Ram Mohan Naidu
-
తిరుమల : హే.. గోవిందా! మళ్లీ ఆగమశాస్త్ర ఉల్లంఘన
-
అమ్మాయిల వీడియోలు తీసి.. మంత్రి అనుచరుడి దుర్మార్గాలు
-
రామ్మోహన్ నాయుడు అనుచరుడి దందా.. శిక్షణ పేరుతో యువతులపై వేధింపులు!
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలైంది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర లక్షల్లో వసూలు వేసి వారిని వేధింపులకు గురిచేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ షేర్ చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేస్తూ..‘శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణ. శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్.. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నాడు.బసవ రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి.. చిత్రహంసలకు గురిచేస్తున్నాడు. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి.. బసవ రమణ దందాలు. షాపింగ్ మాల్స్, బార్స్‌కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. రమణ ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా.. పట్టించుకోని కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్‌కి కూడా రమణ సన్నిహితుడు. పాలన చేతగాకపోతే.. ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు అంటూ విమర్శించింది. 💣 Truth Bomb 💣శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణశిక్షణ పేరుతో సెంటర్… pic.twitter.com/CdcgSdJUJE— YSR Congress Party (@YSRCParty) December 6, 2024 -
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో నూతన ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తమ హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్‌తో పాటు మరో మూడు (పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్) విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని తెలిపారు.పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని.. నివేదిక సానుకూలంగా వస్తే తర్వాత భూసేకరణకు వెళ్లొచ్చని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ నుంచి అనుమతి ఉంటే అక్కడ కూడా విమానాశ్రయాన్ని చేస్తామన్నారు.‘‘ఆదిలాబాద్‌కు ఓవైపు చత్తీస్‌గఢ్, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. దరిదాపుల్లో విమానాశ్రయం లేదు. అక్కడ ఏర్పాటు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ విమానాశ్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తూ భూసేకరణకు సర్క్యులర్ జారీ చేసింది. అక్కడ పూర్తిగా ఎయిర్‌ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తాం. విమానయాన శాఖ వల్ల కేవలం విమాన ప్రయాణాలే కాదు.. టూరిజం ఉద్యోగ కల్పన మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పెరుగుతుంది’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. -
విమానాలకు బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నాం
-
రామయ్యా.. హామీల మాటేమిటయ్యా.!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ⇒ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా ఇవ్వబోతున్నాం. మూడు సిలిండర్లు ఎందుకని చంద్రబాబు ఇవ్వబోతున్నారు..? సిలిండర్ల ధర జగన్ పెంచారు. ఇప్పుడు కొనలేకపోతున్నాం. ఇబ్బంది ఉంది కాబట్టి మళ్లీ గ్యాస్ పొయ్యల మీద వంట చేసుకునేందుకు మూడు సిలిండర్లు ఉచితం.⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకు లు కూడా భారీగా పెరగడంతో కొనలేకపోతున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలను స్థిరీకరిస్తాం.⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోలేదు. అన్ని రకాలుగా ముంచేశారు. రైతుల్ని ఆదుకోవడానికి ఏటా సీజన్ ప్రారంభంలోనే రూ. 20వేల పెట్టుబడి సా యం అందిస్తాం. ⇒ సముద్ర వేట విరామ సమయంలోనే మత్స్యకారులకు రూ. 20వేలు అందజేస్తాం. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం. వారికి అవసరమైన బోట్లు, వలలు, పరికరాలు అందిస్తాం.అధునాతన పద్ధతుల్లో వేటకు సహకరిస్తాం.⇒ ఆర్టీసీ ఛార్జీలు భరించలేని విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఫ్రీ చేసి, ఆడప డుచులు ఎక్కడ తిరగాలన్నా పైసా ఖర్చు లేకుండా చేస్తాం. ⇒చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున.. ఇద్దరుంటే రూ.30వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు... నలుగురుంటే రూ.60వేలు.. ఇంకా ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15వేలు చొప్పున మీ అకౌంట్లో వేయడానికి చంద్రబాబు నిర్ణయించారు.ఎన్నికలకు ముందు ప్రస్తుత కేంద్ర మంత్రి, అప్పటి ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు ఇవి. ఇప్పుడు వారు అనుకున్నట్టే అధికారంలోకి వచ్చారు. బాధ్యతలు స్వీకరించి 50 రోజులు దాటిపోయింది. వీటిలో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారా? అంటే ఏమీ లేదనే చెప్పాలి. పైగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు మాటలన్నీ మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు.ధరలు తగ్గించారా?వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఽనిత్యావసర ధరలు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టారు. పోనీ ఇప్పుడేమైనా తగ్గించారా అంటే అదేమీ లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని ఆరోపించిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నా ఆ ధరల గురించి మాటైనా మాట్లాడడం లేదు. గ్యాస్ ధరల పెంపు కూడా వైఎస్ జగన్‌పైనే వేసి ఊరూరా ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం దాన్ని తగ్గించి చూపలేకపోతున్నారు.కోటలు దాటే మాటలుకేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు మాటలు కోటలు దాటుతున్నాయి గానీ చేతలే దాటడం లేదని జిల్లా వాసులంటున్నారు. మత్స్యకారుల వేట విరామం సమయం దాటిపోయి చాలా రోజులైంది. మధ్యలో వర్షాలు కూడా వచ్చి మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఇస్తామన్న రూ.20 వేలు ఇంతవరకు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ సగానికి వచ్చేసింది. ఉడుపులు అయిపోయాయి. కానీ, వారికింతవరకు పెట్టుబడి సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చుల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయమే కాదు ప్రభుత్వం విధిగా అందించాల్సిన విత్తనాలు, ఎరువుల విషయంలోనూ అదే నిర్లక్ష్యం కన్పించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటిపోయింది. పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాన్ని నేటికీ ఇవ్వలేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 15వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. ఇవే కాదు మహిళలకు ప్రతి నెలా రూ. 1500, నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు...అవి ఇచ్చేలోపు నెలకి రూ. 3వేల నిరుద్యోగ భృతి కూడా మర్చిపోయారు. 50 ఏళ్ల పింఛన్ ఇవ్వడం మాట దేవుడెరుగు.. ఉన్నవి తీసేస్తున్నారు.కొత్తవేవీ..?తాను ఎంపీగా ఎన్నికయ్యాకే జిల్లాలో రైల్వే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకుంటారు. కానీ, దేశ వ్యాప్తంగా ఏం జరిగాయో అవే జరిగాయే తప్ప వ్యక్తిగత ప్రాధాన్యతతో జరిగినవేవి లేవు. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో అనేక రైల్వే స్టేషన్లు ఆధునీకరణ జరిగాయి. అవన్నీ ఎంపీల వ్యక్తిగత ఖాతాలో వేసుకుంటే.. ఇక్కడ అదనంగా చేసిందేంటో చెప్పడానికి లేవు. కేంద్రమంత్రిగా ఉండటంతో జిల్లాకు ప్రత్యేక ప్రాజెక్టులేమైనా వస్తాయేమోనని ప్రజలంతా ఆశించారు. కానీ ఒక్కటంటే ఒక్కటీ జిల్లాకు ప్రత్యేక కేటాయింపు లేదు. -
ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి రామ్మోహన్ నాయుడు
సాక్షి, ఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య భారత్ సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ఇబ్బందులకు దృష్టిపెట్టుకుని వారికి తగిన ఏర్పాట్లు చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఇక, మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్య నేపథ్యంలో రామ్మెహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల పట్ల విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు సానుభూతితో వ్యవహరించాలి. విమాన సర్వీసుల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు అదనపు సీటింగ్, వాటర్, ఆహారాన్ని అందించండి. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణం కోసం టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఇలాంటి సమాయాల్లో ప్రయాణీకుల సహకారం కూడా తప్పకుండా అవసరం. టెక్నికల్ సమస్య, విమాన సర్వీసుల రాకపోకలపై ఎలాంటి అప్డేట్ ఉన్నా ప్రయాణీకులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించినట్టు తెలిపారు.విమానాశ్రయాల్లో ప్రయాణీకుల అవసరాల కోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో అధికారులు టచ్‌లోనే ఉన్నారు. వీలైనంత త్వరగా మామూలు పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ టెర్మినల్‌పై కొత్త చర్చ.. మోదీనా లేక కాంగ్రెసా?
ఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇక, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.కాగా, విమానాశ్రయంలో పైకప్పు కూలిన ప్రదేశాన్ని శుక్రవారం ఉదయం రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలిపోయిన టర్మినల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రయాణీకులు అందరికి తగిన ఏర్పాట్లు చేశాం. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకుంటాం. ఈ టెర్మినల్‌ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించినట్టు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. అది నిజం కాదు. 2009లో టెర్మినల్ నిర్మాణం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.మరోవైపు.. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం అందించనున్నట్టు తెలిపారు. అలాగే, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రామ్మోహన్ పరామర్శించారు.ఇక, ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ టెర్మినల్‌ను ప్రారంభించారు. 2024వ ఏడాదిలోనే దీన్ని ప్రారంభించారు. మోదీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. బీజేపీ హయాంలో గత పదేళ్లలో పలు నిర్మాణాలు కూలిపోతున్నాయి. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
టీడీపీలో వెన్నుపోటు రాజకీయాలు.. బాబాయ్, అబ్బాయ్ వార్..
తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే. ఉత్తరాంధ్రలో నాటు సామెత ఇది. అక్కడి రాజకీయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. పదవుల కోసం, ఆధిపత్యం కోసం బంధుత్వాలను కూడా లెక్కచేయకుండా పోటీపడుతుంటారు. శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్.. అబ్బాయ్ ల మద్య ఇదే తరహా పొలిటికల్ వార్ నడుస్తోంది. టిడిపిలో టాప్ 2 లీడర్స్ గా ఎదిగినా వెన్నుపోటు రాజకీయాలు మాత్రం మానడం లేదు. ఇంతకీ బాబాయ్ అబ్బాయ్ లు ఎవరో తెలుసా? శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు యర్రంనాయుడు పొలిటికల్ హిస్టరీ అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాయకుడు యర్రంనాయుడు. అనుకోకుండా పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యాక టిడిపి లో టాప్ 2 పొజిషన్ లో నిలిచిపోయారు. యర్రంనాయుడు పార్లమెంట్ సీటుకి ఫిక్స్ అయిపోయాక అసెంబ్లీ స్థానంలోకి అచ్చెన్నాయుడు వచ్చి చేరారు. ఈలోగా యర్రంనాయుడు మృతి చెందడంతో అనూహ్యంగా 2014 ఎన్నికల్లో యర్రంనాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. 2019లో కూడా రామ్మోహన్ నాయుడు గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ఆ తరువాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో జిల్లా టీడీపీ రాజకీయాల్లో అచ్చెన్నాయుడు హవా కొనసాగుతున్నట్టే చెప్పొచ్చు. రామ్మెహన్ రావు టీంకు గుబులు.. తన భర్త యర్రంనాయుడు తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన మరిది అచ్చెన్నాయుడి రాజకీయ ఎదుగదల, తన కొడుకు రామ్మోహన్‌ను పక్కనపెట్టే ప్రయత్నాలను వదిన విజయలక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే తరహా రాజకీయాలు కొనసాగితే అచ్చెన్నాయుడు చాటున ఎదుగు బొదుగు లేకుండా ఎన్నాళ్లు ఉంటామన్న గుబులు కింజరాపు రామ్మోహన్ నాయుడు టీంకి పట్టుకుంది. ఈ విషయమై చంద్రబాబు వద్ద పలు మార్లు పంచాయితీ కూడా నడిచింది. ఇదిలా ఉండగా తాజాగా సంక్రాంతికి సొంతూరు నిమ్మాడలో బాబాయ్.. అబ్బాయ్ కుటుంబాల మద్య ఆదిపత్య పోరు బయటపడిందట. ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై వాలడం లేదంట. పండక్కి ఇరు కుటుంబాలు ఒక చోట చేరలేదు సరికదా, అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లినవారిని యర్రంనాయుడు కుటుంబం టార్గెట్ చేసి మాట్లాడిందట. అలాగే రామ్మోహన్ నాయుడు దగ్గరకు వెళ్లిన వారిపై అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారట. బాబాయ్ తప్పుకోవాలని.. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్తాను, బాబాయ్‌ను తప్పుకోమనండి అని అబ్బాయ్ పలువురు తో అచ్చెన్నాయుడు దగ్గరకి రాయబారం పంపిన్నట్టు సమాచారం. అయితే టెక్కలి అసెంబ్లీ స్థానం నుండి తప్పుకునేది లేదని అచ్చెన్నాయుడు ఫిక్స్ అయిపోవడంతో అబ్బాయ్ చూపు నరసన్నపేట మీద పడిందట. చంద్రబాబుకు కూడా ఇదే ఫిక్స్ చేయమని తన తల్లి విజయలక్ష్మి, పిల్లనిచ్చిన మామ బండారు సత్యన్నారాయణ, అక్క రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిలతో గట్టిగా చెప్పించారు. అయితే చంద్రబాబు ఏ విషయం తేల్చకపోయినప్పటికీ కింజరాపు కుటుంబం మరో ప్రతిపాదన తీసుకొచ్చిందట. అవసరమైతే శ్రీకాకుళం ఎం.పి స్థానానికి యర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానిని బరిలో దింపుతామని, రామ్మోహన్ నాయుడు మాత్రం అసెంబ్లీ స్థానానికే పోటీచేస్తాడని తేల్చి చెప్పారు. ఒకే కుటుంబం నుండి ఒక జిల్లాలో ముగ్గురికి టికెట్ లు ఇస్తే ఎలా అన్నది కింజరాపు కుటుంబం అంటే గిట్టని టిడిపి సీనియర్ బ్యాచ్ లాజికల్ పాయింట్ తీస్తోంది. టిడిపి రాజకీయాలంటే కింజరాపు కుటుంబానిది మాత్రమే కాదు అన్నది వీరి వాదన. దీంతో చంద్రబాబు ఏమీ తేల్చకుండా అలా వదిలేశారు. అయితే అబ్బాయి గట్టిగా పేచీకి దిగితే బాబాయ్ అచ్చెన్నాయుడుని ఎం.పి స్థానానికి ఫిక్స్ చేసి, అబ్బాయిని టెక్కలి అసెంబ్లీ స్థానంలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని శ్రీకాకుళం తెలుగుదేశం వర్గాల్లో చర్చ సాగుతోంది. చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’ -
తేల్చుకుందాం రండి..
సాక్షి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు అడ్డంపడుతున్నారని శ్రీకాకుళం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్‌ను రాజధానిగా ఎందుకు అంగీకరించడం లేదో ఎంపీ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. వైజాగ్ రాజధాని కోసం వైఎస్సార్సీపీ కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు ఎదురు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సీఎం జగన్ ప్రజల నాయకుడని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఒక్క ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే ప్రాంతీయ విద్వేషాలు పెరిగే అవకాశముందన్నారు. అమరావతి రాజధాని కావాలంటున్న టీడీపీ నాయకులు హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు ఎప్పుడూ ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అమరావతి పేరుతో కోట్ల రూపాయలు కైంకర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలోనే పుట్టిన అచ్చెన్నాయుడు వైజాగ్‌ను రాజధానిగా వ్యతిరేకించడాన్ని దుయ్యబట్టారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రెండెకరాల స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి తలపై ఉన్న గాయాలే ఆయన రక్తచరిత్రకు సాక్ష్యాలని అన్నారు. ఎంతో మంది జీవితాలను ఆయన నాశనం చేశాడని, అచ్చెన్నాయుడి అక్రమాలకు సాక్ష్యాలున్నాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల రిగ్గింగ్‌తోనే రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే తనపై టీడీపీ నాయకులు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు చేతగాక తనపై అక్రమ కేసులు పెట్టారని, తాను ఏనాడు భయపడలేదన్నారు. (‘సీఎం జగన్ నిర్ణయం వల్లే మా ప్రాంతాల్లో వెలుగులు’) -
కంకర మిషన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు చెందిన కంకర మిషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామ సమీపంలో ఉన్న కంకర మిషన్‌లో అదే గ్రామానికి చెందిన రామ్మోహన్ నాయుడు(32) కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు అనుమానాస్పదంగా మృతిచెందాడు. యాజమాన్యం ప్రమాదవశాత్తు మృతిచెందాడని చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం రామ్మోహన్ నాయుడు మృతికి యాజమన్యమే కారణమని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పరిటాల సునీత మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే స్తున్నారు. -
జన్మభూమి’లో ఎంపీ, ఎమ్మెల్యేల నిలదీత
పీఎన్‌కాలనీ : స్థానికంగా 34వ వార్డులో శనివారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ స్థానికులు ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని నిలదీశారు. దీంతో పాలకులు నివ్వెరపోయారు. టీడీపీ కార్యకర్తలు మాటమార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. స్థానిక మహిళ పి.కామేశ్వరి తదితరులు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని గుర్తు చేస్తూ ప్రజాప్రతినిధులను నిలదీశారు. రుణమాఫీ, ఆధార్, రేషన్ కార్డులు ఇలా పలు సమస్యలను ప్రస్తావించారు. తొలుత 20వ వార్డులో నిర్వహించిన జన్మభూమిలో ఎంపీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికే జన్మభూమి అని అన్నారు. నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్న నమ్మకం ప్రజల్లో మరింత పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.వి.రమణ, మున్సిపల్ డీఈ శంకరరావు, టీడీపీ మాజీ కౌన్సిలర్ జి.శివప్రసాద్, నాయకులు కృపాసాగర్, బలివాడ శంకర్, కళావతి, వర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘జన్‌ధన్’తో పేదలకు మేలు
శ్రీకాకుళ అర్బన్: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పేదలకు ఎంతో మేలు చేస్తుందని, ఈ పథకం కింద ప్రతి కుటుంబం రెండు ఖాతాలు తెరిచేలా బ్యాంకులు కృషి చేయాలని శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు కోరారు. గురువారం ఆయన స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందన్నారు. కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పథకం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. జేసీ జి.వీరపాండ్యన్, ఆంధ్రాబ్యాంకు ఎల్డీఎం ఎం.రామిరెడ్డి, తదితరులు మాట్లాడారు. అంతకుముందు అతిథులు వివిధ బ్యాంకుల ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. కార్యక్రమంలో ఏజేసీ షరీఫ్, ఎస్బీఐ ఏజీఎం రాజారామ్మోనరావు, ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ బి.ఎస్.ఎన్.రాజు, నాబార్డు ఏజీఎం వాసుదేవన్, ఆంధ్రాబ్యాంకు ఏజీఎం రాజేంద్రకుమార్, సిండికేట్ బ్యాంకు ఏజీఎం సాంబిరెడ్డి, ఇతర బ్యాంకు అధికారులు, జిల్లాలోని శాఖాధికారులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో బ్యాంకులది కీలకపాత్ర దేశాభివృద్ధిలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో ఆయన జన్‌ధన్ యోజన ప్రారంభం సందర్భంగా ఖాతాలు తెరిచే కార్యాక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేదరికాన్ని రూపుమాపి అవినీతి రహిత దేశంగా రూపొందించేందుకు ప్రధానికి అంతా సహకరించాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ పేదరికం లేని భారతదేశానికి ప్రధాని, ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని, వారికి అంతా అండగా నిలవాలన్నారు. ఎస్బీఐ ఏజీఎం కె.కామేశ్వరరావు మాట్లాడుతూ జీరో అకౌంట్‌తో ఖాతాలను ప్రారంభించే ఈ కార్యక్రమానికి అనూహ్యై స్పందన వచ్చిందన్నారు. ఆధార్ లేదా ఏదో ఒక గుర్తింపు కార్డుతో వ్యక్తిగత చిరునామాతో అకౌంట్ ప్రారంభించవచ్చునన్నారు. నెలలోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త ఖాతాదారులకు పాస్‌బుక్‌లను అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు ఎస్.ఎం.బాషా, ఉదయకుమార్సింగ్, కార్యక్రమ నిర్వాహకుడు బి.శ్రీనివాసరావు, యూనియన్ సభ్యుడు ఎం. రమేష్, ఐ.జగన్నాధరావు, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం
ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్: ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీని తప్పనిసరిగా తెరిపించేందుకు ప్రయత్నిస్తామని శ్రీకాకుళం ఎంపీ కింజారాపు రామోహన్ నాయుడు అన్నారు. మున్సిపాలిటీలోని నాలుగవ వార్డు గేదలవానిపేట కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన రుప్ప రామచంద్రారావు, మండలంలోని చిట్టివలస పంచాయితీ సర్పంచ్ గుజ్జల జగదీశ్వరీలు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు ఆయనతోపాటు ఎమ్మెల్యే కూన రవికుమార్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు అతిధిలుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటో ఈ ఐదేళ్ళ పాలనలో చూపిస్తామన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరవేస్తామని కాబట్టి మున్సిపాలిటీ నుంచి గాని, శ్రీకాకుళం రూరల్ నుంచి అభివృద్ధి పనులు కోసం మా ముగ్గురిలో ఎవరినైనా కలవవచ్చునని తెలిపారు.అలాగే ఆమదాలవలస నియోజకవర్గంలో కుటుంబాల పాలన పోయిందని అందుకే నిజాయితీ, నిబద్దత కలిగిన కూన రవికుమార్‌ను గెలిపించారన్నారు. కార్యక్రమంలో తమ్మినేని విద్యాసాగర్, కిల్లి రామ్మోహనరావు, తమ్మినేని గీత, ఇంజరాపు విశ్వనాథం,గుడ్ల రాజ్యలక్ష్మీ, బొడ్డేపల్లి లక్ష్మణరావు, యండ అప్పలనాయుడు, మొదలవలస రమేష్, జీడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సై‘కిల్’ యాత్ర!
జిల్లాలో.. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో తమ కంటిలో నలుసుగా మారుతున్న ‘కళా’ వర్గాన్ని తొక్కిపెట్టేందుకు కింజరాపు శిబిరం ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడంలేదు. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరుకు అటు పాతపట్నం.. ఇటు శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లలో పతాక స్థాయికి చేరింది. ఒకవైపు శ్రీకాకుళంలో ‘గుండ’కు చెక్ పెట్టేందుకు కొర్ను ప్రతాప్‌ను ఎగదోసి పార్టీ అధిష్టానం వద్దకు పంపిన కింజారపు వర్గం.. మరోవైపు పార్టీ పటిష్టతే లక్ష్యంగా శనివారం నుంచి చేపడుతున్న సైకిల్ యాత్రను పనిలో పనిగా ‘కళా’ వర్గాన్ని కలవరపెట్టేందుకూ వినియోగించుకుంటోంది. అందుకే కళా వర్గానికి చెందిన నేత పార్టీ ఇన్చార్జిగా ఉన్న పాతపట్నం నుంచి వ్యూహాత్మకంగా యాత్రను ప్రారంభిస్తోంది. తమ వర్గానికి చెందిన కలిశెట్టికి యాత్ర నిర్వహణలో ప్రాధాన్యమిస్తూ అక్కడి ఇన్చార్జి కొవగాపును పక్కన పెట్టడంతో మొత్తం కళా వర్గం ఈ యాత్ర బహిష్కరణకు నిర్ణయించుకుంది. సైకిల్ యాత్రతో చేకూరే ప్రయోజనం కంటే కింజరాపు వ్యూహంతో పార్టీకి జరిగే నష్టమే ఎక్కువనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాతపట్నంలో పొగ శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కింజరాపు రామ్మోహన్ నాయుడు శని వారం నుంచి సైకిల్‌యాత్ర చేపడుతున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెం ట్ల పరిధిలో జరపనున్న ఈ యాత్రను పాతపట్నం నుంచే ప్రారంభిస్తున్నప్పటికీ, ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కొవగాపు సుధాకర్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా తమ వర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు చేయించారు. తద్వారా అధినేత ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ కళా వర్గాన్ని నేరుగా పొమ్మ న లేక పొగ పెట్టారు. అందుకు తగినట్లే కింజరాపు యాత్ర ను బహిష్కరిస్తున్నట్లు కళా వర్గం ప్రకటించింది. పాతపట్నం పార్టీ ఇన్చార్జిగా ఈ వర్గానికి చెందిన కొవగాపు సుధాకర్‌ను సాక్షాత్తు అధినేత చంద్రబాబే నియమించినా.. దాన్ని సైతం ధిక్కరిస్తూ తమ ఆధిపత్యమే లక్ష్యంగా కింజరాపు వర్గం పావులు కదుపుతూ కలిశెట్టి వర్గాన్ని ప్రోత్సహిస్తోంది. కాగా తన నియోజకవర్గంలో యాత్ర ప్రారంభిస్తున్నా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కొవగాపు వర్గం భగ్గుమంటోంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ప్రోత్సహిస్తున్నందుకు నిరసనగా సైకిల్ యాత్రను బహిష్కరిస్తున్నట్లు ఎల్‌ఎన్‌పేట మండల పార్టీ అధ్యక్షుడు చింతాడ శ్రీనివాసరావు, ఒమ్మి ఆనందరావు, హిరమండలం తెలుగు యువత అధ్యక్షుడు తులసీ, తదితరులు శుక్రవారం బహిరంగంగా ప్రకటించారు. కాగా అంతకు ముందు జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి సైకిల్ యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ కల్పించుకొని యాత్రలో తమ బాధ్యతలేమిటో చెప్పాలని కోరగా.. మీ అవసరం లేదు, అంతా మేం చూసుకుంటామని కింజరాపు వర్గీయులు స్పష్టం చేసినట్లు తెలి సింది. గత రెండు మూడు రోజులుగా ఈ వివాదం నడుస్తున్నా కింజరాపు వర్గం పట్టించుకోకపోవడంతో సైకిల్ యాత్ర సజావుగా సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళంలో సెగ శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: కింజరాపు వర్గం శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లో రేపిన అసమ్మతి సెగ పార్టీ అధిష్టానాన్ని తాకింది. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ పెద్దలను కలిసిన నియోజకవర్గ నాయకుడు కొర్ను ప్రతాప్ వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌లకు కోరా రు. యువకుడినైన తాను విజయం సాధిం చే అవకాశాలు ఉన్నాయని వారిద్దరినీ విడివిడిగా కలిసి విన్నవించారు. నియోజకవర్గ పరిస్థితులను వివరించా రు. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలో యువకులకు ప్రాతినిధ్యం కల్పిస్తే అన్ని వర్గాల ఓట ర్లను ప్రభావితం చేయవచ్చని, యువజనుల కోటా లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై పరి శీలిస్తానని చెప్పి అధినేత చంద్రబాబు వెళ్లిపోగా, ఆయన తనయుడు లోకేష్ మాత్రం యువమంత్రానికి కాస్త లొంగినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా గతంలో పీఆర్పీ అభ్యర్థిగా తాను సాధించిన ఓట్లు, స్థానికంగా టీడీపీ బలం, ప్రస్తుతం నాయకుల్లో ఉన్న భేదాభిప్రాయాలు తదితర అంశాలను ప్రతాప్ వివరించినట్లు తెలిసింది. జిల్లా టీడీపీలో యువకుల ప్రాతినిధ్యం పెంచేందుకు, తద్వారా లోకేష్ పేరుతో ప్రత్యేక వర్గాన్ని తయారు చేసేందు కు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందు లో భాగంగా యువ నాయకులకు ప్రత్యేక గుర్తింపునిచ్చే దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోం ది.ప్రతాప్‌తో ఆయన మాట్లాడిన తీరు ఈ అభిప్రాయం కలిగిస్తోందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
దేనికైనా రెఢీ
ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలి. నియోజకవర్గాలకు ఇన్చార్జీలను వేశాం. వారి ఆధ్వర్యంలో కలిసికట్టుగా పని చేయండి. ఎవరి పనితీరు ఏమిటో.. నాకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. సక్రమంగా పని చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. సాక్షాత్తు పార్టీ అధినేతే సమావేశాల్లో తరచూ హెచ్చరిస్తున్నా.. జిల్లా తెలుగుదేశం తీరు ఏ మాత్రం మారడం లేదు. పైగా రోజురోజుకీ గ్రూపుల గోల పెరిగిపోతోంది. నాయకులు ప్రజల్లోకి వెళ్లకపోగా పార్టీ సమావేశాల్లోనూ కీచులాడుకుంటున్నారు. ప్రధానంగా పాతుకుపోయిన రెండు గ్రూపుల నీడలో గ్రామ స్థాయి నేతలు సైతం చీలిపోయారు. ఆధిపత్యం కోసం దేనికైనా రెడీ అన్నట్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడింది. గ్రూపులుగా చీలిపోయిన నేతలు కొన్ని నియోజకవర్గాల్లో పరస్పర వ్యతి రేక చర్యలకు పాల్పడుతుండటంతో ప్రజల్లో పార్టీ పలుచనవుతోంది. కింజరాపు రామ్మోహన్నాయుడు, కిమిడి కళావెంకట్రావు వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పెరుగుతోందే తప్ప ఏమాత్రం సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ అధినేత ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా నేతల తీరు మారడం లేదు. సోమవారం శ్రీకాకుళంలో జరిగిన పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో చోటుచేసుకున్న సంఘటనలే దీనికి నిదర్శనం. రాజాం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ప్రతిభా భారతి సమావేశానికి రాలేదు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వవద్దని ఈ సమావేశంలో కొందరు ఆమె పరోక్షంలోనే డిమాండ్ చేశారు. ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనిపై కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లారు. రాజాంతోపాటు మొత్తం శ్రీకాకుళం, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు శ్రుతి మించాయి. ఒకప్పుడు కళావెంకట్రావుతో కలిసి ప్రతిభా భారతి జిల్లా రాజకీయాలను శాసించారు. కళావెంకట్రావు పీఆర్పీలోకి వెళ్లినప్పటి నుంచి ఎర్రన్నాయుడు వర్గంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజాం నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే పీఆర్పీ నుంచి మళ్లీ సొంత గూటికి చేరిన కళావెంకట్రావు వర్గం నుంచి ఈమెకు ప్రతిఘటన ఎదురవుతోంది. తన వర్గానికి చెందిన తలే భద్రయ్యకు టికెట్ ఇప్పించాలని‘కళా’ పట్టుదలతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఏపీపీఎస్సీ సభ్యునిగా పని చేసిన భద్రయ్య ఆధ్వర్యంలో కొందరు ప్రతిభాభారతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేరుగా చంద్రబాబును కలిసి ప్రతిభాభారతిపై స్థానికంగా వ్యతిరేకత ఉందని, జిల్లా నాయకురాలై ఉండి కూడా వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేసి, భద్రయ్యకు టికెట్ ఇవ్వాలని కోరాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. శ్రీకాకుళం నియోజకవర్గానికి ప్రస్తుతం కళావెంకట్రావు వర్గంలో ఉన్న అప్పల సూర్యనారాయణ ఇన్చార్జిగా ఉన్నారు. ఒకవేళ తనకు కాకుంటే తన భార్య, కుమారుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఇటీవల ఆయన అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కింజరాపు వర్గీయులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జన సమస్యలపై స్పందించి పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కింజరాపు రామ్మోహన్నాయుడి సహచరుడైన కొర్ను నాగార్జున(ప్రతాప్)కు టికెట్ ఇవ్వాలని ఈ వర్గం పట్టుపడుతోంది. ప్రతాప్‌కు పట్టణంలోని టీడీపీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయని వారు వాదిస్తున్నారు. ఈ పరిణామాలతో పట్టణంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ముఖ్యమైన సమావేశాలకు సైతం ఒక వర్గం వారు వస్తే మరో వర్గం గైర్హాజరవుతోంది. పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా ‘కళా’ వర్గీయుడైన కొవగాపు సుధాకర్ కొనసాగుతుండగా కింజరాపు వర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఎలాగైనా తనకు టికెట్ తెచ్చుకోవాలనే ఆలోచనలో కలిశెట్టి చాప కింద నీరులా పని చేస్తున్నారు. కింజరాపు మద్దతు ఉన్నందున తనకు తప్పకుండా టికెట్ వస్తుందనే నమ్మకంతో సుధాకర్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఈ అంతర్గత పోరును పరిష్కరించేందుకు ఇటీవల పార్టీ పెద్దలు పంచాయితీ పెట్టినా విభేదాలు సమసిపోలేదు. ఇచ్చాపురంలోనూ ఇదే వర్గపోరు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా డాక్టర్ బెందాళం అశోక్‌బాబు పనిచేస్తునారు. కింజరాపు వర్గీయుడైన ఈయనకు వ్యతిరేకంగా కళా వెంకట్రావు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దక్కత అచ్యుతరామిరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే ఆయన చంద్రబాబునాయుడును కోరారు. కళావెంకట్రావు కూడా ఈయనకే ఇవ్వాలని అధినేత వద్ద పట్టుబట్టినట్లు సమాచారం. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, వర్గపోరు కొనసాగుతుండటంతో అసంతృప్తి చెందుతున్న పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. దీనికి తోడు సమైక్యాంధ్ర విషయంలో పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరితో ప్రజల్లో పార్టీ పరపతి కోల్పోయిందని, జనం పట్టించుకోనప్పుడు పార్టీలో ఉండటం దండుగ అని ముఖ్య కార్యకర్తలు భావిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయ మనుగడ కోసం పార్టీని వీడేందుకు అనేకమంది నేతలు ప్రయత్నిస్తున్నారు.