రూ.75.25 లక్షల దొంగనోట్ల స్వాధీనం
ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి మండలాల వారే నిందితులు
మెళియాపుట్టి: దొంగనోట్లు ముద్రించి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. టెక్కలి డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి వివరాలను శుక్రవారం స్థానిక స్టేషన్ వద్ద వెల్లడించారు. తక్కువ సొమ్ముకు అధిక మొత్తంలో దొంగనోట్లు ఇస్తామని ఆశ చూపించే ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. పలాస మండలం నర్సింపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి, పెదంచల గ్రామానికి చెందిన కుసిరెడ్డి దూర్వాసులు, మెళాయపుట్టి మండలం సంతలక్ష్మీపురానికి చెందిన తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, కరజాడ గ్రామానికి చెందిన దాసరి రవికుమార్, వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన దుమ్ము ధర్మారావులను అరెస్టు చేశామని, వీరి వద్ద నుంచి కెనాన్ కలర్ ప్రింటింగ్ మిషన్, కలర్ ఇంక్ బాటిల్స్, బ్లేడ్, గమ్ బాటిల్, పేపర్ కట్టలు, రూ.57.25 లక్షలు విలువైన దొంగనోట్లు, 4 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం (స్కూటీ) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఎలా పట్టుకున్నారంటే..?
కేసులో ఎ1 గా ఉన్న తమ్మిరెడ్డి రవి అనే వ్యక్తి గురువారం మెళియాపుట్టి మండలం పట్టుపురం కూడలిలో కొంతమేర దొంగనోట్లు పట్టుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ రమేష్ బాబు సిబ్బందితో వెళ్లి అతడిని పట్టుకుని దొంగ నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. అతడిని స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా మిగిలిన వారి పేర్లు చెప్పాడు. దీంతో వారందరినీ అరెస్టు చేశారు. వారి వద్దనున్న మొత్తం నకిలీ నోట్లు అయిన రూ.27.25 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు.
నేరం చేయడంలో వీరి స్టైలే వేరు
వీరంతా ఒక్కో ప్రాంతాలకు చెందిన వ్యక్తులు. ఒడిశాలో ఎక్కడి నుంచో కొన్ని దొంగనోట్లు సంపాదించి, నకిలీనోట్లు తయారు చేసే విధానాన్ని యూట్యూబ్‌లో చూసేవారు. సంతలక్ష్మీ పురం గ్రామంలోని అందరూ నివాసముండే ప్రదేశంలోనే ఇళ్ల మధ్య ఒక ఇంటిని ఎంచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రింటర్, ఇతర సామగ్రి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక వ్యాపారం మొదలెట్టే ప్రక్రియలో భాగంగా రూ.5లక్షలు ఇస్తే రూ.25 లక్షల నకిలీ నోట్లు ఇవ్వడానికి ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని నోట్ల తయారీ ప్రారంభించారు. అందులో భాగంగానే మచ్చుకు కొన్ని నోట్లు చూపించే క్రమంలోనే పట్టుబడ్డారు.
ఇద్దరు పాత నేరస్తులే..
నేరానికి పాల్పడిన వారిలో ఎ2 గా ఉన్న కుసిరెడ్డి దూర్వాసులుపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మర్డర్ కేసు, ఎ6 దుమ్ము ధర్మారావు పై పలాస, మందస పోలీస్ స్టేషన్లలో పలు మార్లు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. మరికొందరిపై ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయి. అయితే నకిలీ నోట్ల కేసు లో మరికొందరు ముద్దాయిలను పట్టుకోవాల్సి ఉందని, వారిని త్వరలోనే పట్టుకుని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. స్వా«దీనం చేసుకున్న నకి లీ నోట్లలో 500,200 నోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దొంగ నోట్లు చేతులు మారలేదని, దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు. ముద్దాయిలను టెక్కలి కోర్టులో హాజరుపరిచారు. పాతపట్న ం సీఐ రామారావు, మెళియాపుట్టి ఎస్సై రమేష్ బా బు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment