జిల్లాలో.. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో తమ కంటిలో నలుసుగా మారుతున్న ‘కళా’ వర్గాన్ని తొక్కిపెట్టేందుకు కింజరాపు శిబిరం ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడంలేదు. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరుకు అటు పాతపట్నం.. ఇటు శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లలో పతాక స్థాయికి చేరింది. ఒకవైపు శ్రీకాకుళంలో ‘గుండ’కు చెక్ పెట్టేందుకు కొర్ను ప్రతాప్‌ను ఎగదోసి పార్టీ అధిష్టానం వద్దకు పంపిన కింజారపు వర్గం.. మరోవైపు పార్టీ పటిష్టతే లక్ష్యంగా శనివారం నుంచి చేపడుతున్న సైకిల్ యాత్రను పనిలో పనిగా ‘కళా’ వర్గాన్ని కలవరపెట్టేందుకూ వినియోగించుకుంటోంది. అందుకే కళా వర్గానికి చెందిన నేత పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న పాతపట్నం నుంచి వ్యూహాత్మకంగా యాత్రను ప్రారంభిస్తోంది. తమ వర్గానికి చెందిన కలిశెట్టికి యాత్ర నిర్వహణలో ప్రాధాన్యమిస్తూ అక్కడి ఇన్‌చార్జి కొవగాపును పక్కన పెట్టడంతో మొత్తం కళా వర్గం ఈ యాత్ర బహిష్కరణకు నిర్ణయించుకుంది. సైకిల్ యాత్రతో చేకూరే ప్రయోజనం కంటే కింజరాపు వ్యూహంతో పార్టీకి జరిగే నష్టమే ఎక్కువనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పాతపట్నంలో పొగ
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్ నాయుడు శని వారం నుంచి సైకిల్‌యాత్ర చేపడుతున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెం ట్ల పరిధిలో జరపనున్న ఈ యాత్రను పాతపట్నం నుంచే ప్రారంభిస్తున్నప్పటికీ, ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కొవగాపు సుధాకర్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా తమ వర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు చేయించారు. తద్వారా అధినేత ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ కళా వర్గాన్ని నేరుగా పొమ్మ న లేక పొగ పెట్టారు. అందుకు తగినట్లే కింజరాపు యాత్ర ను బహిష్కరిస్తున్నట్లు కళా వర్గం ప్రకటించింది. పాతపట్నం పార్టీ ఇన్‌చార్జిగా ఈ వర్గానికి చెందిన కొవగాపు సుధాకర్‌ను సాక్షాత్తు అధినేత చంద్రబాబే నియమించినా.. దాన్ని సైతం ధిక్కరిస్తూ తమ ఆధిపత్యమే లక్ష్యంగా కింజరాపు వర్గం పావులు కదుపుతూ కలిశెట్టి వర్గాన్ని ప్రోత్సహిస్తోంది. కాగా తన నియోజకవర్గంలో యాత్ర ప్రారంభిస్తున్నా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కొవగాపు వర్గం భగ్గుమంటోంది.
ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ప్రోత్సహిస్తున్నందుకు నిరసనగా సైకిల్ యాత్రను బహిష్కరిస్తున్నట్లు ఎల్‌ఎన్‌పేట మండల పార్టీ అధ్యక్షుడు చింతాడ శ్రీనివాసరావు, ఒమ్మి ఆనందరావు, హిరమండలం తెలుగు యువత అధ్యక్షుడు తులసీ, తదితరులు శుక్రవారం బహిరంగంగా ప్రకటించారు. కాగా అంతకు ముందు జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి సైకిల్ యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ కల్పించుకొని యాత్రలో తమ బాధ్యతలేమిటో చెప్పాలని కోరగా.. మీ అవసరం లేదు, అంతా మేం చూసుకుంటామని కింజరాపు వర్గీయులు స్పష్టం చేసినట్లు తెలి సింది. గత రెండు మూడు రోజులుగా ఈ వివాదం నడుస్తున్నా కింజరాపు వర్గం పట్టించుకోకపోవడంతో సైకిల్ యాత్ర సజావుగా సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాకుళంలో సెగ
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: కింజరాపు వర్గం శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్‌లో రేపిన అసమ్మతి సెగ పార్టీ అధిష్టానాన్ని తాకింది. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ పెద్దలను కలిసిన నియోజకవర్గ నాయకుడు కొర్ను ప్రతాప్ వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌లకు కోరా రు. యువకుడినైన తాను విజయం సాధిం చే అవకాశాలు ఉన్నాయని వారిద్దరినీ విడివిడిగా కలిసి విన్నవించారు. నియోజకవర్గ పరిస్థితులను వివరించా రు. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలో యువకులకు ప్రాతినిధ్యం కల్పిస్తే అన్ని వర్గాల ఓట ర్లను ప్రభావితం చేయవచ్చని, యువజనుల కోటా లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై పరి శీలిస్తానని చెప్పి అధినేత చంద్రబాబు వెళ్లిపోగా, ఆయన తనయుడు లోకేష్ మాత్రం యువమంత్రానికి కాస్త లొంగినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా గతంలో పీఆర్‌పీ అభ్యర్థిగా తాను సాధించిన ఓట్లు, స్థానికంగా టీడీపీ బలం, ప్రస్తుతం నాయకుల్లో ఉన్న భేదాభిప్రాయాలు తదితర అంశాలను ప్రతాప్ వివరించినట్లు తెలిసింది.
జిల్లా టీడీపీలో యువకుల ప్రాతినిధ్యం పెంచేందుకు, తద్వారా లోకేష్ పేరుతో ప్రత్యేక వర్గాన్ని తయారు చేసేందు కు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందు లో భాగంగా యువ నాయకులకు ప్రత్యేక గుర్తింపునిచ్చే దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోం ది.ప్రతాప్‌తో ఆయన మాట్లాడిన తీరు ఈ అభిప్రాయం కలిగిస్తోందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సై‘కిల్’ యాత్ర!
Published Sat, Feb 1 2014 3:31 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement