సెల్‌ఫోన్ల నుంచి.. పిల్లల్ని కాపాడుకోవడం ఎలా? | Psychologist Dr Vishesh Suggestions On How To Protect Children From Cell Phones | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ల నుంచి.. పిల్లల్ని కాపాడుకోవడం ఎలా?

Published Sun, May 26 2024 7:36 AM | Last Updated on Sun, May 26 2024 7:36 AM

Psychologist Dr Vishesh Suggestions On How To Protect Children From Cell Phones

‘మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్‌ ఫోన్లోనే ఉంటాడండీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు’ ఒక తండ్రి ఆవేదన.
‘మా పాపకు ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి పట్టుకుంది. చదువు పక్కనపెట్టి మరీ రీల్స్‌ చేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు’ ఒక తల్లి ఆక్రోశం.
‘స్కూల్‌కు మొబైల్‌ ఫోన్‌ తీసుకురాకూడదని రూల్‌ ఉన్నా స్టూడెంట్స్‌ పట్టించుకోవడం లేదు. మేం పాఠం చెప్తుంటే వాళ్లు మొబైల్‌లో గేమ్స్‌ ఆడుకుంటూ ఉంటారు’ ఒక టీచర్‌ ఫిర్యాదు.
‘వాళ్లు లైబ్రరీలకు వెళ్లారు, పుస్తకాలు చదివారు. థియేటర్లకు వెళ్లారు, సినిమాలు చూశారు. మేం స్మార్ట్‌ఫోన్‌లో చూసి నేర్చుకుంటున్నాం, ప్రాజెక్టులు చేస్తున్నాం. రీల్స్‌ చేస్తున్నాం, చూస్తున్నాం. తప్పేంటీ?’ ఈ తరం విద్యార్థి ప్రశ్న.

సోషల్‌ మీడియాతోనే చిక్కు..
పిల్లల మీద స్మార్ట్‌ఫోన్‌ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్టులు అధ్యయనాలు జరుపుతున్నారు. న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జోనాథన్‌ హైద్‌ కూడా అందులో ఒకరు. 16 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వకూడదని సోషల్‌ సైకాలజిస్ట్‌ అయిన హైద్‌ బలంగా వాదిస్తున్నారు. 
పిల్లలకు సురక్షితం కాని విధంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయని, వాటి నుంచి కంట్రోల్‌ చేసుకునే శక్తి, అనుభవం పిల్లలకు ఉండదని అమెరికన్‌ సైకాలజికల్‌ అసోసియేషన్‌ ఒక  నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వాటి నుంచి పిల్లలను కాపాడుకోలేకపోతే యువకుల మానసిక ఆరోగ్యానికి హాని కలగవచ్చని హెచ్చరించింది.

సమస్య ఎక్కడ మొదలైంది?
ఒకటి రెండు తరాలకు ముందు.. పాఠశాలంటే తప్పకుండా ఆటస్థలం ఉండేది. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామ తరగతి ఉండేది. కాలక్రమేణా పాఠశాలలు ఇరుకిరుకు భవనాలకు మారాయి. ఆటస్థలాలు దూరమయ్యాయి. ఆ సమయంలోనే స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి, ఆటల స్థానాన్ని ఆక్రమించాయి. పిల్లలు ఆటల్లో కొట్టుకోవడం లేదని, దెబ్బలు తగలడం లేదని, చేతులు విరగడం లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటున్నారని తల్లిదండ్రులు సంతోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్‌ను ఇంటర్నెట్‌ అందుబాటులోకి తెస్తుందనీ, పిల్లలు తెలివైన వారుగా తయారవుతారనీ ఆశపడ్డారు. పిల్లలను వాస్తవ ప్రపంచంలోని ప్రమాదాల నుంచి రక్షించుకున్నామే తప్ప ఆన్‌లైన్‌ ప్రపంచంలోని ప్రమాదాలను పసిగట్టలేకపోయాం. ఫలితంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ వలలో చిక్కుకుపోయారు.

మారకపోతే ప్రమాదమే..
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో అబ్బాయిలు వీడియో గేమ్స్, యూట్యూబ్‌  కోసం ఎక్కువగా వాడుతుంటే, అమ్మాయిలు ఐnట్ట్చజట్చఝ, టn్చpఛిజ్చ్టి లాంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఎక్కువగా వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఎమోష¯Œ ్స గురించి ఎక్కువగా మాట్లాడతారని, పంచుకుంటారని వెల్లడైంది. ఈ పరిస్థితి మారకపోతే యువతలో నిరుత్సాహం, ఆందోళన స్థాయి పెరుగుతుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది డిప్రెషన్‌ లేదా యాంగ్జయిటీతో బాధపడుతున్నారని, 30శాతం మంది ఆత్మహత్మ గురించి ఆలోచిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఏటికి ఆ ఏడు ఇది పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.

ఐదు అంచెల్లో పరిష్కారం..
1. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వకూడదు. అది వారి మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల కదలికలు తెలుసుకోవాలనుకుంటే బేసిక్‌ మొబైల్‌ ఫోన్‌ ఇస్తే సరిపోతుంది.

2. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ పిల్లల కోసం రూపొందించలేదు. అవి పిల్లలకు హానికరం. బాల్యంలోనే వాటికి పరిచయం అయితే తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి పిల్లలను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

3. పిల్లల ధ్యాసను పక్కదారి పట్టించడంలో స్మార్ట్‌ఫోన్‌దే ప్రధాన పాత్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలల్లోకి స్మార్ట్‌ఫోన్‌ను అనుమతించకూడదు. ఫోన్‌ లేకపోతే పాఠాలపై శ్రద్ధ పెడతారు, స్నేహితులతో సమయం గడుపుతారు.

4. స్మార్ట్‌ఫోన్లకు దూరం చేస్తే పిల్లలకు పేరెంట్స్‌పై కోపం పెరుగుతుంది. ప్రాజెక్ట్‌ వర్క్‌ల కోసం విద్యార్థులందరూ డెస్క్‌ టాప్‌ లేదా లాప్‌ టాప్‌లే వాడాలని పాఠశాలలు ఆదేశాలివ్వాలి.

5. పిల్లలను ఫోన్‌ ఆధారిత బాల్యం నుంచి వెనక్కు తీసుకురావాలి. ఆటలు ఆడుకునే బాల్యాన్ని అందించాలి.


– సైకాలజిస్ట్‌ విశేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement