రామ్మోహన్‌ నాయుడు అనుచరుడి దందా.. శిక్షణ పేరుతో యువతులపై వేధింపులు! | TDP Supporter Ramana Cheating Students Over Jobs Iusse In Srikakulam | Sakshi
Sakshi News home page

రామ్మోహన్‌ నాయుడు అనుచరుడి దందా.. శిక్షణ పేరుతో యువతులపై వేధింపులు!

Published Fri, Dec 6 2024 2:53 PM | Last Updated on Fri, Dec 6 2024 6:48 PM

TDP Supporter Ramana Cheating Students Over Jobs Iusse In Srikakulam

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలైంది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర లక్షల్లో వసూలు వేసి వారిని వేధింపులకు గురిచేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీనికి 
సంబంధించిన వీడియోను వైఎస్సార్‌సీపీ షేర్‌ చేసింది.

వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా వీడియోను షేర్‌ చేస్తూ..‘శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణ. శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్.. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నాడు.

బసవ రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని  బంధించి.. చిత్రహంసలకు గురిచేస్తున్నాడు. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి.. బసవ రమణ దందాలు. షాపింగ్ మాల్స్‌, బార్స్‌కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. రమణ ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా.. పట్టించుకోని కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్‌‌కి కూడా రమణ సన్నిహితుడు. పాలన చేతగాకపోతే.. ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు అంటూ విమర్శించింది. 

ఉద్యోగాల పేరుతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి పైశాచికం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement