అవినీతి నిరూపించాలి | his office front mpdo dharna in elligations of corruption | Sakshi
Sakshi News home page

అవినీతి నిరూపించాలి

Published Wed, Mar 30 2016 2:02 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతి నిరూపించాలి - Sakshi

అవినీతి నిరూపించాలి

తన కార్యాలయం ఎదుట ఎంపీడీవో ధర్నా
రోడ్డెక్కిన మండల పరిషత్ కార్యాలయ గొడవ

 
శాయంపేట :  తనపై అవినీతి ముద్ర వేసిన ఎంపీపీ బాసని రమాదేవి తన అవినీతి నిరూపించాలని ఎంపీడీవో బానోతు భద్రునాయక్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం నల్లబ్యాడ్జీ ధరించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీవోగా మండలంలో 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఏ రోజు నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. కార్యాలయానికి సంబంధించిన ప్రతి ఖర్చు రికార్డుల్లో ఉన్నాయన్నారు. ఎక్కడ అవినీతికి పాల్పడ్డానో ఎంపీపీ నిరూపించాలని డిమాండ్ చేశారు.

మండల కోఆర్డినేటర్ దైనంపల్లి కుమారస్వామికి కోర్డు ఉత్తర్వుల ప్రకారమే వేతన బిల్లును ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు చెప్పారు.  కాగా, ఎంపీపీ బాసని రమాదేవి మాట్లాడుతూ గతంలో ఆసరా పింఛన్లకు సంబంధించిన రూ.50వేల చెక్కును తనకు తెలియకుండానే విడిపించుకుని తన సొంతానికి వాడుకున్నాడని ఆరోపించింది. అంతే కాకుండా సాక్షరభారత్ పథకానికి చైర్మన్‌గా ఉన్న తనకు సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ 16 నెలల వేతనాన్ని పని చేయకుండానే ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం ఏమిటని ప్రశ్నించారు.  

 అసలే జరిగిందంటే..
కొన్ని నెలల క్రితం జరిగిన సమావేశానికి సాక్షరభారత్ కోఆర్డినేటర్  హాజరు కాలేదని, ఆయనను తొలగించాలని మండల సర్వసభ్య సమావేశంలో తీర్మాణించారు.   అనంతరం ఎంపీపీ గ్రామ కోఆర్టినేటర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.  తరువాత మండల కోఆర్టినేటర్ కుమారస్వామిని తనను ఎలా తొలగించారంటూ కోర్టుకెళ్లాడు. దీంతో ఎంపీపీ, ఎంపీడీవోలకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్, టీ, టీఫిన్, జిరాక్స్ బిల్లులులకు సంబంధించిన చెక్కుల సంతకాల విషయంలో ఎంపీడీవో భద్రునాయక్ సంతకాలు చేయడంలేదని ఎంపీపీ ఆరోపణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement