ఈపీడీసీఎల్‌ సీఎండీగా నాయక్‌ | Epdcl CMD Nayak | Sakshi
Sakshi News home page

ఈపీడీసీఎల్‌ సీఎండీగా నాయక్‌

Published Thu, Jul 28 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

ఈపీడీసీఎల్‌ సీఎండీగా నాయక్‌

ఈపీడీసీఎల్‌ సీఎండీగా నాయక్‌

  • విజయనగరం నుంచి విశాఖకు బదిలీ
  • సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విజయనగరం జిల్లా కలెక్టర్‌ ముదావత్‌ ఎం.నాయక్‌ నియమితులయ్యారు. ఇంతకుముందు సీఎండీగా పని చేసిన రేవు ముత్యాలరాజు ఈ నెల 22న నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్‌చార్జి సీఎండీగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నివాస్‌ను నియమించారు. ఆయన ఆ బాధ్యతలు చేపట్టకముందే.. రెగ్యులర్‌ సీఎండీగా నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నాయక్‌ గుంటూరు జిల్లా చిలకూరిపేటలోని సుగాలి కాలనీలో జన్మించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement