హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఖైదీలనుంచి ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ నుంచి ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఎంఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ పహిల్వాన్ తో పాటు, అండర్ ట్రయల్ ఖైదీ నుంచి కూడా ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
స్వైన్ఫ్లూ నివారణలో భాగంగా హోమియో మందులు పంపిణీచేస్తుండగా వారి వద్ద ఏడు సెల్ఫోన్లు, మూడు ల్యాప్టాప్లు బయటపడినట్టు చర్లపల్లి పోలీసులు పేర్కొన్నారు.
చర్లపల్లి జైల్లో ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు స్వాధీనం
Published Sat, Feb 7 2015 7:37 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Advertisement