Xerox
-
రూ.2 వేల నోట్లు జిరాక్స్ తీసి భార్య ఖాతాలో డిపాజిట్
సాక్షి, చెన్నై : ఎస్బీఐ ఏటీఎం డిపాజిట్ మెషిన్లలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని హర్యానా ముఠా రాష్ట్రంలో హైటెక్ చేతివాటాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీని గురించి ప్రజలు మరిచిపోక ముందే ఓ వ్యక్తి ఏకంగా రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి తన భార్య ఖాతాలోకి బ్యాంక్ ఆఫ్ బొరడా ఏటీఎం డిపాజిట్ మెషన్ ద్వారా డిపాజిట్ చేశాడు. పుదుకోటై జిల్లా అరంతాంగిలోని బ్యాంక్ ఆఫ్ బొరడా డిపాజిట్ మెషిన్‌ను తనిఖీ చేయగా రూ.2 వేలు జిరాక్స్ నోట్లు డిపాజిట్ చేసి ఉండడం వెలుగు చూసింది. సీసీ పుటేజీ ఆధారంగా అరంతాంగికి చెందిన శరవణన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తన భార్య రేవతి ఖాతాలో రూ.2 వేలు జిరాక్స్ నోట్లతో రూ.60 వేలు డిపాజిట్ చేసినట్టు అంగీకరించాడు. అనంతరం మరో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నట్టు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి శరవణన్, రవిచంద్రన్‌ను అరెస్టు చేశారు. చదవండి: బిట్ కాయిన్స్ పేరుతో రూ.60 లక్షలు స్వాహా -
పెద్దనోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
– నకిలీ కరెన్సీ, సెల్ఫోన్లు స్వాధీనం ఆదోని టౌన్: 25 శాతం కమీషన్‌తో పెద్ద నోట్లను మార్చుతామని నమ్మించి మోసం చేస్తున్న ముఠా పోలీసులకు దొరికింది. ఎమ్మిగనూరు పట్టణంలో కొందరు వ్యక్తులు పెద్ద నోట్ల మార్పిడితో మోసం చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి జిరాక్స్ నోట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. డోన్ కొండపేటకు చెందిన వడ్డే నాగరాజు, నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన నాయక్ మహ్మద్ షరీఫ్, ఎమ్మిగనూరు పట్టణంలోని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తనయుడు షేక్ అబ్దుల్లా, షరాఫ్ బజార్ వీధికి చెందిన చిలుకూరు నయనకాంత్, ఆదోనికి చెందిన ఖాదర్ ముఠాగా ఏర్పాడ్డారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి అనే రైతు నుంచి పెద్దనోట్లను 25శాతం కమీషన్‌తో మార్పిడి చేసి ఇస్తామని నమ్మించారు. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌కు రమ్మని సమాచారం ఇచ్చారు. వీరి వ్యహరాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మినూరు టౌన్ ఎస్ఐ, సిబ్బంది బస్టాండ్‌కు చేరుకుని నిఘా వేశారు. ఆ ముఠా సభ్యుల తంతును ఎప్పటికప్పుడు గమనించారు. రైతు శివరామిరెడ్డిని మోసం చేసేందుకు రూ. వంద నోట్ల కట్టలో పైనా కింద ఒరిజినల్ నోట్లు పెట్టి మధ్యంలో జీరాక్స్ నోట్లు పెట్టారు. రైతు నుంచి ఒరిజనల్ పెద్దనోట్లు రూ.500, వెయ్యి నోట్లను తీసుకొని నకిలీ, జిరాక్స్ నోట్లను అందజేసే సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా నలురుగురిని పట్టుకున్నారు. ఆదోనికి చెందిన ఖాదర్ తప్పించుకొని పారిపోయాడు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు.. పెద్ద నోట్ల మార్పిడి అంటూ జిల్లాలో మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. సమావేశంలో ఎమ్మిగనూరు సీఐ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని శాఖలకు నోడల్ అధికారులు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పలు శాఖల విభజనకు సంబంధించి సమాచారం అధికారులు కోరినవి ధంగా అందజేసేందుకు ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించారు. వీరు ఆయా శాఖల్లోని పాత ఫైళ్లు ఒక్కో జిల్లా కు ఒక కాపీ చొప్పున జిరాక్స్ తీయించడం, స్కానింగ్ కాపీని భద్రపరచడం, కీలకమైన కోర్టు కేసుల ఫైళ్ల వివరాలు ప్రత్యేకం గా నమోదు చేసుకోవడం, అవసరమైన ఫైళ్లు డివిజన్లు, మండలాలకు పంపిణీ చేసేలా పనులు చేయించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నియమించిన ఇద్దరు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్వో కృష్ణవేణి, సహకార అడిట్ అధికారి కరుణాకర్‌కు నోడల్ అధికారులు అందజేయాల్సి ఉంటుంది. -
పర్యావరణ హిత ప్రయాణం
‘గో బెంగళూరు’ యాప్‌ను రూపొందించిన ‘జిరాక్స్’ నగర వాసులకు అందుబాటులోకి సరికొత్త యాప్ దేశంలోనే బెంగళూరులో మొదటిసారిగా అమలులోకి బెంగళూరు: మనం ప్రయాణించే దూరం..ఆ సమయంలో వినియోగించే వాహనం..అది విడుదల చేసే కాలుష్యం..ఇలా లెక్కగట్టి పర్యావరణ హితంగా ఎలా ప్రయాణించాలనే విషయంపై సూచనలు ఇచ్చేందుకు ఓ సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘గో బెంగళూరు’ పేరిట ఈ మల్టీ మోడల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్‌ను అమెరికాకు చెందిన ‘జిరాక్స్’ సంస్థ రూపొందించింది. ఇటీవల ఈ యాప్‌ను నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. బెంగళూరు నగరంలో ఒక చోట నుంచి మరొక చోటకు చేరుకోవడానికి దారి చూపే యాప్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో‘గో బెంగళూరు’ యాప్ ప్రత్యేకత ఏమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న యాప్‌లలో లేని ఒక విభిన్నత ఈ యాప్‌లో ఉంది. అదే ప్రయాణికుడికి దారి చూపడంతో పాటు పర్యావరణ హితమైన ప్రయాణాన్ని గురించి కూడా తెలియజేయడం. ఈ యాప్ ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవడానికి ఉన్న మార్గాలు బస్సు రూట్, ఆయా బస్సు నంబర్లు, మెట్రో కనెక్టివిటీ, ఆటో, క్యాబ్‌లలో వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది, ఆటో, క్యాబ్‌లు ఎంత మొత్తాన్ని వసూలు చేస్తాయి అన్న వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇదే సందర్భంలో బస్సు, ఆటో, క్యాబ్, ద్విచక్ర వాహనం వీటి ప్రయాణం ద్వారా ఎంత మోతాదులో కాలుష్య కారక వాయువులు వెలవడతాయి అన్న వివరాలను సైతం ఈ యాప్ తెలియజేస్తుంది. చిన్నపాటి దూరం మనం ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు అక్కడి నడుచుకుంటూ లేదంటే సైక్లింగ్ చేస్తూ వెళ్లడం ఉత్తమమని సలహా ఇవ్వడమే కాక తద్వారా ఎన్ని కేలరీలను కరిగించవచ్చో కూడా తెలియజేయడమే ఈ యాప్ ప్రత్యేకత. బీఎంటీసీ, ఓలాలతో ఇప్పటికే ఒప్పందం..... ఎంటీసీ ‘స్మార్ట్’ విధానంలో ముందుకు సాగుతూ ఇటీవలే ఇంటలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఐటీఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో బీఎంటీసీతో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని జిరాక్స్ రీసర్స్ సెంటర్ భారత శాఖ డెరైక్టర్ మనీష్ గుప్తా వెల్లడించారు. ఏయే మార్గాల్లో ఏయే బస్సులు అందుబాటులో ఉన్నాయి, ఎంత సేపట్లో మనకు కావాల్సిన బస్సు వస్తుంది తదితర వివరాలన్నింటితో పాటు సమీపంలోని ఓలా క్యాబ్‌ల వివరాలు సైతం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే తమ సంస్థ లాస్ ఏజింల్స్ నగరంలో ‘గో లాస్ ఏంజిల్స్’, పేరిట, డెన్వర్ నగరంలో ‘గో డెన్వర్’ పేరిట ఈ యాప్‌లను అందుబాటులోకి తీసుకురాగా అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా బెంగళూరు నగంలో ‘గో బెంగళూరు’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగానే డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉదాహరణకు ఇలా..... మనం బెంగళూరులోని వసంతనగర నుంచి మల్లేశ్వరం ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఈ యాప్‌ను ఉపయోగించి ద్విచక్ర వాహనంలో 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇందుకు 0.8కేజీ కార్బన్‌డై ఆక్సైడ్ విడుదలవుతుంది. 14 కేలరీలు ఖర్చవుతాయి. అదే కారులో అయితే 26 నిమిషాల సమయం పడుతుంది. 1.6 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. 11కేలరీలు ఖర్చవుతాయి. సైకిల్ అయితే కార్బన్ డై ఆక్సైడ్ విడుదలయ్యే పరిమాణం 0.0కేజీలు. ఖర్చయ్యే కేలరీలు 101. ఇలా బస్సు, ఆటో అన్నింటికి సంబంధించిన వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
జిరాక్స్ కోసమని వెళ్లిన యువతి..
జీడిమెట్ల: జిరాక్స్ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్ అయోధ్యనగర్‌కు చెందిన గంగినాయుడు కుమార్తె పావని(18) ఓ ఇన్సూరెన్స్ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 13న జిరాక్స్ తెచ్చుకునేందుకని ఇంటి నుండి బయటకు వెళ్లిన పావని తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అవినీతి నిరూపించాలి
► తన కార్యాలయం ఎదుట ఎంపీడీవో ధర్నా ► రోడ్డెక్కిన మండల పరిషత్ కార్యాలయ గొడవ శాయంపేట : తనపై అవినీతి ముద్ర వేసిన ఎంపీపీ బాసని రమాదేవి తన అవినీతి నిరూపించాలని ఎంపీడీవో బానోతు భద్రునాయక్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం నల్లబ్యాడ్జీ ధరించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీవోగా మండలంలో 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఏ రోజు నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. కార్యాలయానికి సంబంధించిన ప్రతి ఖర్చు రికార్డుల్లో ఉన్నాయన్నారు. ఎక్కడ అవినీతికి పాల్పడ్డానో ఎంపీపీ నిరూపించాలని డిమాండ్ చేశారు. మండల కోఆర్డినేటర్ దైనంపల్లి కుమారస్వామికి కోర్డు ఉత్తర్వుల ప్రకారమే వేతన బిల్లును ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. కాగా, ఎంపీపీ బాసని రమాదేవి మాట్లాడుతూ గతంలో ఆసరా పింఛన్లకు సంబంధించిన రూ.50వేల చెక్కును తనకు తెలియకుండానే విడిపించుకుని తన సొంతానికి వాడుకున్నాడని ఆరోపించింది. అంతే కాకుండా సాక్షరభారత్ పథకానికి చైర్మన్‌గా ఉన్న తనకు సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ 16 నెలల వేతనాన్ని పని చేయకుండానే ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అసలే జరిగిందంటే.. కొన్ని నెలల క్రితం జరిగిన సమావేశానికి సాక్షరభారత్ కోఆర్డినేటర్ హాజరు కాలేదని, ఆయనను తొలగించాలని మండల సర్వసభ్య సమావేశంలో తీర్మాణించారు. అనంతరం ఎంపీపీ గ్రామ కోఆర్టినేటర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తరువాత మండల కోఆర్టినేటర్ కుమారస్వామిని తనను ఎలా తొలగించారంటూ కోర్టుకెళ్లాడు. దీంతో ఎంపీపీ, ఎంపీడీవోలకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్, టీ, టీఫిన్, జిరాక్స్ బిల్లులులకు సంబంధించిన చెక్కుల సంతకాల విషయంలో ఎంపీడీవో భద్రునాయక్ సంతకాలు చేయడంలేదని ఎంపీపీ ఆరోపణ. -
డీఎస్సీ ‘ఆన్లైన్’.. జరభద్రం
నెల్లూరు (విద్య): డీఎస్సీకి ‘ఆన్లైన్’లో దరఖాస్తు చేసేటప్పుడు, అదే ప్రతిని విద్యాశాఖ కార్యాలయంలో అందజేసేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలను, సంబంధిత జెరాక్స్ పత్రాలను విద్యాశాఖ అధికారులకు అందజేయాలి. చాలా మంది అభ్యర్థుల ‘ఆన్లైన్’వివరాలు, వారు అందజేసే జెరాక్స్ పత్రాలు ఒకటిగా ఉండనట్లయితే విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరించడంలేదు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.ఆంజనేయులు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. 8 ఆన్లైన్ దరఖాస్తును పూరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముందుగా ప్రతి ఆప్షన్‌ను చదివి, అందుకు సంబంధించిన పత్రాలు, వివరాలు సరిచేసుకుని ఆన్లైన్ దరఖాస్తు పూరించాలి. అదే ప్రతిని జెరాక్స్ పేపర్లతో కలిపి విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి సర్టిఫికెట్లలో ఏ వివరాలైతే ఉన్నాయో? వాటినే ఆన్లైన్లో ఆప్ట్(ఎంపిక) చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లలో లేని వాటిని ఎంపిక చేయడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. అర్హత పరీక్షకంటే అదనపు ఉన్నత విద్య అర్హతలు ఉంటే వాటిని తెలపాల్సిన అవసరం లేదు. బీకాం అభ్యర్థులకు 2011 ముందు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ పేపరు ఉండేది. 2011 తరువాత బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ పేపరు ఉండేది. ఈ బీకాం అభ్యర్థులు ఆప్షన్లో ఉండే వాటిలో ఏదో ఒకదానిని ఎంచుకుని ఆన్లైన్లో పూర్తిచేస్తున్నారు. అలా కాకుండా 2011 ముందు, తరువాత పేపర్లును ఎంచుకునేందుకు ‘ఎడిట్ ఆప్షన్’ను ఉపయోగించాలి. బయలాజికల్సైన్స్లో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఆప్షన్ ఉంది. బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ అభ్యర్థులు ‘ఎడిట్ ఆప్షన్’ను ఉపయోగించాలి. మొత్తం మీద ‘ఆన్లైన్’లో పొందుపరచిన వివరాలకు సంబంధించిన జెరాక్స్ పత్రాలను అభ్యర్థులు ‘సెల్ఫ్ అటెస్టేషన్’చేసి ఇవ్వాలి. రెసిడెన్షియల్ సర్టిఫికెట్‌కు సంబంధించి 4 నుంచి 10వ తరగతి వరకు రెగ్యులర్‌గా చదివితే స్టడీ సర్టిఫికెట్ సరిపోతుంది. అలా కాని పక్షంలో ఏ సంవత్సరం విద్యనభ్యసించారో తహశీల్దార్ ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ లేనట్లయితే ‘మీ సేవ’ నుంచి సర్టిఫికెట్ పొందాలి. ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశాం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వివరాలను తెలిపే ప్రతులను స్వీకరించేందుకు మూలాపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేశాం. ఒక్కొక్క కౌంటర్ వద్ద ఒక హెచ్ఎం, ఒక ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు. అన్ని పనిదినాల్లో జనవరి 31వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. సర్టిఫికెట్ల కాపీలను ‘పాలిథిన్ కవర్లలో’ ఉంచి అందజేస్తే మంచిది. హెల్ప్‌లైన్ డెస్క్ ఇన్చార్జిగా సీనియర్ ప్రధానోపాధ్యాయుడు ఎన్.శివకుమార్ వ్యవహరిస్తున్నారు. - షామహ్మద్, డిప్యూటీ డీఈఓ, దరఖాస్తు స్వీకరణల ఇన్చార్జి -
దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు
ఎనిమిది మంది నిందితుల అరెస్టు రూ.5.24 లక్షల దొంగనోట్లు స్వాధీనం దండపల్లె వాసులు, పోలీసులకు ఎస్పీ అభినందనలు చిత్తూరు(అర్బన్): జిల్లాలోని పశ్చి మ మండలాలు, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠాకు పోలీసులు కళ్లెం వేశారు. గంగవరం కేంద్రంగా జరుగుతున్న ఈ తతంగంలో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసు లు వారి నుంచి ప్రింటర్, స్కానర్‌తో పాటు రూ.5.24 లక్షల దొంగనోట్లను కూడా స్వాధీనం చేసుకున్నా రు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ శుక్రవారం స్థానిక పోలీసు అతిథిగృహంలో ఈ వివరాలను ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డితో కలిసి వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ములబాగిల్‌కు చెందిన శంకర్ అక్కడే సెల్ఫోన్లు, జిరాక్స్ దుకాణం నడిపేవాడు. వ్యసనాలకు బానిసైన ఇతడు అప్పులను తీర్చే క్రమంలో కలర్ జిరాక్స్ మిషన్కొని దాని ద్వారా దొంగనోట్లను ప్రింట్ చేయడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ములబాగిల్‌లో పెట్రోలు బంకు నడుపుతున్న విశ్వనాథ్‌కు రూ.6 లక్షల అప్పు చెల్లించాల్సి ఉంది. అందుకుగాను ఏడాది క్రితం రూ.6లక్షల దొంగనోట్లను ఇచ్చాడు. అవి దొంగనోట్లని కొన్ని నెలల తరువాత విశ్వనాథ్ గుర్తించాడు. శంకర్ నుంచి అప్పు వసూలు చేసుకున్నాడు. దొంగనోట్లను శంకర్ తన వద్దే ఉంచుకున్నా డు. స్నేహితులైన ములబాగిల్‌కు చెందిన బాబు, మంజునాథ్, గంగవరం మండలం దండపల్లెకు చెందిన మురళి, అంజలి, దీపశిఖ, హరితో ముందస్తు వ్యూహం పన్ని దొంగనోట్లను చెలామణి చేయడం ప్రారంభించారు. మహిళా సంఘం లో సభ్యులుగా ఉన్న అంజలి, దీపశిఖ సంఘం పొదుపు డబ్బులో దొంగనోట్లను పెట్టి చెలామణి చేయడం ప్రారంభించారు. గ్రామం లో విలాసవంతమైన కార్లు, అనుమానిత వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉండటంతో దండపల్లె గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. గంగవరం డీఎస్పీ హరినాథరెడ్డి, సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టారు. ఇక్కడ దొంగనోట్ల ప్రింటింగ్చేసి చెలామణి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు శుక్రవారం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.500,1000ల దొంగనోట్లు మొత్తం రూ.5,24,500లు, రెండు సెల్ఫోన్లు, ఐదు సిమ్‌కార్డులు స్వాధీ నం చేసుకున్నారు. దొంగనోట్ల ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ రామకృష్ణ, ఎస్ఐ దేవరాజులు, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, పళణి, దేవరాజులు, కానిస్టేబుల్ గణేష్, సిబ్బందిని ఎస్పీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి క్యాష్ రివార్డులను సైతం అందజేశారు. సకాలంలో స్పందించి మంచి సమాచారం అందించిన దండపల్లె గ్రామస్తులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గెలిచే దమ్ములేకే అడ్డదారి రాజకీయూలు పలమనేరు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే అధికార పార్టీ అడ్డదారి రాజకీయాలు చేస్తోందని జె డ్పీ మాజీ చైర్మన్ రెడ్డెమ్మ విమర్శిం చారు. బెరైడ్డిపల్లెలోని తన స్వగృహంలో శుక్రవారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు భయపడుతోందో ప్రజలకందరికీ తెలుసన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సహకార శాఖ మం త్రి కృష్ణారెడ్డితో వాయిదా వేయించిందన్నారు. అదే పంథాను ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీ పీ సైతం అనుసరిస్తూ నోటిఫికేషన్ వెలువడ్డాక మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ ఎన్నికలు జరగకుండా స్టే ఇచ్చారన్నారు. ఎలాగూ ఈ సహకార సంఘాల్లో గెలవమని ఆ పా ర్టీకి తెలిసిందన్నారు. అందుకే ఇప్పు డు నాన్ అఫీషియల్ త్రీమెన్ కమిటీల ద్వారా చైర్మన్, సభ్యులను నియమిస్తుందన్నారు. ఇది సహకార చట్టానికే మచ్చలాంటిదని అన్నారు. గతంలో ఇలాం టి సంఘటనలు ఎదురైనపుడు అధికారుల కమిటీలు ఉండేవే గానీ ఇలా నామినేటేడ్ ద్వారా కమిటీలను ఎన్నిక చేసే విధానం ఇదే తొలిసారన్నారు. ఎన్నికలు నిర్వహించాల్సి న తరుణంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అధికార పార్టీ పదవీవ్యామోహంతో ఇలాంటి పనులకు ఒడిగట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. అందుకే జిల్లాలో ఎక్కడైతే నామినేటేడ్ కమిటీలను ఏర్పాటు చేస్తారో ఆ పీఏసీఎస్‌ల తరపున తాము కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. -
సర్వే జనా సుఖినోభవంతు!
ఉదయం 7.00 గంటల నుంచి ప్రారంభం ఫిర్యాదులకు కాల్‌సెంటర్ 040-21 11 11 11 జిరాక్స్‌లు ఇవ్వనవసరం లేదు సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరుగనున్న మహాక్రతువుకు రెండు రోజుల ముందు నుంచే ప్రీ విజిట్లు నిర్వహించిన ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను గుర్తించారు. ఇంటింటికీ కరపత్రాలు.. అవి అందినట్లుగా స్టిక్కర్లు అతికించారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ వివిధ ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందుతుండడంతో జీహెచ్ఎంసీ కాల్సెంటర్లోని ఫోన్ లైన్లను 30 నుంచి 50కి పెంచారు. ఆదివారం 13.40 లక్షల ఇళ్లను సందర్శించిన సిబ్బంది .. 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు. సాక్షి, సిటీబ్యూరో:సర్వేకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ చెప్పారు. రెండు రోజుల పాటు సాగిన క్షేత్ర స్థాయి పర్యటనలలో కొన్ని ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని, అవసరానికి సరిపడా సామగ్రిని సిద్ధం చేశామన్నారు. అదనపు సిబ్బందిని నియమించుకునేందుకు ఎన్యూమరేటర్లకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఏ ప్రాంతాల్లోనైనా సర్వే జరుగని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేలో సహకరించేందుకు సహాయ ఎన్యూమరేటర్లుగా విద్యార్థులతోపాటు వివిధ వర్గాల వారిని నియమించుకున్నప్పటికీ..ఎన్యూమరేటరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో సోమవారం ప్రీ విజిట్లకు వెళ్లిన ఎన్యూమరేటర్లు సర్వేను సైతం పూర్తి చేశారు. సర్వేలో భాగంగా వివరాలు అందజేయడమే తప్ప.. జిరాక్స్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్ నుంచి సర్వే ఫారాలను 25వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని కమిషనర్ చెప్పారు. ప్రీ విజిట్లలో దృష్టికొచ్చిన అంశాలు.. అందుకనుగుణంగా తీసుకుంటున్న చర్యలు..ఏర్పాట్లు తదితర అంశాలను కమిషనర్ సోమేశ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. పెరిగిన గృహాలు 2011 జనాభా లెక్కల మేరకు గ్రేటర్లో దాదాపు 13 లక్షల ఇళ్లుండగా.. ఇటీవలి సర్వేలో 16.96 లక్షల ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు లక్షల ఇళ్లు అదనంగా వచ్చినా ఇబ్బందులు లేకుండా సర్వే పూర్తి చేయాలనే ఉద్దేశంతో సిబ్బంది నియామకాలతోపాటు కరపత్రాలు.. స్టిక్కర్లు పంపిణీ చేశారు. ఆదివారం ప్రీ విజిట్‌లో 13.40 లక్షల ఇళ్ల సర్వే జరగ్గా, అందులో 2.06 లక్షల ఇళ్లు కొత్తగా వచ్చినట్లు గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 21 లక్షల ఇళ్లకు సరిపడా మెటీరియల్‌ను అందజేశామని కమిషనర్ తెలిపారు. ఇంకా సరఫరా చేస్తున్నామన్నారు. 21,636 ఇళ్లకు తాళాలు ఇంటింటి సర్వేను పురస్కరించుకొని సొంత గ్రామాలకు వెళ్లిన వారూ తక్కువేమీలేరు. ఆదివారం నాటి సర్వేలో 21,636 ఇళ్లకు తాళాలు ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఒక్క ఇల్లూ తప్పిపోకూడదనే.. గ్రేటర్ నగర విస్తీర్ణం ఎక్కువగా ఉండటం.. జనసాంద్రత భారీగా ఉండటంతో ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా సర్వే నిర్వహించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ చెప్పారు. మనుషులు చెట్లు కింద ఉన్నా, రోడ్డు పక్కన పొయ్యి ఉన్నా... వారి వివరాలు నమోదు చేయాల్సిందేనన్నారు. ఇది మనుషులకు సంబంధించిన సర్వే తప్ప ఆస్తులకు సంబంధించినది కాదన్నారు. సంచార జాతుల వారి వివరాలూ నమోదు చేస్తామన్నారు. జిరాక్స్‌లతో పని లేదు ఎన్యూమరేటర్లు సర్వేకు వచ్చినప్పుడు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకు, ఆధార్ కార్డు..ఆస్తిపన్ను నెంబరు(పీటీఐఎన్), బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కనెక్షన్ వంటి వాటి నెంబర్లలో పొరపాట్లకు తావులేకుండా చూసేందుకే జిరాక్స్ కాపీలు అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నాం తప్ప వాటిని సర్వేయర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. కేవలం ఎన్యూమరేటర్ల ధ్రువీకరణ కోసమే జిరాక్స్‌లు ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈ సూచన చేశామన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలనడం వెనుక కూడా మరో కారణం లేదన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు ప్రజల ఇష్టం .. బ్యాంకు ఖాతా నెంబరు తెలపాలా.. వద్దా అనేది ప్రజల నిర్ణయమేనని, బలవంతం లేదని కమిషనర్ చెప్పారు. ఇచ్చినా తగు భద్రత ఉంటుందని, భయపడాల్సిన పనిలేదని భ రోసా ఇచ్చారు. ఎన్యూమరేటర్‌కు 40 ఇళ్లు.. ఒక్కో ఎన్యూమరేటర్‌కు సర్వే చేయాల్సిన ఇళ్లు 40కి మించకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. అత్యవసర పనుల మీద వెళ్లినవారు.. విదేశాల్లో ఉంటున్న వారికి సంబంధించి ఏవైనా ఆధారాలు చూపితే చాలునన్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్... సమగ్ర కుటుంబ సర్వేలోని వివరాల డేటాబేస్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి, 15 రోజుల్లో కంప్యూటరీకరిస్తామన్నారు. ఈ జాబితా ఆధారంగానే భవిష్యత్‌లో ఏ పథకానికి ఏ వివరాలు అవసరమవుతాయో వాటిని వినియోగిస్తామన్నారు. బదిలీలైనప్పుడు, ఇల్లు మారినప్పుడు సవరించేందుకు వీలుగా డేటాబేస్‌లో మార్పులూ చేర్పులకు వీలుంటుందని కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. సర్వే కేవలం బీపీఎల్ కుటుంబాలకు సంబంధించినది మాత్రమే కాదని, ఏపీఎల్ కుటుంబాలకూ పనికివచ్చేదన్నారు. సర్వేలో పాల్గొనకుంటే భవిష్యత్‌లో కొన్ని ప్రయోజనాలు కోల్పోయే అవకాశాలుంటాయన్నారు. ఆర్థిక పరిస్థితి, స్థానికతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, సర్వేలో ఈ వివరాలు లేవని చెప్పారు. డేటా దుర్వినియోగం జరిగేందుకు ఆస్కారం లేదని, అత్యంత భద్రంగా ఉంటుందన్నారు. సర్వేలో హిజ్రాల వివరాల నమోదుకూ ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఫిర్యాదుల పరంపర... ఆదివారం సాయంత్రం నుంచీ తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు రోజుకు సగటున 300 ఫిర్యాదులు అందేవి. ఆదివారం ఈసంఖ్య 5,616కు చేరింది. సోమవారం రాత్రి 8.40 గంటల వరకు 4776 ఫిర్యాదులు అందాయి. ఫోన్లు నిరంతరం బిజీగా ఉండటంతో చాలామందికి అసలు లైన్లే కలవలేదు. ఈ పరిస్థితిని గుర్తించి కాల్సెంటర్లోని 30 లైన్లకు తోడు అదనంగా మరో 20 లైన్లు పెంచారు. ప్రస్తుతం 50 లైన్లు పని చేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని..స్థానిక డిప్యూటీ కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేయవచ్చునన్నారు. వెబ్సైట్ కంటే ఫోన్‌కాల్స్ ద్వారా త్వరితంగా చర్యలకు వీలవుతుంది. సర్వే పరిశీలనకోసం నోడల్ ఆఫీసర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తారు. తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాని విషయాన్ని నోడల్ ఆఫీసర్లకు సైతం తెలియజేయవచ్చు. అంతిమ నిర్ణయం ప్రజలదే.. సర్వేలో భాగంగా కుటుంబ వివరాలు.. ఇతరత్రా సమాచారం తెలియజేయవచ్చా? లేదా అనేది అంతిమంగా ప్రజల నిర్ణయమేనని, ఏదీ కచ్చితం కాదన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టబోయే వివిధ పథకాలకు.. ఇతరత్రా అవసరాలకు సర్వే ద్వారా నమోదైన డేటా ఉండటం అవసరమన్నారు. ఉదాహరణకు భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకున్నా.. ఆన్లైన్లో వివరాలు ఉన్నాయోమో చూస్తారని, లేని పక్షంలో ఇబ్బంది ఎదురు కావచ్చన్నారు. కుటుంబానికి సంబంధించిన మొత్తం సమాచారం ఇస్తే మంచిదన్నారు. సర్వే సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసు సహకారాన్ని కోరుతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ, 7500 మంది పోలీసులే ఎన్యూమరేటర్లుగా ఉన్నారని తెలిపారు. చాలా ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు రాలేదని, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో.. మేయర్ వార్డులో సైతం చాలామంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదనగా.. అన్ని ప్రాంతాలకూ వస్తారని, రాని పక్షంలో కాల్‌సెంటర్, వెబ్సైట్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, తగు ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. సర్వే జరగకుండా మిగిలిపోయే ఇళ్లుంటే... పరిస్థితేమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి వాటి విషయంపై ఆలోచిస్తామన్నారు. తాళాలు ఉన్న వాటితో పాటు మిగిలిపోయిన ఇళ్ల విషయాలపైనా ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
జిరాక్స్ పేపర్లతో హెచ్ఎంల పాట్లు
వర్గల్,న్యూస్‌లైన్: సీసీఈ విధానంలో విద్యార్థుల సమగ్ర మదింపు కోసం నిర్వహిస్తున్న అర్థ వార్షిక పరీక్షలు తొలి రోజు అభాసుపాలయ్యాయి. గురువారం వర్గల్ మండలంలోని అనేక పాఠశాలల్లో జిరాక్స్ ప్రశ్నపత్రాలతో పరీక్షలు నెట్టుకొచ్చారు. ప్రశ్నపత్రాలు సక్రమంగా పంపిణీ చేయడంలో ఆర్వీఎం విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వర్గల్ మండలంలో 37 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలున్నాయి. వర్గల్, పాములపర్తి, మజీద్‌పల్లి, తున్కిఖాల్సా, వేలూరు ,నెంటూరు కాంప్లెక్సుల పరిధిలో ఇవి ఉన్నాయి. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు గురువారం అర్థవార్షిక పరీక్షలు ప్రారంభ మయ్యాయి. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రశ్న పత్రాలు అనేక పాఠశాలలకు సక్రమంగా అందలేదు ‘సాక్షి’ దినపత్రిక ద్వారా ఈ పరిస్థితి వెలుగులోకి రావడంతో ఆర్వీఎం అధికారులు ప్రశ్నపత్రాల సర్దుబాటు చేసే పనిలో పడ్డారు. ఏ పాఠశాలకు అదనంగా ప్రశ్నపత్రాలు చేరాయో సమాచారం సేకరించి, వాటిని కొరత నెలకొన్న మండలాలకు చేరవేసే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. మండలంలో ప్రధానంగా పాములపర్తి, తున్కిఖాల్సా, నెంటూరు కాంప్లెక్సుల పరిధిలో ప్రశ్నపత్రాల కొరత గుర్తించారు. తొలిరోజు గురువారం తెలుగు పరీక్ష జరగాల్సిఉండగా పాములపర్తి, గౌరారం, పాతూరు, తున్కిఖాల్సా పాఠశాలలకు ఏడో తరగతి ప్రశ్నపత్రం ఒక్కటి కూడా రాలేదు. దీంతో పాఠశాలల హెచ్ఎంలు పరిస్థితిని మండల విద్యాధికారి దృష్టికి తీసుకవెళ్లారు.