
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో విచారణ జరిగింది. ఈ కేసులో అక్టోబర్ 16న విచారణకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. నేటి విచారణకు ముత్తయ్య మినహా మిగతా నిందితులందరూ గైర్హాజరు అయ్యారు. సీఎం రేవంత్, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
అయితే ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు.. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ నాంపల్లి కోర్టు ఆదేశించింది.
చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే : కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment