నెల్లూరు (విద్య): డీఎస్సీకి ‘ఆన్‌లైన్’లో దరఖాస్తు చేసేటప్పుడు, అదే ప్రతిని విద్యాశాఖ కార్యాలయంలో అందజేసేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో పొందుపరిచిన వివరాలను, సంబంధిత జెరాక్స్ పత్రాలను విద్యాశాఖ అధికారులకు అందజేయాలి. చాలా మంది అభ్యర్థుల ‘ఆన్‌లైన్’వివరాలు, వారు అందజేసే జెరాక్స్ పత్రాలు ఒకటిగా ఉండనట్లయితే విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరించడంలేదు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.ఆంజనేయులు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.
8 ఆన్‌లైన్ దరఖాస్తును పూరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముందుగా ప్రతి ఆప్షన్‌ను చదివి, అందుకు సంబంధించిన పత్రాలు, వివరాలు సరిచేసుకుని ఆన్‌లైన్ దరఖాస్తు పూరించాలి. అదే ప్రతిని జెరాక్స్ పేపర్లతో కలిపి విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి
సర్టిఫికెట్లలో ఏ వివరాలైతే ఉన్నాయో? వాటినే ఆన్‌లైన్‌లో ఆప్ట్(ఎంపిక) చేయాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్లలో లేని వాటిని ఎంపిక చేయడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. అర్హత పరీక్షకంటే అదనపు ఉన్నత విద్య అర్హతలు ఉంటే వాటిని తెలపాల్సిన అవసరం లేదు.
బీకాం అభ్యర్థులకు 2011 ముందు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ మేనేజ్‌మెంట్ పేపరు ఉండేది. 2011 తరువాత బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్ పేపరు ఉండేది. ఈ బీకాం అభ్యర్థులు ఆప్షన్‌లో ఉండే వాటిలో ఏదో ఒకదానిని ఎంచుకుని ఆన్‌లైన్‌లో పూర్తిచేస్తున్నారు. అలా కాకుండా 2011 ముందు, తరువాత పేపర్లును ఎంచుకునేందుకు ‘ఎడిట్ ఆప్షన్’ను ఉపయోగించాలి. బయలాజికల్‌సైన్స్‌లో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఆప్షన్ ఉంది. బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ అభ్యర్థులు ‘ఎడిట్ ఆప్షన్’ను ఉపయోగించాలి. మొత్తం మీద ‘ఆన్‌లైన్’లో పొందుపరచిన వివరాలకు సంబంధించిన జెరాక్స్ పత్రాలను అభ్యర్థులు ‘సెల్ఫ్ అటెస్టేషన్’చేసి ఇవ్వాలి.
రెసిడెన్షియల్ సర్టిఫికెట్‌కు సంబంధించి 4 నుంచి 10వ తరగతి వరకు రెగ్యులర్‌గా చదివితే స్టడీ సర్టిఫికెట్ సరిపోతుంది. అలా కాని పక్షంలో ఏ సంవత్సరం విద్యనభ్యసించారో తహశీల్దార్ ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ లేనట్లయితే ‘మీ సేవ’ నుంచి సర్టిఫికెట్ పొందాలి.
ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశాం :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వివరాలను తెలిపే ప్రతులను స్వీకరించేందుకు మూలాపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేశాం. ఒక్కొక్క కౌంటర్ వద్ద ఒక హెచ్‌ఎం, ఒక ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ ఉంటారు. అన్ని పనిదినాల్లో జనవరి 31వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. సర్టిఫికెట్ల కాపీలను ‘పాలిథిన్ కవర్లలో’ ఉంచి అందజేస్తే మంచిది. హెల్ప్‌లైన్ డెస్క్ ఇన్‌చార్జిగా సీనియర్ ప్రధానోపాధ్యాయుడు ఎన్.శివకుమార్ వ్యవహరిస్తున్నారు.
- షామహ్మద్, డిప్యూటీ డీఈఓ,
దరఖాస్తు స్వీకరణల ఇన్‌చార్జి
డీఎస్సీ ‘ఆన్‌లైన్’.. జరభద్రం
Published Mon, Dec 29 2014 2:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement