పార్టీల ప్రచార వ్యయం అంచనా ఇది
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, యూట్యూబ్... పదికోట్ల మంది యువత... రూ. 500 కోట్లు! ఇవన్నీ ఏమిటంటారా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 160 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలివి! దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు, అభ్యర్థులు కలిపి దాదాపు రూ.5 వేల కోట్ల వరకు ప్రచారం కోసం వ్యయం చేయవచ్చని.. అందులో 500 కోట్ల వరకు కేవలం సామాజిక మీడియాలో ప్రచారం కోస మే వెచ్చిస్తాయని ఇంటర్‌నెట్ దిగ్గజాల అంచనా.
వచ్చే ఎన్నికల్లో 81 కోట్ల మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. అందులో 20 కోట్ల మం ది ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారు. ఇందులోనూ ఈ సారి కొత్తగా ఓటర్లుగా నమోదైన దాదాపు 10 కోట్ల మంది యువత ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో నిత్యం విహరిస్తూనే ఉంటారు.