counterfeit notes
-
దొంగనోట్ల ముఠా ఆటకట్టు
మెళియాపుట్టి: దొంగనోట్లు ముద్రించి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. టెక్కలి డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి వివరాలను శుక్రవారం స్థానిక స్టేషన్ వద్ద వెల్లడించారు. తక్కువ సొమ్ముకు అధిక మొత్తంలో దొంగనోట్లు ఇస్తామని ఆశ చూపించే ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. పలాస మండలం నర్సింపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి, పెదంచల గ్రామానికి చెందిన కుసిరెడ్డి దూర్వాసులు, మెళాయపుట్టి మండలం సంతలక్ష్మీపురానికి చెందిన తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, కరజాడ గ్రామానికి చెందిన దాసరి రవికుమార్, వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన దుమ్ము ధర్మారావులను అరెస్టు చేశామని, వీరి వద్ద నుంచి కెనాన్ కలర్ ప్రింటింగ్ మిషన్, కలర్ ఇంక్ బాటిల్స్, బ్లేడ్, గమ్ బాటిల్, పేపర్ కట్టలు, రూ.57.25 లక్షలు విలువైన దొంగనోట్లు, 4 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం (స్కూటీ) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎలా పట్టుకున్నారంటే..? కేసులో ఎ1 గా ఉన్న తమ్మిరెడ్డి రవి అనే వ్యక్తి గురువారం మెళియాపుట్టి మండలం పట్టుపురం కూడలిలో కొంతమేర దొంగనోట్లు పట్టుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ రమేష్ బాబు సిబ్బందితో వెళ్లి అతడిని పట్టుకుని దొంగ నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. అతడిని స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా మిగిలిన వారి పేర్లు చెప్పాడు. దీంతో వారందరినీ అరెస్టు చేశారు. వారి వద్దనున్న మొత్తం నకిలీ నోట్లు అయిన రూ.27.25 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. నేరం చేయడంలో వీరి స్టైలే వేరు వీరంతా ఒక్కో ప్రాంతాలకు చెందిన వ్యక్తులు. ఒడిశాలో ఎక్కడి నుంచో కొన్ని దొంగనోట్లు సంపాదించి, నకిలీనోట్లు తయారు చేసే విధానాన్ని యూట్యూబ్‌లో చూసేవారు. సంతలక్ష్మీ పురం గ్రామంలోని అందరూ నివాసముండే ప్రదేశంలోనే ఇళ్ల మధ్య ఒక ఇంటిని ఎంచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రింటర్, ఇతర సామగ్రి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక వ్యాపారం మొదలెట్టే ప్రక్రియలో భాగంగా రూ.5లక్షలు ఇస్తే రూ.25 లక్షల నకిలీ నోట్లు ఇవ్వడానికి ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని నోట్ల తయారీ ప్రారంభించారు. అందులో భాగంగానే మచ్చుకు కొన్ని నోట్లు చూపించే క్రమంలోనే పట్టుబడ్డారు. ఇద్దరు పాత నేరస్తులే.. నేరానికి పాల్పడిన వారిలో ఎ2 గా ఉన్న కుసిరెడ్డి దూర్వాసులుపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, ఎ6 దుమ్ము ధర్మారావు పై పలాస, మందస పోలీస్ స్టేషన్లలో పలు మార్లు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. మరికొందరిపై ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయి. అయితే నకిలీ నోట్ల కేసు లో మరికొందరు ముద్దాయిలను పట్టుకోవాల్సి ఉందని, వారిని త్వరలోనే పట్టుకుని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. స్వా«దీనం చేసుకున్న నకి లీ నోట్లలో 500,200 నోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దొంగ నోట్లు చేతులు మారలేదని, దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు. ముద్దాయిలను టెక్కలి కోర్టులో హాజరుపరిచారు. పాతపట్న ం సీఐ రామారావు, మెళియాపుట్టి ఎస్సై రమేష్ బా బు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
రండి.. దేవుడిచ్చిన డబ్బులు తీసుకువెళ్లండి
ఏలూరు టౌన్: తమకు దేవుడు డబ్బులు ఇస్తాడని, వాటితో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తామని నమ్మించి కొంత మొత్తం అసలు నోట్లు తీసుకుని పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఏఎస్పీ జి.స్వరూపరాణితో కలిసి ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిషోర్ వివరాలు వెల్లడించారు. ఏలూరులో 108 అంబులెన్స్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న దొండపాటి ఫణికుమార్‌కు జూలై 28న ఒక వ్యక్తి ఫోన్ చేసి తాము కష్టాల్లో ఉన్నవారికి ఆరి్థక సాయం చేస్తామని పరిచయం చేసుకున్నాడు. తమకు దేవుడు డబ్బులు పంపిస్తాడని, అలా పంపిన వాటిలో రూ.44లక్షలు ఉన్నాయని, ఈ మొత్తం కావాలంటే రూ.10లక్షలు ఇవ్వాలని చెప్పాడు. ఇలా కొంత డబ్బు తీసుకుని నాలుగు రెట్లు ఎక్కువగా ఇవ్వడాన్ని తమ పరిభాషలో బ్యారిస్ అని అంటారని వివరించాడు. ఈ డబ్బులు ఎక్కువ రోజులు తమ వద్ద ఉండవని, ఆలస్యం చేస్తే మాయమైపోతాయని తెలిపాడు. వెంటనే డబ్బులు తీసుకుని బ్యాంకులో వేసుకోవాలని సూచించాడు. అయితే తన వద్ద అంత డబ్బులు లేవని ఫణికుమార్ చెప్పగా, కొంత అడ్వాన్స్‌గా ఇవ్వాలని, అనంతరం మిగిలిన సొమ్ము తీసుకురావాలని సూచించాడు. రూ.44లక్షలు వస్తాయనే ఆశతో ఫణికుమార్ జూలై 30వ తేదీన ఫోన్ చేసిన వ్యక్తిని, మరికొందరిని కలిసి రూ.3 లక్షలు ఇచ్చాడు.మిగిలిన డబ్బులు కూడా సిద్ధం చేసుకోవాలని ఆ ముఠా సభ్యులు చెప్పారు. ఈ విషయాన్ని ఫణికుమార్ తన స్నేహితుల వద్ద ప్రస్తావించగా, వారు మోసం చేస్తున్నారని వివరించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఫణికుమార్ శనివారం ఆ ముఠాకు ఫోన్ చేసి మిగిలిన డబ్బులు తీసుకువస్తున్నానని, ఏలూరు కొత్త బస్టాండ్ వెనుక రైల్వే ట్రాక్ రోడ్డు వద్దకు రావాలని కోరాడు. అదేవిధంగా ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేయడంతో సీఐ కే.శ్రీనివాసరావు తన సిబ్బందితో వెళ్లి నిఘా పెట్టారు. అక్కడికి వచ్చిన నకిలీ కరెన్సీ ముఠా సభ్యుడు చింతలపూడి మల్లాయిగూడెం ప్రాంతానికి చెందిన మారుమూడి మధుసూదనరావు, కారు డ్రైవర్ గప్పలవారిగూడేనికి చెందిన బిరెల్లి రాంబాబును అరెస్ట్ చేశారు. వారి నుంచి 94 కట్టల నకిలీ 500 నోట్లు రూ.47లక్షలు, ఒక సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. వీరిద్దరూ నకిలీ కరెన్సీ ముఠా వద్ద ఉంటూ మార్కెట్లో నకిలీ నోట్లు మారి్పడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
మాదాపూర్‌లో నడిరోడ్డుపై నోట్లకట్టలు.. ట్రాఫిక్ జామ్.. తీరా చూస్తే..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో నకిలీ 2000 నోట్ల కలకలం సృష్టించాయి. 100 ఫీట్ రోడ్‌కు సమీపంలోని కాకతీయ రోడ్డులో గుట్టలుగుట్టలుగా 2000 నోట్లు ఉండడంతో స్థానికులు, వాహనాదారులు నోట్ల కోసం ఎగబడ్డారు. ఎవరికి అందిన కాడికి వారు తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొంతసేపు ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. తీరా ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండడంతో వాటిని తీసుకున్న వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. చదవండి: ('పుంజు'కున్న ధరలు.. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ) -
రూ.3 లక్షలకు.. రూ.12 లక్షల నకిలీ నోట్లు
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణీ కలకలం రేపింది. సీతమ్మధారకు చెందిన ఓ వ్యక్తి ఒడిశా నుంచి నకిలీ నోట్లు తీసుకొస్తున్నట్టు ఎంవీపీ కాలనీ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. ఎంవీపీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు గురువారం రాత్రి రాజాన విష్ణు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్దనున్న నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా సీతమ్మధారకు చెందిన యాగంటి ఈశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఈ నకిలీ నోట్లు పొందినట్లు వెల్లడించాడు. ఈశ్వరరావుకు రూ.3 లక్షల నగదు ఇవ్వగా, అతను ఒడిశా తీసుకెళ్లి రూ.12 లక్షల విలువచేసే నకిలీ నోట్లు ఇప్పించినట్లు వెల్లడించారు. ఇందులో రూ.4.77 లక్షల నకిలీ నోట్లు ఇప్పటికే మార్చినట్లు చెప్పాడు. విష్ణు ఇచ్చిన సమాచారంతో ఈశ్వరరావును కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ మూర్తి తెలిపారు. ఈ నోట్లలో రూ.100, రూ.200, రూ.500 నోట్లు ఉన్నాయని, నిందితులు ఇద్దర్నీ శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు. ఒడిశా కేంద్రంగా నడుస్తున్న నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసినట్టు ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణయ్య, ఎస్ఐ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ నోట్లతో జాగ్రత్తగా ఉండాలి
మెదక్ మున్సిపాలిటీ : నకిలీ నోట్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మెదక్ పట్టణంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హన్మకొండ వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట గ్రామానికి చెందిన మహ్మద్ షఫీ, అబ్దుల్ మజీద్లు వరుసకు బావ బావమరుదులు. కాగా మహ్మద్ షఫీ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మజీద్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 16న రాత్రి 8గంటల ప్రాంతంలో మెదక్ పట్టణంలోని పెద్ద బజార్‌లోని జనతా చికెన్ సెంటర్లో, పెద్దబజార్ మజీద్ వద్ద గల ఓ కిరాణషాపులో సరుకులు కొనుగోలు చేసి నకిలీ రూ.2000 నోట్లు ఇచ్చి వెళ్లారు. కొద్ది సేపటి తరువాత కిరాణాషాపు యజమాని కొండ రమేష్ రూ.2000 నోటు నకిలీగా గుర్తించి అతని తమ్ముడితో కలిసి రాందాస్ చౌరస్తాలో నిందితుల కారు గమనించి వారిని వెంబడించి పోలీస్‌స్టేషన్ సమీపంలో వారిని రమేష్ అడ్డగించి నిలదీయడంతో నిందితులు రమేష్‌ను తోసేసి కారును స్పీడుగా తీసుకెళ్లారు. దీంతో రమేష్ తమ్ముడు అతని స్నేహితులు కారును వెంబడించి హౌసింగ్ బోర్డు వద్ద నిందితులను పట్టుకొని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బాధితుడు కొండా రమేష్ ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. అలాగే నిందితుల నుంచి రూ.2000 నకిలీ నోట్లు7, రూ.500 నోట్లు 8తోపాటు నోట్ల తయారీకి ఉపయోగించిన స్కానర్, ప్రింటర్, పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు నకిలీనోట్ల చలామణితో చిక్కకుండా వెంట తెచ్చుకున్న కారుకు సైతం రెండు నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నకిలీ నోట్లను గుర్తించిన పట్టణ వాసులను ఎస్పీ అభినందించారు. ఈ కేసు చేధించడంలో పురోగతి సాధించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ శ్రీరాం విజయ్‌కుమార్, పట్టణ ఎస్ఐ శేఖర్‌రెడ్డి, మెదక్రూరల్ఎస్ఐ లింబాద్రి, హవేళిఘణాపూర్ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగరాజు ఉన్నారు. -
ఫేక్ కరెన్సీ ఫ్రం వెస్ట్ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకువచ్చి హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతరాష్ట్ర ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు బెంగాలీలతో సహా ముగ్గురిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.11.95 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్, చార్మినార్ ఇన్స్పెక్టర్లు ఎ.యాదగరి, కె.చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి పాతబస్తీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్వాపరాలు వెల్లడించారు. గౌస్ దందానే నకిలీ కరెన్సీ... చంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ అనే పండ్ల వ్యాపారి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం కొన్నేళ్ళుగా నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేక మంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చెలామణి చేసేవాడు. అలా వచ్చిన మొత్తం నుంచి ఏజెంట్ల వాటాను వారికి పంపేవాడు. ఈ తరహాలో దందా చేస్తూ ఇప్పటికే మోండా మార్కెట్, గోపాలపురం, కంచన్‌బాగ్, గోపాలపురం, శాలిబండ, కాలాపత్తర్, భవానీనగర్, చంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, ఫలక్‌నుమ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. కుటుంబీకులతో కలిసే మార్పిడి... జైలుకు వెళ్ళి బెయిల్‌పై వచ్చిన ప్రతిసారీ పోలీసు నిఘా నుంచి తప్పించుకోవడానికి తన చిరునామా మార్చేసే గౌస్ ప్రస్తుతం బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. అనేక సందర్భాల్లో తన కుటుంబీకులతోనూ కలిసి నకిలీ కరెన్సీ మార్పిడి చేసే ఇతగాడికి ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కాలియా చౌక్ ప్రాంతానికి చెందిన బబ్లూ షేక్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం నడుస్తున్న గణేష్ ఉత్సవాలు, త్వరలో రానున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపారం జోరుగా ఉంటుందని, దీంతో నకిలీ కరెన్సీ తేలిగ్గా మార్చేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. బబ్లూను సంప్రదించిన గౌస్ రూ.12 లక్షల నకిలీ కరెన్సీ పంపాలని, మార్పిడి తర్వాత రూ.6 లక్షల అసలు కరెన్సీ పంపిస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బంధువులకు ఇచ్చి పంపిన బబ్లూ... దీనికి అంగీకరించిన బబ్లూ రూ.1000, రూ.500 డినామినేషన్లో ఉన్న రూ.12 లక్షల నకిలీ కరెన్సీని గౌస్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లి జహనారా బీబీ, బావమరిది షరీఫుల్ షేక్‌కు ఈ మొత్తాన్ని ఇచ్చిన బబ్లూ వారిని రైలులో హైదరాబాద్‌కు పంపాడు. వీరిద్దరికీ గౌస్ ఫోన్ నెంబర్ ఇచ్చి నగరానికి చేరుకున్నాక సంప్రదించి నగదు అందించమని చెప్పాడు. దీంతో ఇరువురూ శుక్రవారం సిటీకి చేరుకుని గౌస్‌ను సంప్రదించారు. అతడు చెప్పిన ప్రకారం చార్మినార్ ప్రాంతంలో నకిలీ కరెన్సీ అందించడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, బి.మధుసూదన్, జి.మల్లేష్ తమ బందాలతో వలపన్ని ముగ్గురినీ అరెస్టు చేశారు. ప్రయాణం నేపథ్యంలో జహనారా బీబీ, షరీఫుల్లు రూ.5 వేలు ఖర్చు చేయగా... మిగిలిన రూ.11.95 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చార్మినార్ పోలీసులకు అప్పగించారు. -
వెయ్యి రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం
కోల్‌కతా నుంచి వెయ్యి రూపాయల నకిలీ నోట్లు తెస్తున్న ఓ వ్యక్తిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాలివీ.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారంతండాకు చెందిన కరంటోతు కిషన్(48), రేగోడ్ మండలం జంగంలంకతండాకు చెందిన శంకర్‌నాయక్ స్నేహితులు. ఈ క్రమంలో శంకర్‌నాయక్ వారం కిత్రం కిషన్‌కు రూ.50 నగదు ఇచ్చి కోల్‌కతా సమీపంలోని హౌరాలో ఉన్న గౌసుద్దీన్ అనే వ్యక్తి వద్దకు పంపిచాండు. అతడు వెళ్లి గౌసుద్దీన్‌కు ఆ నగదు ఇవ్వగా...అతడు ఇచ్చిన నకిలీ వెయ్యిరూపాయల నోట్లు రూ.1.10 లక్షలు తీసుకుని శనివారం దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో దిగాడు. విశ్వనీయ సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్‌లో కిషన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతని వద్ద నుంచి లక్షా పదివేల నకిలీ వెయ్యి రూపాయల నోట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కిషన్ గతంలో రూ.3 లక్షల నకిలీ వెయ్యి నోట్లు హౌరా నుంచి తెచ్చినట్లు విచారణలో తేలింది. శంకర్‌నాయక్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
నకిలీ నోట్ల కేసులో ఇద్దరి అరెస్ట్
స్కానర్, నకిలీ నోట్లు స్వాధీనం కేకే.నగర్: తిరునెల్వేలి మేల్పాళయంలో నకిలీ నోట్లను ముద్రించి చ లామణికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారి నుంచి స్కానర్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరునెల్వేలి మేలపాళయం, కొత్త బస్టాండు ప్రాంతంలో సోమవారం పోలీసులు గస్తీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో అనుమానాస్పద రీతిలో నిలబడి ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. వారి వద్ద గల బ్యాగును పోలీసులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆ బ్యాగులో వంద రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకుని తిరునెల్వేలి నగర నేర విభాగ పోలీసు సహాయ కమిషనర్ మారిముత్తు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తరువాత వారిద్దరి వద్ద పోలీసులు విచారణ జరిపారు. విచారణలో వారు మేల్పాళయం ఆమ్ పురం 5వ వీధికి చెందిన కాశిమే బషీర్ కుమారుడు తమిమ్ అన్సారి (34) పేటై టీచర్స్ కాలనీకి చెందిన రహమతుల్లా (31) అని తెలిసింది. ఈ ఇద్దరూ మేలపాళయంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ నకిలీ నోట్లు ముద్రించి వాటిని చలామణి చేయడానికి వెళుతున్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. దీంతో పోలీసులు మేలపాళయం ఫాతిమానగర్‌కు వారిని పిలుచుకుని వెళ్లి వాళ్లు అద్దెకు తీసుకున్న ఇంట్లో సోదా చేశారు. ఆ ఇంట్లో రూ.500ల విలువైన 300ల నోట్ల కట్టలు కనిపించాయి. ఇంకనూ నకిలీనోట్ల తయారీకి ఉపయోగించిన స్కాన్, ప్రింటర్ మిషన్, పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్సారి, రహమతుల్లాలను అరెస్టు చేసిన పోలీసులు వారివద్ద గల రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నెల్లై నగర పోలీసు కమిషనర్ తిరుజ్ఞానం మాట్లాడుతూ నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తమకు అందిన రహస్య సమాచారం మేరకు పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి లక్షా 50వేల రూపాయలు విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా స్కాన్, ప్రింటర్, పేపర్లను రెండు మోటారు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
‘ఆసరా’లో నకిలీ నోట్ల కలకలం!
హయత్‌నగర్: ఆసరా పథకంలో పంచిన నోట్లు నకిలీవని ప్రచారం జరగడంతో తారామతిపేటలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే... తారామతిపేట గ్రామంలో ఈ నెల 12వ తేదీ నుంచి ఆసరా పథకంలో భాగంగా పింఛన్ డబ్బులుపంపిణీ చేశారు. గ్రామ కార్యదర్శి నర్సింగ్‌రావు హయత్‌నగర్‌లోని ఎస్బీహెచ్ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు డ్రా చేసి బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాలలో పంచేందుకు కొంత డబ్బును బిల్ కలెక్టర్‌కు అప్పగించాడు. కొంత డబ్బును తారామతిపేటలో పంచారు. సుమారు రూ.5 లక్షల మేర పంపకాలు పూర్తయ్యాయి. కొంతమంది లబ్ధిదారులు ఖర్చు చేసేందుకు దుకాణదారుల వద్దకు వెళ్లగా అవి చెల్లవంటూ తీసుకోలేదు. దీంతో తమకు ఇచ్చినవి నకిలీ నోట్లు అని గ్రామస్తులు వాపోయారు. ఇది కాస్తా గ్రామంలో ప్రచారం జరగడంతో ఆదివారం పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారు కూడా తమకు వద్దు అంటూ తిరిగి వెళ్లిపోయారు. నకిలీ నోట్లు కావు: కార్యదర్శి ఆసరా పథకంలో భాగంగా గ్రామంలో పంపిణీ చేసిన నగదు నకిలీనోట్లు కావని, 2004 కంటే ముందు ముద్రించిన నోట్లు కావడంతో వాటిని ఎలక్ట్రానిక్ మిషన్ గుర్తించడం లేదని గ్రామ కార్యదర్శి నర్సింగ్‌రావు తెలిపారు. నోట్లను బ్యాంకు నుంచి ఎలా తీసుకొచ్చామో అలాగే పంచామని చెల్లుబాటు కాని నోట్లను తిరిగి ఇచ్చేస్తే బ్యాంక్‌కు ఇచ్చి మార్చి ఇస్తామని ఆయన వెల్లడించారు. -
పింఛన్‌దారుని చేతికి నకిలీనోటు !
నాగిరెడ్డిపేట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’పథకం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న డబ్బులలో నకిలీ నోట్లు దర్శనమిస్తున్నట్లు తెలిసింది. మండలంలోని లింగంపల్లికలాన్ గ్రామంలో శుక్రవారం లబ్ధిదారులకు అధికారులు పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారుడు పింఛన్ డబ్బులను తీసుకొని, మండలకేంద్రానికి చేరుకొని వెయ్యిరూపాయల నోటును విడిపించే ప్రయత్నం చేయగా అది నకిలీదని తెలినట్లు సమాచారం. దీంతో సదరు బాధితుడు తనకు ఇచ్చిన పింఛన్‌డబ్బులలో నకిలీనోటు రావడంతో ఒక్కసారిగా అవాక్కయాడు. వెంటనే గ్రామానికి చేరుకొని అధికారులకు తిరిగి ఇచ్చేదామనుకునేలోపే వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో ఎవరికి చెప్పుకోలేక గుట్టుచప్పుడుకాకుండా సదరు వెయ్యి రూపాయల నకిలీనోటును చెల్లించుకున్నట్లు సమాచారం. స్వయంగా అధికారులు పంపిణీ చేస్తున్న పింఛన్ డబ్బులలో నకిలీనోటు ప్రత్యక్ష ం కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
నకిలీని కనిపెట్టండిలా..!
ఘట్కేసర్: ఇటీవల నకిలీ నోట్ల చెలామణి విస్తృతమైంది. ముఖ్యంగా వెయ్యి రూపాయల నోట్లను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు. ఆ నోటు అసలుదా లేక నకిలీదా అన్న విషయం తేల్చలేక ఆందోళన చెందుతున్నారు. అయితే మన చేతిలో ఉంది.. నకిలీ నోటా లేక అసలుదా అని కనిపెట్టడానికి ఉపయోగపడే కొన్ని గుర్తులపై కథనం.. ఎడమ వైపున మధ్యలో 1000 సంఖ్యలో ప్రతి అక్షరం సగం కనిపించి సగం కనిపించకుండా ఉంటుంది. వెలుతురులో చూస్తే పూర్తిగా కనిపిస్తుంది. దాని పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో గాంధీజీ బొమ్మ వాటర్మార్కుతో పూర్తిగా కనిపిస్తుంది. వాటర్ మార్కుకు పక్కన 1000 సంఖ్య నిలువుగా కనిపిస్తుంది. దీన్ని కూడ వెలుతురుకు పెట్టి చూడాలి. నోటును పైకి కిందికి అంటుంటే మధ్యలో ఉన్న 1000 సంఖ్య రంగు మారుతూ కనిపిస్తుంది. గ్రీన్, బ్లూ రంగుల్లో 1000 సంఖ్య కనిపిస్తుంది. కుడివైపున పైన ఉన్న, ఎడమ వైపున కింద ఉన్న సిరీస్ నంబర్ వెలుతురులో చూస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది. మధ్యలో ఉన్న (థ్రెడ్) దారంపై భారత్, ఆర్బీఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి.నోటును పైకి కిందికి అంటుంటే మధ్యలో దారం బ్లూ,గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దానికింద ఉన్న ఇంగ్లీషు అక్షరాలు, అలాగే నోటుకు పైన, మధ్యలో ఉన్న హిందీ, ఇంగ్లీషు అక్షరాలు ముట్టకుంటే చేతికి తగిలిన భావన కలుగుతుంది. నోటుకు కుడివైపున చివరన 1000 సంఖ్యకు, రిజర్వు బ్యాంకు ముద్రకు మధ్యలో లేటెంట్ ఇమేజ్ ఉంటుంది. దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే కనిపిస్తుంది. నోటును దగ్గరగా పెట్టుకొని చూస్తేనే కనిపిస్తుంది. ఇమేజ్ ఎడమవైపున, గాంధీజీ ఫొటోకు మధ్యలో ఉన్నఖాళీలో సూక్ష్మపరిశీలన చేస్తే ఆర్బీఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి. ఎడమ వైపు చివర మధ్యలో డైమండ్ ఆకారంలో గుర్తు ఉంటుంది. దీన్ని చేతితో తడిమితే తగిలిన భావన కలుగుతుంది. నోటు వెనుక వైపు మధ్యలో సంవత్సరం ముద్రించి ఉంటుంది. రూ. 10 నోటుకు ఏడు అంశాలు పరిశీలించాలి. పైన పేర్కొన్న వాటిలో స్పెషల్ ఐడెంటిఫికేషన్ మార్కు, లెటెంట్ ఇమేజ్ ఉండదు. అక్షరాలు చేతితో తడిమితే ఎలాంటి భావన కలుగదు. మిగిలిన అంశాలన్ని పైన చెప్పిన విధంగానే ఉంటాయి. {పతి నోటుకు ఎడమవైపు చివరన గుర్తులు మారుతుంటాయి. రూ.1000 డైమండ్, రూ.500లకు రౌండ్ చుక్క, రూ.100కు త్రిభుజం, రూ.50కి బ్లాక్ గుర్తు, రూ.20 రెక్టాంగిల్ గుర్తు, రూ.10కి ఎలాంటి గుర్తు ఉండదు. -
పాకిస్థాన్నుంచి ఇందూరుకు..
నిజామాబాద్ క్రైం : అతి సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అక్రమ మార్గం పట్టాడు. నకిలీ నోట్లు చలామణి చేశాడు. తల్లిదండ్రులను సైతం ఈ దందాకు వాడుకున్నాడు. కుమారుడిని మందలించాల్సిన తల్లిదండ్రులు.. అతడిని ప్రోత్సహించారు. చివరికి బండారం బట్టబయలైంది. కుటుంబం కటకటాలపాలైంది. ఈ దందాతో తొమ్మిది మందికి సంబంధం ఉండగా ఆరుగురిని అరెస్టు చేశామని నిజామాబాద్ రూరల్ సీఐ సూదిరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. వివరాలిలా ఉన్నాయి ఎడపల్లి మండలానికి చెందిన దువ్వ మహేశ్‌కు ఆశ ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించాడు. స్నేహితులు కేసరి సత్యనారాయణగౌడ్ అలియాస్ సతీశ్, ఆకుల ప్రవీణ్గౌడ్లతో కలిసి దొంగనోట్ల వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని.. అప్పటికే ఆ వ్యాపారం చేస్తున్న బాన్సువాడలోని అంగడిబజార్‌కు చెందిన మలావత్ మోహన్‌ను కొన్నేళ్ల క్రితం కలిశారు. అతడి ద్వారా మెదక్ జిల్లా రేగోట్ గ్రామానికి చెందిన వడితె కిషన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కిషన్ ద్వారా నకిలీ నోట్లు చలామణి చేసే ప్రధాన సూత్రధారి మంగ్యానాయక్ అనే వ్యక్తిని కలిశారు. మంగ్యానాయక్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా దొంగనోట్ల వ్యాపారం చేసేవాడు. ఈ నోట్లు పాకిస్థాన్‌లో ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్ చేరుకునేవి. వాటిని కోల్‌కతాలోని ఓ వ్యక్తి దేశంలోని చాలా ప్రాంతాలకు పంపించేవాడు. అక్కడినుంచే మంగ్యానాయక్‌కు చేరేవి. అతడు ఈ ప్రాంతంలో దొంగనోట్లను చలామణి చేసేవాడు. ఎవరికీ అనుమానం కలుగకుండా వివిధ మార్కెట్లలో తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తూ నకిలీ నోట్లను ఇచ్చేవారు. పట్టుబడ్డారిలా.. ఎడపల్లి మండలానికి చెందిన రమాదేవి గత నెల 21వ తేదీన దగ్గరి బంధువు శోభరాణిని వెంటబెట్టుకుని నవీపేట్లో బంగారం, వెండి ఆభరణాల దుకాణాలకు వెళ్లింది. ఆభరణాలను కొనుగోలు చేసి 57 వేల బిల్లు చెల్లించింది. ఆమె ఇచ్చిన డబ్బులు తీసుకొని షాపు యజమాని నాంపల్లి ప్రవీణ్ కుమార్ జిల్లా కేంద్రంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్లాడు. బ్యాంకు సిబ్బంది నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నవీపేటలో కలకలం చెలరేగింది. నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్, నిజామాబాద్ రూరల్ సీఐ దామోదర్‌రెడ్డి, నవీపేట్ ఎస్సై సంపత్‌కుమార్, ఐడీ పార్టీ ఏఎస్సై పోచయ్య, కానిస్టేబుళ్లు నరేందర్, రవీందర్‌లు విచారణ చేపట్టారు. అనుమానితులను నవీపేట పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. దీంతో వాస్తవాలు ఒక్కోక్కటిగా బయట పడడంతో పోలీసులే నివ్వెరపోయారు. ఈ కేసులో మహేశ్, గంగాధర్, రమాదేవి, కేసరి సత్యనారాయణ గౌడ్, ఆకుల ప్రవీణ్‌కుమార్, మలావత్ మోహన్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్దనుంచి రూ. 69 వేలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగ నోట్లు చలామణి చేసే మహేశ్, అతని స్నేహితులు పట్టుబడ్డారన్న విషయం తెలియగానే మెదక్ జిల్లాకు చెందిన వడాతె మంగ్యానాయక్, రాముగౌడ్, వడాతె కిషన్‌లు పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మంగ్యానాయక్ చిక్కితే మరిన్ని అసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆందోళనలో వ్యాపారులు జిల్లాలో నకిలీ నోట్ల చలామణి అలజడి సృష్టించింది. పాకిస్థాన్‌లో ముద్రించిన దొంగనోట్లను జిల్లాలో చలామణి చేస్తున్నట్లు తెలియడంతో ప్రజలతోపాటు వ్యాపారులూ ఆందోళన చెందుతున్నారు. అసలు నోటుకు తీసిపోని విధంగా నకిలీ నోటు ఉండడం గమనార్హం. నిందితులు మూడేళ్లుగా నకిలీ నోట్లను మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఇప్పటి వరకు నిజామాబాద్, మెదక్ జిల్లాలలో కలిపి రూ. 20 లక్షల వరకు నకిలీ నోట్లను చలామణి చేసినట్లు సమాచారం. ఏడాది క్రితం ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్‌లలో దొంగనోట్లు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. చిన్న దుకాణాలే టార్గెట్ పెద్ద షాపులలో నోట్ల కట్టలను లెక్కించేందుకు ప్రత్యేకంగా మిషన్లు ఉంటాయి. ఇవి నకిలీ నోట్లను గుర్తుపట్టగలవు. కానీ చిన్న దుకాణాలు, వారాంతపు సంతలు, వైన్స్‌లు, కల్లుదుకాణాలలో ఈ మిషన్లు ఉండవు. దీంతో నిందితులు ఆయా దుకాణాలను టార్గెట్‌గా చేసుకొని నకిలీ నోట్లను మార్చుతున్నారు. నవీపేటలో నకిలీ నోట్ల వ్యవహారం బట్టబయలు కావడంతో రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకునేందుకే వ్యాపారులు జంకుతున్నారు. -
నకిలీ నోట్ల ముఠా ఆటకట్టు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నకిలీ నోట్లు చలామణి చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.10 లక్షలకు పైగా నకిలీ నోట్లు, వాటి తయారీకి వినియోగించిన యంత్రాన్ని స్వాధీ నం చేసుకున్నట్లు డీఎస్పీ నాగరాజ తెలి పారు. సోమవారం స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం పట్టణానికి చెందిన వీరయ్య అక్షయ గోల్డ్ ఏజెంట్‌గా పలువురితో ఆ సంస్థలో డిపాజిట్లు చేయించాడు. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి తేవడంతో తనను సమ స్య నుంచి గట్టెక్కించే మార్గం చూపాలం టూ అతను హిందూపురానికి చెందిన తాహిద్ను కోరాడు. ఇదే అదనుగా భావించిన అతను అనంతపురంలోని రాణీ నగర్‌కు చెందిన తన మిత్రుడు మగ్బూల్ అనే వ్యక్తి నకిలీ నోట్లు తయా రు చేస్తాడని, అతనిని కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించాడు. దీంతో ఇద్దరూ కలసి మగ్బూల్‌ను కలువగా రూ.లక్ష నగదు ఇస్తే రూ.30 లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తానని చెప్పాడు. అతను సూచించిన మొత్తాన్ని వీరయ్య చెల్లించడంతో, ఆ డబ్బుతో కలర్ జెరాక్స్ మెషీన్, ప్రింటర్ తదితర పరికరాలు కొనుగోలు చేశాడు. నగరంలోని వేణుగోపాల్ నగర్‌లోని ఓ ఇంట్లో భార్య ముం తాజ్ సాయంతో నోట్ల తయారీ ప్రారంభించాడు. రూ.3 లక్షల విలువైన నకిలీ నోట్లను వీరయ్యకు అందజేశాడు. తానూ కొన్ని నోట్లను చలామణి చేసేందుకు సోమవారం సాయంత్రం తాడిపత్రి బస్టాండు సమీపంలో తాహీద్తో కలసి ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నకిలీ కరెన్సీ తయారీలో శిక్షణ పొందిన మగ్బూల్ గుత్తికి చెందిన మస్తాన్ కూతురు ముంతాజ్‌ను మగ్బూల్ వివాహం చేసుకున్నాడు. మస్తాన్ నకిలీ కరెన్సీ తయారీలో సిద్ధహస్తుడు. అతని వద్దే మగ్బూల్ శిక్షణ పొందాడు. అలా నేర్చుకున్న విద్యతో గతంలోనకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తూ ధర్మవరం, హిందూపురం పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా, ప్రస్తుతం మగ్బూల్, తాహిద్లు పోలీసులకు పట్టుబడగా, వీరయ్య, మగ్బూల్ భార్య ముంతాజ్లుపరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది రమేష్, నాగరాజ తదితరులను అభినందించారు. -
గుట్టుగా నకిలీనోట్ల చలామణి?
లింగంపేట, న్యూస్‌లైన్: లింగంపేట మండల కేంద్రంలో ఐదువందల నకిలీ నోట్ల చలామణి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2013 అక్టోబర్‌లో ఐదువందల నకిలీనోట్లను చలామణి చేస్తూ లింగంపేటకు చెందిన ఆకుల సత్యం అనే యువకుడు పోలీసులకు చిక్కాడు. దొంగనోట్లపై విచారణ జరిపిన పోలీసులు రూ.1.02 లక్షల విలువైన నకిలీ ఐదువందల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. నకిలీనోట్ల వ్యవహారం సమసి పోయిందని భావిస్తున్న తరుణంలో లింగంపేటకు చెందిన ఓ వ్యాపారి గుట్టుచప్పుడు కాకుండా రూ.5 వందల నకిలీ నోట్లను చలామణి చేస్తున్నాడనీ మళ్లీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం, మక్కల కొనుగోళ్లు చేపట్టే ఓ వ్యాపారి ధాన్యం, మక్కలు విక్రయించిన రైతులకు నకిలీ నోట్లను అంటగడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లింగంపేట మండల కేంద్రానికి చెందిన ఒకరిద్దరు యువకులు నకిలీ నోట్ల చలామణిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లావ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ 5 వందల నోట్ల చలామణి వ్యవహారాన్ని మండల ప్రజలు మరవకముందే, మళ్లీ చలామణి జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏవి అసలు నోట్లో, ఏవి నకిలీ నోట్లో తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరు ఈపాటికే సుమారు రూ.15 లక్షల నకిలీ నోట్లను మార్కెట్లో గుట్టుచప్పుడు కాకుండా చలామణి చేసినట్లు సమాచారం. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న నకిలీనోట్ల చలామణిపై పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.