నాయక్‌కు ‘మాలమహానాడు’ సన్మానం
Published Fri, Jul 29 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
విజయనగరం ఫోర్ట్/గంటస్తంభం : ఏపీడీసీఎల్ సీఎండీగా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌ను మాలమహానాడు నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు రామవరపు పైడిరాజు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఏ ఒక్కరినీ నొప్పించకుండా, నిజాయితీగా నాయక్ పని చేశారని కొనియాడారు. జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయినప్పటికీ.. సీఎండీగా ఉద్యోగోన్నతి రావడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు తెరపల్లి శ్రీనివాసరావు, పి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement