ముంపు మండలాల్లో కొత్త విద్యుత్‌ లైన్లు | new electric lines in fled areas | Sakshi
Sakshi News home page

ముంపు మండలాల్లో కొత్త విద్యుత్‌ లైన్లు

Published Wed, Sep 28 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

new electric lines in fled areas

ట్రాన్స్‌కో సీఎండీ ఎంఎం నాయక్‌
కుక్కునూరు: ముంపు మండలాల్లో విద్యుత్‌ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ట్రాన్స్‌కో సీఎండీ మురావత్‌ ఎం.నాయక్‌ అన్నారు. బుధవారం కుక్కునూరు వచ్చిన ఆయన్ను స్థానికులు గుట్ట సెంటర్‌ వద్ద అడ్డుకున్నారు. మండలంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ముంపు మండలాల్లో విద్యుత్‌ సమస్యలను అధిగమిస్తామని, ఇందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని సీఎండీ చెప్పారు. ఎటపాక నుంచి భువనగిరికి, కూనవరం నుంచి వేలేరుపాడుకు కొత్త విద్యుత్‌ ౖలైన్లు ఏర్పాటుచేయనున్నామన్నారు. త్వరలో రాజీవ్‌నగర్‌ సబ్‌స్టేçÙన్‌ పనులు ప్రారంభించి అన్ని లైన్లను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఐటీడీఏ పీవో షణ్మోహన్‌ ఆయన వెంట ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement