సాక్షి, కుప్పం: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లో 70 ఏనుగుల గుంపు హల్‌చల్ చేసి కుప్పం వైపు దూసుకొస్తున్నట్టు కర్ణాటక ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీంతో, ఏపీ సరిహద్దు ప్రాంత అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు.. గ్రామ సరిహద్దులోను, పొలాల్లో రాత్రి పూట ప్రజలు ఉండకూడదని హెచ్చరికలు ముందస్తుగా జారీ చేసి, గ్రామాల్లో ఏనుగులు కంట పడితే వెంటనే సంబంధిత పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక, ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment