపూర్ వెంట మొత్తం 6 కిలోమీటర్లు, బయ్యక్కపేట వరకు 11.6 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. మధ్యలో తెగిన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నాం. తాడ్వాయి, నార్లపూర్ వరకు 11 కిలోమీటర్ల రోడ్డును పెద్దగా చేస్తున్నాం. ఇక ఊరట్టం నుంచి మల్యాల వరకు 10 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తున్నం. దీనికి మొదట అటవీ శాఖ అభ్యంతరం తెలిపినా తర్వాత క్లియరెన్స్ వచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. ఇక ప్రధానంగా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే భక్తుల కోసం ఈసారి నేరుగా మేడారం వచ్చేందుకు ప్రధాన రోడ్డును గుర్తించాం. కరీంనగర్ నుంచి భూపాపల్లి మీద గా బయ్యక్కపేట నుంచి నేరుగా మేడారం వచ్చేందుకు రోడ్డును నిర్మిస్తున్నాం. రూ. 4 కోట్లు కేటాయించాం. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే... పరకాల, జంగాలపల్లి, ములుగు ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు రావు. గ్రామాల రోడ్లు..రెండింతలు ప్రధానంగా గ్రామాల్లో ఉన్న రోడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లోనే ట్రాఫిక్ ఆగిపోతోంది. దీంతో ఈసారి చుట్టూ ఉన్న గ్రామాల్లోని రోడ్లను రెండింతలు చేసే ప్రయత్నం చేస్తునా. నార్లపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి, గొల్ల బుద్దారం, రాంపూర్ గ్రామాల్లో రోడ్లను వెడల్పు చేస్తున్నాం. వట్టివా గు, తుమ్మలవాగుల నుంచి ఇప్పటి వరకు రాకపోకలకు చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పు డు వాటిపై రూ. 8 కోట్లతో రెండు కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం. పనులు మొదలుపెట్టాం. జంపన్నవాగుపై మరో బ్రిడ్జి జంపన్నవాగుపై మరో 100 మీటర్ల పొడవుగా కొత్త బ్రిడ్జిని ప్రతిపాదించాం. దీనికి రూ. 3 కోట్లు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడున్న బ్రిడ్జి పక్కనే దీనిని నిర్మాణం చేస్తాం. ఇక్కడ భూ సేకరణ సమస్య కూడా లేదు. గతంలో సేకరించిన భూమి ఉంది. జనవరి 30 నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికి తోడు సమ్మక్క గద్దెల నుంచి జంపన్నవాగు వరకు ఇప్పుడు డబుల్ రోడ్డును 10 మీటర్ల వరకు వెడల్పు చేస్తున్నాం. దీనికి కూడా నిధుల కేటాయింపు జరిగింది. దీంతో స్నాన ఘట్టాలకు వెళ్లేందుకు చాలా తేలికవుతుంది. ఇవన్నీ పూర్తి చేసి జాతర వరకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. ఇప్పటికే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను వేరే చోట్ల పనులు చేయనీయకుండా... మేడారం పనులనే కట్టబెట్టాం. వచ్చేనెల 2న మరో రూ. 21 కోట్ల పనులకు టెండర్లు పూర్తి కాగానే... త్వరగా అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. జాతర రూట్లోనే కాకుండా లింక్ రోడ్లన్నీ ప్రత్యేకంగా మరమ్మతులు చేస్తున్నాం. వాటన్నింటినీ జనవరి 30 వరకు పూర్తి చే స్తాం.