సెల్ఫీ.. క్రేజీ! | pets selfi with celebreties | Sakshi
Sakshi News home page

సెల్ఫీ.. క్రేజీ!

Published Fri, Mar 20 2015 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

సెల్ఫీ.. క్రేజీ!

సెల్ఫీ.. క్రేజీ!

అందంగా ముస్తాబయ్యి కొత్తబట్టలు వేసుకొని ఫొటో స్టూడియోకి వెళ్లి.. ఫ్లవర్‌వాజ్‌పై చేయి వేసి నిటారుగా నిల్చుని ఫొటో దిగడం ఒకనాటి మాట. ఇప్పుడు పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్స్‌కు తప్ప ఫొటోగ్రాఫర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. సెల్‌ఫోన్స్‌లో కెమెరా ఫొటోల్లో ఓ విప్లవాన్నే తెచ్చింది. ఎవరో ఒకరు ఫొటో తీయడం పక్కకు పోయి... ఫ్రంట్ కెమెరాలతో సెల్ఫీస్ వచ్చాయి. తరువాత ఆ స్థానంలో గుల్ఫీస్, హెల్ఫీస్, వేల్ఫీస్... ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ పెల్ఫీస్!
 
ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్స్, హై రిజల్యూషన్ కలిగిన ట్యాబ్స్, మొబైల్స్‌కి ఆదరణ పెరిగింది. దాంతో తమ క్లాస్‌మేట్స్, పేరెంట్స్ ఫేవరెట్ ప్లేస్‌లో గుల్ఫీలు తీసుకుని మురిసిపోయిన నగరవాసులు ట్రెండ్‌ని సృష్టించారు. అతివలు తమ అందమైన కురులను మాత్రమే ఫొటో తీసి దానికి హెల్ఫీగా నామకరణం చేసి సోషల్ నెట్‌వర్క్స్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ తరువాత వర్కవుట్స్ వంతు వ చ్చింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫొటోస్‌ను తీసి వాటిని ‘వెల్ఫీ’లుగా అప్‌డేట్ చేశారు.
 
ఇప్పుడు కొత్తగా...
ఈ కోవలోకే చేరింది ‘పెల్ఫీ’! తమ బెస్ట్ బడ్డీలుగా పెంచుకుంటున్న పెట్స్‌తో సెల్ఫీలు దిగి.. సోషల్‌వెబ్‌సైట్స్‌లో, వాట్సప్‌లలో ప్రొఫైల్ పిక్చర్స్‌గా పెట్టేస్తున్నారు. అంతేకాదు ఆ ఫొటోకి తగ్గ కామెంట్ రాసి తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు. ఇంకొందరైతే ఇంకో అడుగు ముందుకేసి తమ పెట్స్‌ని పార్లర్‌కి తీసుకెళ్లి, గ్రూమింగ్ చేయించి యాక్సెసరీస్ వేసి మరీ అందంగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. దానికి వచ్చే లైక్స్, కామెంట్స్‌ను చూసుకుని మురిసిపోతున్నారు.
 
షార్ట్ ఫిలింస్...
అయితే ఈ తరహా పెట్స్ ప్రిఫరెన్స్ వెస్ట్రన్ కంట్రీస్‌లో పాతదే! మన దేశంలోకి ఇప్పుడిప్పుడే స్పోర్ట్స్ పర్సన్స్, సెలబ్రిటీస్, బిజినెస్‌మెన్స్, నిత్యం బిజీగా ఉండే పొలిటీషియన్స్ సైతం తీరిక దొరికినప్పుడల్లా రిలాక్స్ అవ్వడానికి ఇదే రూట్‌ని ఎంచుకుంటున్నారు. ‘పెల్ఫీ’స్‌తో కాలక్షేపం చేస్తూ ఆనందిస్తున్నారు. మరికొందరైతే... తమ పెట్స్‌తో ఏకంగా షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలే తీస్తున్నారు. మన నగరంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ ‘పెల్ఫీస్’ ట్రెండ్ సెలబ్రిటీస్‌కి కాలక్షేపం... సాధారణ జనానికి ఆసక్తిగా మారింది!
- సిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement