సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో కాసం.. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో రేవంత్‌కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.
మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రతినబూనిందని.. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని.. అందుకే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ రేవంత్ కాంట్రవర్శి కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment