Charlapally prison
-
Photo Feature: జైలెళ్లి పోతోంది..
సాక్షి, వరంగల్: ముందు పోలీస్ వాహనం..వెనుకే ఆమె పరుగు.. వాహనంలో నుంచి బేలగా వెనక్కి చూస్తూ ఓ ఖైదీ.. చివరకు కనుమరుగైన వాహనం.. బరువెక్కిన గుండెలతో ఇంటిముఖం పట్టిన మహిళ.. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీలను మంగళవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలిస్తున్నపుడు కనిపించిన భావోద్వేగమిది. దగ్గర్లోనే ఉంటే ములాఖత్‌లో కలుసుకోవడం సులువయ్యేదని.. ఇప్పుడు హైదరాబాద్ ఎలా వెళ్లగలమని ఆమెతో పాటు పలువురు ఖైదీల బంధువులు, భార్యపిల్లలు విలపించారు. -
Warangal: ఖైదీల తరలింపు షురూ
సాక్షి, వరంగల్: ప్రస్తుతం వరంగల్‌లో సెంట్రల్ జైలు స్థలాన్ని రీజినల్ కార్డియాక్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో వైద్యశాఖకు స్థలాన్ని కేటాయించాలన్న ఆదేశాలతో ఖైదీల తరలింపు చేపట్టామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌త్రివేది తెలిపారు. సెంట్రల్‌జైలు నుంచి ఖైదీల తరలింపు మంగళవారం మొదలుకాగా, ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీ మీడియాతో మాట్లాడుతూ వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్యశాఖకు ఇస్తున్నందున కొత్తగా జైలు నిర్మించేందుకు ప్రభుత్వం మామునూరులో స్థలం కేటాయించిందని చెప్పారు. అక్కడ అత్యాధునిక హంగులతో కూడిన నూతన జైలు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. మొత్తం 956 మంది ప్రస్తుతం సెంట్రల్ జైలులో 956 ఖైదీలు ఉండగా, వీరిని హైదరాబాద్‌లోని చర్లపల్లి, చంచల్‌గూడతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించనున్నట్లు డీజీ రాజీవ్త్రిదేవి వెల్లడించారు. తొలివిడతగా మంగళవారం 119 మందిని భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెప్పారు. ఇందులో 80 మంది పురుషులు, 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారని తెలిపారు. మిగతా వారి తరలింపు ప్రక్రియ ఇరవై రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. ఇక వరంగల్ సెంట్రల్ జైలులో విధులు నిర్వర్తిస్తున్న 267 మంది సిబ్బందికి కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. కాగా, జైలు ఆవరణలో ఉన్న పెట్రోల్ పంపులు యథావిధిగా నిర్వహిస్తామని, విచారణలో ఖైదీలను ఎక్కడకు తరలించాలనే విషయమై న్యాయమూర్తుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. కాగా, ఖైదీలను సామగ్రితో తరలించే క్రమంలో కొందరి బంధువులు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. వరంగల్ నుంచి తరలిస్తుండడంపై పలువురు ఖైదీల బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైనా వచ్చి చూసేందుకు అనువుగా లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ హైదరాబాద్, వరంగల్ రేంజ్ డీఐజీలు ఎన్.మురళీబాబు, వై.రాజేష్, జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌రాయ్, డిప్యూ టీ సూపరింటెండెంట్లు డి.భరత్, అమరావతి, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Telangana Formation Day: అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు -
నయీం బావమరిదికి రెండు రోజుల కస్టడీ
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం బావమరిది ఫహీంను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఫహీంను విచారణ నిమిత్తం రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతడిని పోలీసులు మిర్యాలగూడకు తరలించారు. నయీం పేరుతో అతడు మిర్యాలగూడ ప్రాంతంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. -
‘స్నేక్‌గ్యాంగ్’ అకృత్యాలపై నేడు తీర్పు
రంగారెడ్డి జిల్లా కోర్టులు (హైదరాబాద్‌సిటీ): నగరంలో పలు అత్యాచారాలు పాల్పడిన స్నేక్ గ్యాంగ్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తుది తీర్పు ఇవ్వనున్నది. 2014 జులై నెలలో నగర శివారు ప్రాంతంలోని పహాడీషరీప్‌లో పాముతో బెదిరించి ఓ యువతి పై స్నేక్ గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. బాధిత యువతి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు దయాని, ఖాదర్ బరాక్బ, తయ్యబ్ బసలమ, మహమ్మద్ పర్వేజ్, సయద్ అన్వర్, ఖజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రహీం, అలీ బరాక్బ, సలామ్ హాండిలపై కోర్టు అభియోగ పత్రాలను పోలీసుల దాఖలు చేశారు. ఇందులో ఏడుగురు చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. మరో ఇద్దరు బెయిల్‌పై ఉన్నారు. పాములతో బెదిరించి 37 మంది అకృత్యాలకు పాల్పడిన ఈ స్నేక్‌గ్యాంగ్ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనున్నది. -
చర్లపల్లి నుంచి మావోయిస్టు శివనారాయణ విడుదల
హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు శివనారాయణ శనివారం విడుదల అయ్యాడు. గతంలో శివనారాయణపై 14 కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ సిద్దిపేట కోర్టు కొట్టివేసింది. దాంతో శివనారాయణ జైలు నుంచి విడుదల చేసినట్టు జైలు అధికారులు పేర్కొన్నారు. -
చర్లపల్లి జైల్లో ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఖైదీలనుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ నుంచి ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఎంఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ పహిల్వాన్ తో పాటు, అండర్ ట్రయల్ ఖైదీ నుంచి కూడా ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ నివారణలో భాగంగా హోమియో మందులు పంపిణీచేస్తుండగా వారి వద్ద ఏడు సెల్ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు బయటపడినట్టు చర్లపల్లి పోలీసులు పేర్కొన్నారు.