ఘట్‌కేసర్: ఇటీవల నకిలీ నోట్ల చెలామణి విస్తృతమైంది. ముఖ్యంగా వెయ్యి రూపాయల నోట్లను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు. ఆ నోటు అసలుదా లేక నకిలీదా అన్న విషయం తేల్చలేక ఆందోళన చెందుతున్నారు. అయితే మన చేతిలో ఉంది.. నకిలీ నోటా లేక అసలుదా అని కనిపెట్టడానికి ఉపయోగపడే
కొన్ని గుర్తులపై కథనం..
ఎడమ వైపున మధ్యలో 1000 సంఖ్యలో ప్రతి అక్షరం సగం కనిపించి సగం కనిపించకుండా ఉంటుంది. వెలుతురులో చూస్తే పూర్తిగా కనిపిస్తుంది.
దాని పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో గాంధీజీ బొమ్మ వాటర్‌మార్కుతో పూర్తిగా కనిపిస్తుంది. వాటర్ మార్కుకు పక్కన 1000 సంఖ్య నిలువుగా కనిపిస్తుంది. దీన్ని కూడ వెలుతురుకు పెట్టి చూడాలి.
నోటును పైకి కిందికి అంటుంటే మధ్యలో ఉన్న 1000 సంఖ్య రంగు మారుతూ కనిపిస్తుంది. గ్రీన్, బ్లూ రంగుల్లో 1000 సంఖ్య కనిపిస్తుంది.
కుడివైపున పైన ఉన్న, ఎడమ వైపున కింద ఉన్న సిరీస్ నంబర్ వెలుతురులో చూస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది.
మధ్యలో ఉన్న (థ్రెడ్) దారంపై భారత్, ఆర్‌బీఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి.నోటును పైకి కిందికి అంటుంటే మధ్యలో దారం బ్లూ,గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది.
దానికింద ఉన్న ఇంగ్లీషు అక్షరాలు, అలాగే నోటుకు పైన, మధ్యలో ఉన్న హిందీ, ఇంగ్లీషు అక్షరాలు ముట్టకుంటే చేతికి తగిలిన భావన కలుగుతుంది.
నోటుకు కుడివైపున చివరన 1000 సంఖ్యకు, రిజర్వు బ్యాంకు ముద్రకు మధ్యలో లేటెంట్ ఇమేజ్ ఉంటుంది. దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే కనిపిస్తుంది. నోటును దగ్గరగా పెట్టుకొని చూస్తేనే కనిపిస్తుంది.
ఇమేజ్ ఎడమవైపున, గాంధీజీ ఫొటోకు మధ్యలో ఉన్నఖాళీలో సూక్ష్మపరిశీలన చేస్తే ఆర్‌బీఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి.
ఎడమ వైపు చివర మధ్యలో డైమండ్ ఆకారంలో గుర్తు ఉంటుంది. దీన్ని చేతితో తడిమితే తగిలిన భావన కలుగుతుంది.
నోటు వెనుక వైపు మధ్యలో సంవత్సరం ముద్రించి ఉంటుంది.
రూ. 10 నోటుకు ఏడు అంశాలు పరిశీలించాలి. పైన పేర్కొన్న వాటిలో స్పెషల్ ఐడెంటిఫికేషన్ మార్కు, లెటెంట్ ఇమేజ్ ఉండదు. అక్షరాలు చేతితో తడిమితే ఎలాంటి భావన కలుగదు. మిగిలిన అంశాలన్ని పైన చెప్పిన విధంగానే ఉంటాయి.
{పతి నోటుకు ఎడమవైపు చివరన గుర్తులు మారుతుంటాయి. రూ.1000 డైమండ్, రూ.500లకు రౌండ్ చుక్క, రూ.100కు త్రిభుజం, రూ.50కి బ్లాక్ గుర్తు, రూ.20 రెక్టాంగిల్ గుర్తు, రూ.10కి ఎలాంటి గుర్తు ఉండదు.
నకిలీని కనిపెట్టండిలా..!
Published Wed, Nov 26 2014 12:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement