
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : ఎస్‌బీఐ ఏటీఎం డిపాజిట్ మెషిన్లలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని హర్యానా ముఠా రాష్ట్రంలో హైటెక్ చేతివాటాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీని గురించి ప్రజలు మరిచిపోక ముందే ఓ వ్యక్తి ఏకంగా రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి తన భార్య ఖాతాలోకి బ్యాంక్ ఆఫ్ బొరడా ఏటీఎం డిపాజిట్ మెషన్ ద్వారా డిపాజిట్ చేశాడు. పుదుకోటై జిల్లా అరంతాంగిలోని బ్యాంక్ ఆఫ్ బొరడా డిపాజిట్ మెషిన్‌ను తనిఖీ చేయగా రూ.2 వేలు జిరాక్స్ నోట్లు డిపాజిట్ చేసి ఉండడం వెలుగు చూసింది.
సీసీ పుటేజీ ఆధారంగా అరంతాంగికి చెందిన శరవణన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తన భార్య రేవతి ఖాతాలో రూ.2 వేలు జిరాక్స్ నోట్లతో రూ.60 వేలు డిపాజిట్ చేసినట్టు అంగీకరించాడు. అనంతరం మరో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నట్టు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి శరవణన్, రవిచంద్రన్‌ను అరెస్టు చేశారు.
చదవండి: బిట్ కాయిన్స్ పేరుతో రూ.60 లక్షలు స్వాహా
Comments
Please login to add a commentAdd a comment