కంకర మిషన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి | person Suspicious Death in the gravel Machine | Sakshi
Sakshi News home page

కంకర మిషన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

Published Thu, Dec 3 2015 9:23 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

person Suspicious Death in the gravel Machine

ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు చెందిన కంకర మిషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామ సమీపంలో ఉన్న కంకర మిషన్‌లో అదే గ్రామానికి చెందిన రామ్మోహన్ నాయుడు(32) కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు అనుమానాస్పదంగా మృతిచెందాడు. యాజమాన్యం ప్రమాదవశాత్తు మృతిచెందాడని చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం రామ్మోహన్ నాయుడు మృతికి యాజమన్యమే కారణమని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పరిటాల సునీత మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే స్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement