‘ఓటుకు కోట్లు’కేసులో సీఎం రేవంత్‌కు నాంపల్లి కోర్టు ఆదేశం
విచారణకు గైర్హాజరు కావడంపై న్యాయమూర్తి అసహనం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసు విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గైర్హాజరు కావడంపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 16న న్యాయస్థానం ఎదుట తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో మంగళవారం జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి, వేం కృష్ణ కీర్తన్, ఉదయ్ సింహ, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ హాజరుకాలేదు. ఒకరోజు విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. అయితే అభియోగాల నమోదుపై విచారణ కోసం వచ్చే నెల 16న మాత్రం హాజరుకావాల్సిందేనని రేవంత్ సహా నిందితులందరికీ స్పష్టం చేసింది.
ఏసీబీ, ఈడీ విచారణలతో..
2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను టీడీపీ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలంటూ రూ.కోట్లు ఆశచూపిన ఆరోపణలపై నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్‌సన్ ఇంట్లో రేవంత్ డబ్బు సంచులతో ఉన్న వీడియోలు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కేసులో రేవంత్ జైలుకు వెళ్లి, తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. రేవంత్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన వద్ద రూ.50 లక్షల నగదును ఏసీబీ స్వా«దీనం చేసుకుంది.
ఈ నగదు అక్రమ మార్గాల్లో వచి్చందన్న ఏసీబీ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండు విచారణలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో నిందితులు మంగళవారం విచారణకు గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణకు హాజరు కా వాలని రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేం కృష్ణ కీర్తన్‌లను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment