నాగిరెడ్డిపేట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’పథకం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న డబ్బులలో నకిలీ నోట్లు దర్శనమిస్తున్నట్లు తెలిసింది. మండలంలోని లింగంపల్లికలాన్ గ్రామంలో శుక్రవారం లబ్ధిదారులకు అధికారులు పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారుడు పింఛన్ డబ్బులను తీసుకొని, మండలకేంద్రానికి చేరుకొని వెయ్యిరూపాయల నోటును విడిపించే ప్రయత్నం చేయగా అది నకిలీదని తెలినట్లు సమాచారం. దీంతో సదరు బాధితుడు తనకు ఇచ్చిన పింఛన్‌డబ్బులలో నకిలీనోటు రావడంతో ఒక్కసారిగా అవాక్కయాడు.
వెంటనే గ్రామానికి చేరుకొని అధికారులకు తిరిగి ఇచ్చేదామనుకునేలోపే వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో ఎవరికి చెప్పుకోలేక గుట్టుచప్పుడుకాకుండా సదరు వెయ్యి రూపాయల నకిలీనోటును చెల్లించుకున్నట్లు సమాచారం. స్వయంగా అధికారులు పంపిణీ చేస్తున్న పింఛన్ డబ్బులలో నకిలీనోటు ప్రత్యక్ష ం కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
పింఛన్‌దారుని చేతికి నకిలీనోటు !
Published Sun, Dec 14 2014 2:11 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement