స్వీ T- షర్ట్స్ | Swee T- shirts | Sakshi
Sakshi News home page

స్వీ T- షర్ట్స్

Published Fri, Mar 27 2015 11:48 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

స్వీ T- షర్ట్స్ - Sakshi

స్వీ T- షర్ట్స్

సెల్ఫీస్ ఎక్కడుంటాయి? ఫేస్‌బుక్, వాట్సప్ ఆర్ ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిబింబిస్తుంటాయి! అనుకున్నారంటే... మీరు ఫ్యాషన్‌లో అప్‌డేట్ కానట్టే. ఎందుకంటే... ఇప్పుడు సెల్ఫీస్ అండ్ హాష్‌ట్యాగ్స్ వార్డ్‌రోబ్‌లోకి చేరిపోయాయి. సోషల్ నెట్‌వర్క్స్‌లోని ఈ ట్రెండ్‌ని క్యాప్చర్ చేసి అవుట్‌ఫిట్‌గా మార్చి... అతివల ఒంటి మీదకు చేర్చారు డిజైనర్స్. సెలబ్రిటీస్‌నుంచి కాలేజ్ గాళ్స్‌వరకు ఇష్టపడుతున్న సెల్ఫీ స్వీట్‌షర్ట్స్ ప్రస్తుతం ట్రెండ్!

కాదేదీ కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ... కానీ కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అని పునర్ నిర్వచనమిస్తున్నారు డిజైనర్స్. యూత్‌ను అట్రాక్ట్ చేసే ఏదైనా సరే అవుట్‌ఫిట్స్‌లోకి చేర్చడం అందరికీ తెలిసిందే. సెల్ఫీస్ ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లో ట్రెండ్. దాన్ని టీ షర్ట్స్ మీద ఫోకస్ చేసి మార్కెట్‌లోకి తెచ్చారు. మీరు సెల్ఫీస్ ఇష్టపడ్డా లేదంటే వాటిని అసహ్యంచుకున్నా... అభిప్రాయం ఏదైనా షర్ట్‌మీద
 వ్యక్తపరచొచ్చు.
 
స్టైల్ స్టేట్‌మెంట్...

ఈ స్వీట్ షర్ట్స్ స్టైలిష్ మాత్రమే కాదు... లగ్జరీయస్ కూడా! వీటిని మీరు ఫ్లెయిర్ స్కర్ట్, ట్రౌజర్స్ లేదా ఫార్మల్ ట్రౌజర్స్, జీన్స్, కట్ ఆఫ్ షార్ట్స్‌పైకి మ్యాచింగ్ వేసుకోవచ్చు. ఈవెనింగ్ ఔటింగ్స్‌కి, కాక్‌టెయిల్ పార్టీస్‌కి, ఫ్రెండ్స్‌తోసినిమాలు, లంచ్ లేదా షాపింగ్ అకేషన్ ఏదైనా, ఏ లొకేషన్‌కయినా పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్! అయితే ఆ టాప్ అండ్ బాటమ్ కాంట్రాస్ట్ కలర్స్ అయితే.. మీరు గ్రాండ్‌గా కనబడతారు. న్యూ స్టైల్‌కి స్టేట్‌మెంట్‌లాగా మారిపోతారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement