బతుకు మూడు ముక్కలు | Invisible Playing Cards In Medak | Sakshi
Sakshi News home page

బతుకు మూడు ముక్కలు

Published Wed, Jun 5 2019 11:01 AM | Last Updated on Wed, Jun 5 2019 11:01 AM

Invisible Playing Cards In Medak - Sakshi

సదాశివపేట(సంగారెడ్డి): కాయ్‌రాజా కాయ్‌ కాస్తేవుంది చూస్తే లేదు, ముడు ముక్కలాట... మూడాసులు తిప్పు, ఒకటికి మూడు రెట్లు.. స్వర్గానికి లే మెట్లు క్షణంలో సగంలో నువ్వు కుబేరుడివి. కనురేప్పపాటులో కుచేలుడివి.. అమాంతం కురిసిన రాత్రి కవితా సంపుటిలో బాల గంగాధర్‌ తిలక్‌ జూదం గురించి రాసిన ఓ కవిత, సదాశివపేట పట్టణ మండల పరిధిలో అచ్చు అలాగే ఉంది మరి, ముక్క కలిస్తే అదష్టం తమదేనని ఆశపడుతున్నారు. కానీ అది తిరగబడి చాలా మంది కుచేలులుగా మారుతున్నారు. అప్పుల పాలై వాటిని తీర్చే దారిలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయదారులు, ప్రజాప్రతినిధులు, పరిశ్రమల్లో పరిచేస్తున్న కార్మికులు, వ్యాపారులు, దినసరి కూలీలు పేకాట మత్తులో మునిగిపోయారు.

రాములు (పేరు మార్చాం) రోజువారీ కూలీ రెండు రోజులు పనికెళ్తే ఓ ఆరువందల రూపాయలు సంపాదిస్తాడు. కానీ అలా వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలను తీర్చకుండా మూడు ముక్కలాట(పేకాట) ఆడతాడు. సంపాదించిన సోమ్ము ఇలా తగలబెట్టడం.. తిరిగి తెలిసిన వారి వద్ద అప్పులు చేయడమే అతని నిత్యకత్యం అయింది. రోజులు గడుస్తున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి. స్థోమతకు మించి చేసిన అప్పులు తీర్చలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్టుకున్న భార్య పిల్లలు ఇప్పుడు దిక్కులేని వారిగా మిగిలారు. ఇలా సదాశివపేట ప్రాంతంలో పేకాట కారణంగా ముక్కలవుతున్న కుటుంబాల ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈ జూదానికి అడ్డుపడడం లేదు. సదాశివపేట ప్రాంతంలో పేకాట సంస్కృతి జడలు విప్పింది. ఎక్కడపడితే అక్కడ ఇళ్లు, ఫంక్షన్‌హాళ్లు, బహిరంగ ప్రదేశాలు, వాటర్‌ ప్లాంట్లులో నిత్యం పేకాట కొనసాగుతుంది, పోలీసులకు మాత్రం తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

జూదమే ధ్యాస..
నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు యువకులు జూదానికి బానిసవుతున్నారు. పనికేళ్లి కష్టపడి సంపాదించినదంతా ఈ పేకాటలో పోగొట్టుకోవడం వీరికి అలవాటైంది. మద్యం మత్తు ఆపై పేకాట ఆడటం ఇదే ఈ  ప్రాంతంలో కొందరి వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు, యువకుల జీవనశైలిగా మారింది. ముఖ్యంగా సదాశివపేట పట్టణ మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్, వివిధ పార్టీ కార్యాలయాలు, వాటర్‌ప్లాంట్లు, ఫంక్షన్‌ హాళ్లు, ఇళ్లు కేంద్రాలుగా మారాయి. జూదానికి బానిసైన వారు అన్న నీళ్లు మరచి మరీ గంటల తరబడి పేకాటలో నిమగ్నమౌతూ కుటుంబాలను పట్టించుకోని పరిస్థితి. ఇంతేకాదు పేకాటలో డబ్బుల విషయమై ఘర్షణలు తలెత్తడం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇక్కడ పారిపాటిగా మారింది.

నడిబొడ్డు నుంచి నట్టింటి వరకు..
సదాశివపేట పట్టణంలోని నడిబోడ్డు నుంచి నట్టింటి వరకు ఈ పేకాట సంస్కృతి విస్తరించుకుపోతుంది. సదాశివపేట పట్టణంలోని వివిధ పార్టీ కార్యాలయాలు, ఫంక్షన్‌ హాళ్లు, ఇళ్లలలో కొందరు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పేకాట అడడం విశేషం, సదాశివపేట పట్టణ మండల పరిధిలోని పార్టీ కార్యాలచయాలు, వ్యవసాయా మార్కెట్, ఫంక్షన్‌ హళ్లు, ఫాంహౌజ్‌లు, వాటర్‌ప్లాంటుతో పాటు వెల్టూర్‌ గ్రామానికి వేళ్లు మార్గంలోగల పాంహౌజ్‌లు, దర్గాల సమీపంతో పాటు, నివాస గృహాలు, వ్యవసాయ పంటపోలాల్లోని చెట్లకింద, ఫంక్షన్‌ హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో చాలా ప్రాంతాల్లో నిత్యం పేకాట జోరుగా సాగుతుంది.

మొక్కుబడిగా దాడులు..
జూదం అడ్డాలు పట్టణ, మండల పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయో పోలీసులకు తెలుసు అందువల్లనే పత్రికల్లో వచ్చిన మరుసటి రోజు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్న ఎవరిని పట్టుకోలేక పోతున్నారు. ‘‘దాడుల సమయంలో గతంలో మండల పరిధిలోని సిద్ధాపూర్‌ గ్రామంలో పట్టుబడిన జూదరులు పోలీసులకు ఎదురుతిరగడంతో పాటు మీ డీఎస్పీతో మాట్లాడాలా, మీ సీఐతో మాట్లాడాలా అసలు మీకు ఎవరు ఫిర్యాదు చేశారు వారి పేరు చెప్పండి అంటూ ఎదురు తిరగడంతో పోలీసులు వెనుదిరిగి వచ్చాని సంఘటనలు ఉన్నాయి’’. అందువల్ల అధికార పార్టీనేతలు బెదిరింపులు చేయడం వల్ల పోలీసు సిబ్బంది పేకాట విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. దాడులు చేయాగానే ప్రజాప్రతినిధుల ఫోన్లు రావడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

లక్షలు పోగొట్టుకున్నారు..
సదాశివపేట పట్టణంలోని సబ్‌స్టేషన్‌ ఎదురుగా గల గల్లిలోని ఓ ఇంట్లో గత రెండు నెలల పాటు ఓ టీఆర్‌ఎస్‌ నాయకుని అండదండలతో పాటు కొనసాగిన పేకాటలో పట్టణానికి చేందిన దాదాపు 20 మంది 1లక్ష నుంచి 15 లక్షల వరకు పేకాటాలో పోగొట్టుకున్నట్లు సమాచారం. అక్కడ ప్రతీ రోజు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు నిత్యం పేకాట కొనసాగినట్లు తెలుస్తుంది. ఉదయ నుంచి రాత్రి వరకు మద్యం, మాంసం వంటకాలు చేయించి వడ్డించినట్లు సమాచారం.

ళ్లెం వేయరు.. కన్నీరు తుడవరు
పేకాట ఆడుతున్న వ్యక్తులు మద్యం తాగడంతోపాటు దాడులు చేసుకుంటుండంతో సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు పడుతున్న వేదన వర్ణనాతీతం తమ కుటుంబాలకు చేందినవారే కళ్లేదుట పేకాట ఆడుతుండటం ఇదేమని ప్రశ్నిస్తేంటే ఆటలో ఉన్న వ్యక్తులు బెదిరిస్తున్నారని కన్నీళ్ల పర్యవంతమౌతున్నారు. కొన్ని ఇళ్లల్లో అర్ధరాత్రి వరకు  నిత్యం పేకాట అడూండ అదుపూ లేకుండా పోతుందని ప్రజలు మండిపడుతున్నారు. పేకాటకు అడ్డుకట్ట వేసి కుటుంబాలు ఛిద్రం కాకుండా చూడాలని ప్రజలు కొరుతున్నారు.

పేకాట ఆడితే కఠిన చర్యలు..
పట్టణ మండల పరిధిలో పేకాట ఆడితే చట్టపరంగా కేసులు నమోదు చేసి చట్టపరంగ చర్యలు తీసుకుంటాం. పేకాట అడితే ఎంతటి వారినైన వదలబోమని రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులైన సరై వదిలివేసే ప్రసక్తి ఉండదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పేకాట ఆడుతున్న స్థావరాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందని అదును చూసి దాడిచేసి అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పేకాట ఆడుతున్న వారి గురించి ప్రజలేవరైన సమాచార మిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. – సీఐ సురేందర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement