ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజలు సోషల్ మీడియాను ఫాలో అవుతూ చైతన్యవంతులవుతున్నారు. ముఖ్యంగా యువత ‘ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, వాట్స్‌అప్, యూట్యూబ్’ తదితర సామాజిక మీడియాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు చుట్టూ సమాజంలో జరుగుతున్న అంశాలను తెలుసుకుంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు తమకు తెలిసిన సమాచారాన్ని కూడా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ అంశాలను కొందరు లైక్, షేర్ చేస్తూ సరికొత్త విప్లవానికి బాటలు వేస్తున్నారు.
ఢిల్లీలో చోటు చేసుకున్న ‘నిర్భయ’ ఘటన దేశాన్ని కదిలించడానికి కేవలం సోషల్ మీడియానే కారణం. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను యువత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలోకి దిగిన కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సామాజిక మీడియాను ఉపయోగించుకుని అద్భుత ఫలితాలు సాధించింది. అలాగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా యువత మద్దతు కూడగడుతున్నారు. రాష్ట్రంలో కూడా సామాజిక మీడియా రాజకీయాల్లో తన వంతు పాత్ర పోసిస్తోం ది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలో వైఎస్సార్‌సీపీ సైట్‌ను ఏడు లక్షల మంది యువత సందర్శించడమే. యువనాయకత్వానికి ప్రాధాన్యమిస్తున్న యువత రోజురోజుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు మద్దతు ఇస్తున్నారు.
శాసిస్తున్న సోషల్ మీడియా..!
Published Fri, Apr 11 2014 2:55 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement
Advertisement