సిసలైన విజేత.. సోషల్ మీడియా
కొత్త మిలీనియంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో అసలు సిసలు విజేత.. సోషల్ మీడియా. ఓటర్ల వద్దకు సులభంగా వెళ్లడానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్సైట్లను విరివిగా ఉపయోగించుకున్నాయి. 2009 ఎన్నికల నాటికి ట్విట్టర్ అకౌంట్ ఉన్న ఏకైక నాయకుడు శశిథరూర్. అప్పటికి ఆయనకు కేవలం 6వేల మంది ఫాలోయర్లు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు దాదాపు ప్రతి నాయకుడికీ ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలున్నాయి. చేతిలో మొబైల్ ఫోన్, అందులో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండటంతో పాటు.. యువత కూడా సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్న విషయాన్ని రాజకీయ పార్టీలు అందిపుచ్చుకున్నాయి. ఈ రెండింటి ప్రాచుర్యం చూసి సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా గూగుల్ + పేరుతో సోషల్ మీడియాలో ప్రవేశించింది.
* సార్వత్రిక ఎన్నికల ఏడోదశలో ఎన్నికల సంబంధిత ట్వీట్లు ఏకంగా 49 లక్షలను దాటిపోయాయి. 2013 సంవత్సరంలో మొత్తం ట్వీట్ల సంఖ్య కేవలం 2కోట్లే!!
* జనవరి 1 నుంచి మే 12 వరకు 5.6 కోట్ల ఎన్నికల సంబంధిత ట్వీట్లు వచ్చాయి. తొమ్మిదో దశలో దాదాపు ప్రతిరోజూ 54-82 లక్షల ట్వీట్లు వచ్చాయి.
* నరేంద్రమోడీకి ట్విట్టర్లో 38.9 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఆయన ఫేస్బుక్ పేజీకి 14 లక్షల మంది అభిమానులున్నారు.
* భారతదేశంలో 20 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతుండగా వాళ్లలో 10 కోట్ల మందికిపైగా ఫేస్బుక్ వాడకందారులు ఉన్నారు.