
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి పాలనలో టీడీపీ కార్యకర్త దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో ఆమెను బెదిరించి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. పలాస మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు దారుణానికి పాల్పడ్డాడు. తమ ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఓ దివ్యాంగురాలి(20)పై కన్నేసిన భాస్కరరావు ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉండగా.. పెదంచలలో తన నానమ్మతో కలిసి ఉంటోంది ఆమె.
ఇక, తన మనుమరాలికి న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యులు భాస్కరరావు వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో, పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు.. కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలి నానమ్మ మాట్లాడుతూ..‘అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకువెళ్లగా నా మనవరాలు గర్భవతి అని తెలిసింది. వరిశి భాస్కరరావు నా మనవరాల్ని గర్భవతిని చేశాడు. మాకు అన్యాయం జరిగింది.. న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment