హైదరాబాద్, సాక్షి: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. జడ్జీ లీవ్‌లో ఉండటంతో కోర్టు కేసును వాయిదా వేసింది. ఇవాళ.. విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నిందితులను గత నెల 24న కోర్టు ఆదేశించింది. గత నెల 24న విచారణకు మత్తయ్య హాజరుకాగా, మిగతా నిందితులు గైర్హాజరు అయ్యారు.
నేటి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం సండ్ర వెంకట వీరయ్య మాత్రమే హాజరయ్యారు. మరోవైపు.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోతే.. కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని మంగళవారం మత్తయ్య మీడియాతో అన్నారు.
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు కీలకత తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్‌లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది.
చదవండి: బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే
Comments
Please login to add a commentAdd a comment