google plus
-
Google: గూగుల్ నుంచి బంపరాఫర్
వర్క్‌ఫ్రమ్ హోం ఇతరత్ర కారణాలతో డేటా స్టోరేజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్. కొత్తగా క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్లను ప్రకటించింది. అందులో 5టీబీ స్టోరేజ్ ప్లాన్‌ను మంత్లీ, ఇయర్లీ ప్యాకేజీవారీగా తక్కువ ధరకే అందిస్తుండడం విశేషం. గూగుల్ సర్వీస్‌లోని జీమెయిల్, గూగుల్ ఫొటోస్‌లోని ఇమేజెస్, వీడియోస్, గూగుల్ డ్రైవ్‌లో ఏదైనా డాటా స్టోర్ చేసుకోవడానికి ఒక లిమిట్(15 జీబీ) అంటూ ఉంది కదా. ఒకవేళ ఆ పరిధి దాటి ఉపయోగించుకోవాల్సి వస్తే.. స్టోరేజ్‌ను మంత్లీ/ఇయర్లీ ప్యాకేజీల వారీగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా గూగుల్ వన్ యాప్ ప్రకటన ప్రకారం.. తక్కువ ధరలో 5 టీబీ స్టోరేజ్ కోసం నెలకు 1,649రూ. అందిస్తుండగా, ఏడాది ప్లాన్‌కు 15, 900రూ. చెల్లించాల్సి ఉంటుంది. మిగతావి ఇలా.. ఇక 5టీబీ స్టోరేజ్‌ను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి పంచుకునే వీలు కూడా ఉంది. అంతేకాదు భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో గూగుల్ వీపీఎన్ సర్వీస్ సైతం ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించనుంది గూగుల్. గత ప్లాన్ల ప్రకారంగానే స్టోరేజ్ ప్యాకేజీలను గూగుల్ యూజర్లకు అందిస్తోంది. 100 జీబీ స్టోరేజ్ కోసం నెలకు రూ.130 చెల్లిస్తే.. , ఏడాదికి 1,300రూ. చెల్లించాలి. 200జీబీ ప్లాన్ కోసం నెలకు 210రూ., ఏడాదికి 2,100రూ. చెల్లించాలి. 2 టీబీ స్టోరేజ్ కోసం నెలకు 650రూ., ఏడాదికి రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్లాన్స్ కూడా గూగుల్ వన్ వెబ్సైట్, యాప్ ద్వారా సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. క్లిక్: గూగుల్ ‘చిప్’.. అంతా బిల్డపేనా? రేటు ఎక్కువే.. అయితే 2 టీబీ స్టోరేజ్ కంటే మించి ప్లాన్స్ మాత్రం యాప్ ద్వారానే సబ్ స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో 10 టీబీ ప్లాన్ నెలకు రూ.3,249రూ. కాగా, 20 టీబీ స్టోరేజ్‌కు నెలకు 6,500రూ. చెల్లించాల్సి ఉంటుంది. ఇక టాప్ టైర్ ప్లాన్‌గా చెప్పుకునే 30టీబీ స్టోరేజ్ కోసం నెలకు 9,700రూ. చెల్లించాల్సి ఉంటుంది. ఇక 100 జీబీ, 200జీబీ, 2టీబీ ప్లాన్స్ గూగుల్ వన్ వెబ్సైట్ కంటే యాప్‌లో అత్యధిక రేటుకు అందజేయడం కొసమెరుపు. గూగుల్ ఫోటోస్ నుంచి అపరిమిత డేటా స్టోరేజ్ సౌకర్యాన్ని ఈ ఏడాది మొదట్లో గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచే గూగుల్ డ్రైవ్ విషయంలో ఇది అమలు అవుతోంది. ఇక 15 జీబీ డాటా స్టోరేజ్ దాటితే.. కచ్చితంగా స్టోరేజ్ కొనుగోలు చేయాలని, లేకుంటే కొత్తగా డాటా స్టోర్కాదని, పైగా ఆల్రెడీ స్టోరేజ్‌పై ప్రభావం పడి డిలీట్ అయ్యే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది కూడా. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
గూగుల్ ప్లస్‌కు గుడ్‌బై!!
వాషింగ్టన్: టెక్ దిగ్గజం గూగుల్‌కి చెందిన సోషల్ మీడియా సైట్ గూగుల్ ప్లస్ మూతపడనుంది. సాఫ్ట్వేర్ పరమైన సాంకేతిక లోపాలతో యూజర్ల డేటా ఇతరుల చేతికి చేరే అవకాశాలుండటమే ఇందుకు కారణం. ఒక బగ్ మూలంగా 5,00,000 మంది యూజర్ల ప్రైవేట్ డేటా బయటి డెవలపర్లకు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తించిన గూగుల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఏ డెవలపర్‌కు కూడా ఈ బగ్ గురించి గానీ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) దుర్వినియోగం గురించి గానీ తెలుసనడానికి తగిన ఆధారాలేమీ కనిపించలేదని గూగుల్ తెలిపింది. అలాగే ఎవరి ప్రొఫైల్ డేటా కూడా దుర్వినియోగం అయిన దాఖలాలు కూడా కనిపించలేదని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ఇంజినీరింగ్ విభాగం) బెన్ స్మిత్... ఒక బ్లాగ్‌లో పేర్కొన్నారు. బగ్‌ను సరిదిద్దేందుకు జరిగిన ప్రయత్నాల్లో భాగంగా అంతర్గతంగా నిర్వహించిన పరిశీలనలో ఈ అంశాలు వెల్లడైనట్లు ఆయన వివరించారు. అయితే, గూగుల్ ప్లస్‌ను తక్షణం మూసివేయబోమని, 10 నెలల వ్యవధి ఉంటుందని స్మిత్ తెలిపారు. వచ్చే ఆగస్టునాటికల్లా ప్రక్రియ పూర్తి కావొచ్చని పేర్కొన్నారు. ఈ లోగా తమ డేటాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వేరే యాప్స్‌లోకి పంపించుకోవచ్చు తదితర అంశాల గురించి యూజర్లకు తగు అవగాహన ఇవ్వనున్నట్లు స్మిత్ తెలిపారు. పిక్సెల్ త్రీ విడుదల.. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ సిరీస్‌లో గూగుల్ మంగళవారం పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ఎల్ పేరిట కొత్త ఫోన్స్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో పిక్సెల్ 3 రేటు రూ. 71,000 నుంచి రూ. 80,000 దాకా ఉండనుండగా, పిక్సెల్ 3 ఎక్స్ఎల్ రేటు రూ. 83,000 నుంచి రూ. 92,000దాకా ఉంటుంది. ఇవి 64జీబీ, 128 జీబీ వెర్షన్లలో లభిస్తాయి. అమెరికా మార్కెట్లో అక్టోబర్ 19 నుంచి, భారత్ సహా మిగతా దేశాల్లో నవంబర్ 1 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. పిక్సెల్ 3 స్క్రీన్ 5.5 అంగుళాలు, 3 ఎక్స్ఎల్ తెర 6.3 అంగుళాలు ఉంటుంది. పిక్సెల్ 3 ఫోన్లో ముందువైపు రెండు కెమెరాలు ఉంటాయి. మరోవైపు, అమెరికా మిలిటరీ కంప్యూటింగ్ సిస్టమ్స్‌ను ఆధునికీకరించేం దుకు ఉద్దేశించిన పెంటగాన్ ప్రాజెక్టుకు బిడ్ చేయబోవడం లేదని గూగుల్ తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లు. తమ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ విధానాలకు ఈ కాంట్రాక్టు నిబంధనలు అనుగుణంగా లేవని గూగుల్ పేర్కొంది. -
5 లక్షల గూగుల్ ప్లస్ ఖాతాల డేటా లీక్?
కాలిఫోర్నియా: ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్ ప్లస్‌లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తాజా సమాచారం. గూగుల్ ప్లస్‌లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్ అయ్యుంటుందని తెలుస్తోంది. అలాగే దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్ ప్లస్ కార్పొరేట్ సేవలు మాత్రం కొనసాగుతాయి. గూగుల్ ప్లస్‌లో ఉండిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదనీ, ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని గూగుల్ తెలిపింది. విచారణ సంస్థలకు భయపడి గూగుల్ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
నియామకాలకు ‘సోషల్’ రూట్
ముంబై: సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా కంపెనీలు ఉద్యోగాలివ్వడం పెరుగుతోంది. కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు సరైన అభ్యర్థులను ఫేస్బుక్, లింక్డిన్,ట్విటర్, గూగుల్ ప్లస్ తదితర సామాజిక వెబ్సైట్ల ద్వారానే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ పోకడ ఈ ఏడాది 50 శాతం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సునిల్ గోయల్(గ్లోబల్‌హంట్), ఆల్ఫ్ హారిస్ (మైకేల్ పేజ్). నిశ్చల్ సూరి(కేపీఎంజీ ఇండియా పార్ట్నర్)వంటి నిపుణుల అభిప్రాయాల ప్రకారం..., {పతి నిత్యం బిజీగా ఉంటున్న వ్యక్తులకు పరిశ్రమలో వస్తున్న తాజా మార్పులను తెలుసుకోవడానికి సోషల్ మీడియానే ఏకైక సాధనంగా ఉంటోంది. అంతేకాకుండా వీరంతా తమ తాజా స్టేటస్‌లను ఈ వెబ్సైట్లలోనే అప్డేట్ చేస్తున్నారు. 2010లో ప్రారంభమైన ఈ పోకడ ప్రతీ ఏడాది 50 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా కంపెనీలు తమకు కావలసిన అభ్యర్ధులను తేలికగా పట్టుకోగలుగుతున్నాయి. జాబ్ పోర్టళ్ల ద్వారా, ఉద్యోగ నియామక ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు పొందడం కంటే సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాలు పొందితేనే ఎక్కువ వేతనం డిమాండ్ చేయవచ్చని మధ్య, ఉన్నత స్థాయి మేనేజర్లు భావిస్తున్నారు. ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లోని కంపెనీలు వివిధ స్థాయిల్లోని ఉద్యోగాలను సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, తయారీ, విద్యుత్, ఇంధన, రిటైల్, ఆటోమొబైల్ రంగాల్లోని కంపెనీలు కూడా మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగాలను ఈ వెబ్సైట్ల ద్వారా కూడా భర్తీ చేసుకుంటున్నాయి. సరైన ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులకు, సరైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు సోషల్ వెబ్సైట్లు కీలకంగా మారాయి. నియామక ప్రక్రియలో ఇలాంటి వైబ్సైట్ల పాత్ర ఒక భాగమే. నియామక ప్రక్రియ నుంచి అభ్యర్థి సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో మాత్రం ఈ వెబ్సైట్ల పాత్ర పరిమితంగానే ఉంటోంది. దాదాపు 80 శాతం వరకూ కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సామాజిక మీడియా వెబ్సైట్లను ఉపయోగించుకుంటున్నాయి. ఈ సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాలివ్వడమనేది ఫార్చ్యూన్ 500, అంతర్జాతీయ కంపెనీల్లో అధికంగా ఉంది. -
శాసిస్తున్న సోషల్ మీడియా..!
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజలు సోషల్ మీడియాను ఫాలో అవుతూ చైతన్యవంతులవుతున్నారు. ముఖ్యంగా యువత ‘ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, వాట్స్అప్, యూట్యూబ్’ తదితర సామాజిక మీడియాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు చుట్టూ సమాజంలో జరుగుతున్న అంశాలను తెలుసుకుంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు తమకు తెలిసిన సమాచారాన్ని కూడా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ అంశాలను కొందరు లైక్, షేర్ చేస్తూ సరికొత్త విప్లవానికి బాటలు వేస్తున్నారు. ఢిల్లీలో చోటు చేసుకున్న ‘నిర్భయ’ ఘటన దేశాన్ని కదిలించడానికి కేవలం సోషల్ మీడియానే కారణం. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను యువత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలోకి దిగిన కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సామాజిక మీడియాను ఉపయోగించుకుని అద్భుత ఫలితాలు సాధించింది. అలాగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా యువత మద్దతు కూడగడుతున్నారు. రాష్ట్రంలో కూడా సామాజిక మీడియా రాజకీయాల్లో తన వంతు పాత్ర పోసిస్తోం ది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలో వైఎస్సార్సీపీ సైట్‌ను ఏడు లక్షల మంది యువత సందర్శించడమే. యువనాయకత్వానికి ప్రాధాన్యమిస్తున్న యువత రోజురోజుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. -
సామాజిక మీడియా.. రూ. 500 కోట్లు
పార్టీల ప్రచార వ్యయం అంచనా ఇది న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, యూట్యూబ్... పదికోట్ల మంది యువత... రూ. 500 కోట్లు! ఇవన్నీ ఏమిటంటారా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 160 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలివి! దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు, అభ్యర్థులు కలిపి దాదాపు రూ.5 వేల కోట్ల వరకు ప్రచారం కోసం వ్యయం చేయవచ్చని.. అందులో 500 కోట్ల వరకు కేవలం సామాజిక మీడియాలో ప్రచారం కోస మే వెచ్చిస్తాయని ఇంటర్నెట్ దిగ్గజాల అంచనా. వచ్చే ఎన్నికల్లో 81 కోట్ల మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. అందులో 20 కోట్ల మం ది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. ఇందులోనూ ఈ సారి కొత్తగా ఓటర్లుగా నమోదైన దాదాపు 10 కోట్ల మంది యువత ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్సైట్లలో నిత్యం విహరిస్తూనే ఉంటారు.